వలస వరసలు!


బ్రెజిల్ నుంచి మడగాస్కర్ వైపుకు 9800 కిలోమీటర్లు ఇటీవల ఒక ఆడ తిమింగలం ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించిదిట!సామాన్యంగా ఇంత స్థాయిలో ఈ జీవులు వలస రావని తెలుస్తోంది.అందునా ఆడ తిమింగలాలు ఇలా చేయటం అరుదు.కాలేజ్ ఆఫ్ ద అట్లాంటిక్, బార్ హార్బర్ బయోలజిస్ట్ పీటర్ స్టెవిక్ ఈ విషయాన్ని చెబుతున్నారు. సముద్ర జలాలలో పూర్తిగా తగ్గిపోతున్న స్పీసీస్ వలన వలస వచ్చే ప్రక్రియలలో కూడా మార్పు ఉండవచ్చని ఒక అంచనా.అలాగే అతి తక్కువ సంఖ్యలోకి వెళ్లి“వలస వరసలు!”ని చదవడం కొనసాగించండి

అటెండెన్స్


మీరు చూస్తున్నది ఆర్.ఎన్.ఏ మోలిక్యూల్స్. ఇవి బేక్టీరియాలో తన లాంటి బేక్టీరియాలు ఎన్ని ఉన్నాయి అని అటెండెన్స్ తీసుకునే ప్రక్రియలో సహాయపడతాయి.దీనిని కోరం సెన్సింగ్  అని వైఙ్ఞానికులు చెబుతున్నారు. బోనీ బేస్లర్ అనే ఆవిడ ఇవి ‘మాట్లాడుకోవటం వింటున్నారు! ఏమి మాట్లాడుకుంటున్నాయంటే…అవి ఏ శరీరంలోనైతే దాగి ఉన్నాయో,దానిని నాశనం చేయటానికి కావలసినత మంది జట్టులో ఉన్నారో లేరోనని తెలుసుకోవటం కోసం అటెండెన్స్ తీసుకుంటున్నాయట! ఇంకేం మాట్లడతాం? ఈ పరిశోధన చాలా విషయాలలో పనికి రావచ్చని అంచనా! ఇతర“అటెండెన్స్”ని చదవడం కొనసాగించండి

సాలెపురుగు,శాకాహారం!


శాకాహార  భోజనం  ఆరోగ్యానికి  చాలా మంచిదని  ప్రపంచం  గుర్తించిన  తరువాత  చాలా  మంది  శాకాహారానికి   మారటం  చూస్తున్నాం.కానీ  విడ్డూరమేమిటంటే  ఈ  మధ్య  వైఙ్ఞానికులు   శాకాహారి  అయిన  ఒక  సాలెపురుగును  కనుగొన్నారు! సాలెపురుగు  సామాన్యమైనది  కాదు. విష్ణువు  నాభి  నుండి  బ్రహ్మదేవుడు  ఆవిర్భవించి  సృష్టిని  చేపట్టినట్లు  దీని  కడుపులోంచి  పుట్టుకొచ్చిన  వస్తువు  ఒక  గూడులాగా  అల్లుకుంటుంది. కాకపోతే  ఆహారాన్ని  సంపాదించే  మార్గం  చిత్రమైనది. ఈ  సాలెపురుగులో  40 వేల  జాతులు  ఈ  రోజు  కూడా  మనం  చూడవచ్చుట! అయితే “సాలెపురుగు,శాకాహారం!”ని చదవడం కొనసాగించండి

నీ మనసు తెలుపు-వేదాంతం శ్రీపతి శర్మ


ఎన్నికలలో పోటీ చేసే ‘ కేండిడేట్ ‘ తెలుపు దుస్తులలో రావటం రోమన్ సంప్రదాయం నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. లేటిన్ భాషలో ‘ కేండిడేటస్ ‘ అంటే తెలుపు రంగు దుస్తులు తొడుక్కున్న వాడు. అలాగే ‘ ఇంకాండసెంట్ ‘ అంటే వెలుగుతున్నది… కొద్దిగా ముందుకు వెళితే ‘ కాండిడ్ ‘ అంటే ఫ్రీగా, ఓపెన్ గా ఉన్నవాడు అని అర్థం కదా? అందుచేత మన కాండిడేట్లు అందరూ ఓపెన్ గా, చాలా స్వతంత్రంగా బరిలోకి దిగి“నీ మనసు తెలుపు-వేదాంతం శ్రీపతి శర్మ”ని చదవడం కొనసాగించండి

బేబీ సిటింగ్-ఇది పురుషుల పని!-వేదాంతం శ్రీపతి శర్మ


ఆఫీసులో మా కొలీగ్ ఒకాయన ఎప్పుడూ ముళ్లమీద నిలబడ్డట్లు నిలబడుతూ ఉంటాడు.
‘ఏమోనండీ, ఇంటిలో చంటాడు. మావిడ ఎప్పుడు వాళ్ల ఆఫీసు నుంచి వెళ్లమంటుందో చెప్ప లేము. రెడీగా ఉండాల్సిందే. పాత రోజులే మేలు! ఓ బామ్మో, అమ్మమ్మో ఇంటిలో ఈ పనులు చూసుకునేది! ‘

అంటే మేము ఆయాలమా? అని అడుగుతున్నారు పెద్ద వాళ్లు.

నాయకులు-ఎన్నికలు-చేపలు!


ఎక్కడైనా నలుగురు కలిస్తే ఎవరైతే ఏదో ఒకటి పాడి వినిపించాలనుకుంటారో ఉన్నట్టుండి ‘ ఎవరైనా పాడండి విందాం ‘ అంటారు. చివరకు ఎవరూ పాడరు. ఇలా మొదలు పెట్టిన వారు కావలసినన్ని పాటలు పాడేసి అందరినీ కింద పడేసి ఇంటికి వెళుతూ ఉంటారు.

–వేదాంతం శ్రీపతి శర్మ

నవ్వు-నాలుగు విధాలు…వేదాంతం శ్రీపతి శర్మ


‘ ఆమె ముందర ఏమిటి ఆ నవ్వులు? ‘, భార్య అడుగుతూ ఉంటుంది.
‘ ఆ..అంత నవ్వొస్తోందా? ఒహో! పోయి కాఫీ పట్టుకు రా! ‘, భర్త అంటూ ఉంటాడు.
‘ పరాయ వాళ్ల ముందర పిచ్చ జోకులు, వెక్కిలి నవ్వులు. వాళ్లు వెళ్లగానే చిటపటలు, రుస రుసలు…’
‘ ఓహో, ఇంటికొచ్చింది నా వైపు వాళ్లైతే ఇరానీ కేఫ్లో బేరర్ లాగా మూతి ముడుచుకుని టీ కప్పులు పెడతావు. అదే నీ వైపు వాళ్లైతే ఎక్కడ లేని వయ్యారం, కిల కిలలు ఓహో, ఇల్లంతా సందడే! ‘

ఇదండీ వరస! అసలు ఏ.కే.47 అంటే అది గన్ను కాదు. అత్తా కోడల్ల తగువులు అని అర్థం.

క్రాస్ ఫైర్-వేదాంతం శ్రీపతి శర్మ


మీరి ఏ పని చేసినా ఒక సారి మీ భార్యామణిని అడగాలి అని మా సన్యాసిరావు గారు అంటూ ఉంటారు. ఎందుకండీ అని అడుగుతూ ఉంటాను. ‘ ఏమీ లేదు. మీరు ఒకటి అనుకుంటారు. అది తప్పో రైటో తెలియాలీ అంటే మరి అడగాలి …

వానరుల విచక్షణ!


వానరులలో పొదిగి యున్న ఆ సద్గుణాలను ఈ రోజు మానవులు ఒక్క సారి అవలంబించుకుంటే బాగుండుననిపిస్తున్నది!

-వేదాంతం శ్రీపతి శర్మ