కలిసుందాం రా…!


మార్చ్ 2010 లో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది.పెళ్లి ముందు శారీరిక సంబంధాలు పెట్టుకోవటంలో తప్పు లేదని ఖుష్ బూ చేసిన వ్యాఖ్యల మీద మద్రాసు హై కోర్టు తప్పు పట్టగా ఆమె సుప్రీం కోర్టులో దావా వేయగా న్యాయమూర్తుల బృందం అటువంటి పబులను తప్పు పట్టేందుకు ఏమీ కారణాలు లేవని చెప్పింది.వివాహం జరగకుండా కలసి ఉండే సంబంధాలు పెట్టుకోవటం కూడా తప్పు కాదని చెప్పింది. ~~~***~~~ ఆగస్ట్ 2010 లో సుప్రీం కోర్టు ‘లివ్“కలిసుందాం రా…!”ని చదవడం కొనసాగించండి

శ్రీ దక్షిణామూర్తి దీక్ష


ఈ దీక్ష స్వీకరించే వారు ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చే ముందు 40 రోజుల ముందు సోమవారం లేదా గురువారం స్వీకరిస్తారు. ఇది కోటప్ప కొండ గుడిలో కానీ లేదా దగ్గరలో శివాలయంలో కానీ, శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో కానీ లేదా ఒక మఱ్రి చెట్టు క్రింద కానీ ఎవరైనా స్వీకరించవచ్చు. స్ఫటిక మాల-54 లేదా 108 పూసలు గలది శ్రీ దక్షిణామూర్తి లేదా శివుని రూపుతో ఉన్నది ధరించటం జరుగుతుంది.ఇరుముడి 3 టెంకాయలు,మూడు రకాల పండ్లు,విభూతి,గంధం,కర్పూరం,తేనె,పటికె“శ్రీ దక్షిణామూర్తి దీక్ష”ని చదవడం కొనసాగించండి

మన ఇంఫ్రాస్ట్రక్చర్-కామన్ వెల్త్ ఆటల వ్యవహారం లో మొదటి పాఠం…


కుక్కలలో రకాలుంటాయి.ఒకటి ఊరకే కాలు నాకుతూ ఉంటుంది.రెండు ఎటు పరుగు తీసి ఏది నాకాలా అని చూస్తూ ఉంటుంది.మూడు అక్కడ ఉన్న వారి సైగ కోసం చూస్తూ ఉంటుంది.నాలుగోది చిత్రమైనది.సైగలతో ,చిటికెలతో పని లేదు.చిటికెలో ఎక్కడ పడితే అక్కడే నాకేస్తుంది.

ఇ.వి.ఎం లలో మోసం ఎలా ఉండగలదో చూద్దాం…


అమెరికాలో 2004 లో జరిగిన ఎన్నికలలో ఎన్నికల అధికారి స్వయంగా మోసం చేయగలిగే ప్రక్రియను పరీక్షించి ఒప్పుకున్న వీడియో ఒకటి చూద్దాం.2009 లో మన దేశంలో జరిగిన ఎన్నికలలో ఇ.వి.ఎం ల ద్వారా మోసాలు జరిగినట్లు వివాదాలు రావటం, ఎన్నికల సంఘం తోసిపుచ్చటం మనం చూసాం.మెమొరీ కార్డ్ ద్వారా మోసం చేయవచ్చు అన్నది, కంప్యూటర్ ద్వారా వెనక్కి లెక్క పెట్టించగలిగే పని కూడా చేయించవచ్చన్నది వాస్తవం.మోసం జరిగింది, జరగనిదీ విచారణ ద్వారా కానీ తెలియదు.కానీ ఎట్టి పరిస్థితులలో“ఇ.వి.ఎం లలో మోసం ఎలా ఉండగలదో చూద్దాం…”ని చదవడం కొనసాగించండి

ఈ గంగకెంత దిగులు…


ప్రళయం ప్రకృతి కాదు,మనమే సృష్టిస్తున్నాము!కనుల ముందునిలచి ఉన్న ప్రాణశక్తిని ఇదిగో ఇక్కడ కాదు, ఇక్కడ పెరగమని శాసిస్తున్నాము!

సినీ రంగం,సాంఘిక నేరాలు…


వ్యాపారం,సినీ పరిశ్రమ,రాజకీయాలు పెనవేసుకుని సాగే దేశం ఇది.ఫోర్త్ ఎస్టేట్ -మీడియా సామాన్యమైన పాత్రలో లేదు. సామాన్యులను మెంటల్ వారిలా తయారు చేసి తిరిగి ఈ మూడిటి ముందరా పీక్కు తినమని పడేస్తోంది మన మీడియా.ఈ నాలుగు దయ్యాలనూ నియంత్రించేందుకు సామాన్యులే పూనుకోవాల్సిన అవసరం ఉంది.

రాజ్యసభలోకి కొత్తగా వచ్చిన 55 మంది చరిత్రలు చూద్దాం…


పదమూడు రాష్ట్రాల నుంచి 55 మంది మహానుభావులు వెళ్లారు.పదిహేను మంది వారి అఫిడవిట్లలో వారి మీద నేరారోపణలు, విచారణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇటువంటి వారిలో ఎనిమిది మంది మీద గట్టి విచారణలు ఉన్నాయి.(హత్యలు,మానభంగాలు,ఫోర్జరీలు…) అన్ని పార్టీలు సమానంగా ఈ తరహా అభ్యర్థులను ముందుకు పంపారు.వీరిలో కొందరు ప్రబుధ్ధుల పేర్లు చూద్దాం.ప్రొఫ్ .బఘేల్ సింగ్ (బి.ఎస్.పి)ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో,డా.విజయ్ మాల్య కు రెండు ఫెరా కేసులు,రెండు చీటింగ్ కేసులు,గుండు సుధారాణి (టి.డి.పి)మీద మతం పేరిట గొడవ సృష్టించినందుకు“రాజ్యసభలోకి కొత్తగా వచ్చిన 55 మంది చరిత్రలు చూద్దాం…”ని చదవడం కొనసాగించండి

మన దేశంలో సివిల్ ఇంజినియర్లు లేరు!


విశ్వేశ్వరయ్యను కన్న దేశంలో సివిల్ ఇంజినియర్లు కరువయ్యారు. సాంకేతికపరంగా ఎంతో పేరు సంపాదించాం కానీ దేశనిర్మాణం విషయంలో యువతకు పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. ఆఫీసుకు పరుగులెత్తి అక్కడ ఎవరో విదేశీయుడికి ఒక ప్రొగ్రాం వ్రాసి సంపాదించాలనే కానీ అదే ఆఫీసుకు వెళ్లేందుకు ఇంత సమయం నాకెందుకు? రోడ్డు పరిస్థితి ఏమిటి అనే ఆలోచన లేదని అంకెల ఆగడాలు చెబుతున్నాయి. 500 మిలియన్ డాలర్లు ప్రభుత్వం 2012 నాటికి ఇంఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలని యోచించి ఉపయోగం?“మన దేశంలో సివిల్ ఇంజినియర్లు లేరు!”ని చదవడం కొనసాగించండి

ప్రధాన న్యాయమూర్తి గారు ప్రభుత్వం మీద ఆగ్రహించారు!


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల తప్పు పట్టారు.సి.ఆర్.పి.సి సెక్షన్ 24 ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే ముందు  న్యాయమూర్తితో సంప్రదింపులు అనివార్యం అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఆ పధ్ధతికి ప్రభుత్వం వారు స్వస్తి చెప్పటం మనం చూసాం.ఇది ఎవరి చర్య అని మనం ఆలోచించక్కరలేదు.ప్రభుత్వం లో కాలు జాపుకుని పడుకున్న ఐ.ఎ.ఎస్ దొరబాబులు వారి ప్రయోజనాల కోసం దేనికైనా తెగించగలరు.న్యాయమూర్తిగారి మాట లో జ్యూరిస్ప్రుడెన్స్ ఉంది.’మొన్నటి వరకు మంచి“ప్రధాన న్యాయమూర్తి గారు ప్రభుత్వం మీద ఆగ్రహించారు!”ని చదవడం కొనసాగించండి

సోషల్ సెక్యూరిటీ…మనం ఎక్కడున్నాం?


పేదా గొప్పా తారతమ్యాలు తప్పవు.అవి సమాజంలో యువత అనే ప్లాట్ ఫారం మీద ఎదురు బదురు నిలబడి నువ్వా నేనా అనుకునే పరిస్థితి రాకూడదు.యువత దేశం నిర్మాణం లో సమయాన్ని కలసి వెచ్చించగలిగే ఒక సందర్భాన్ని మనం సృష్టించాల్సి ఉన్నది.