ఆరోగ్యభాగ్యచక్రం-వేదాంతం శ్రీపతి శర్మ


ఆరోగ్యభాగ్యచక్రం-ఈ శీర్షికన 28 వ భాగంలో నేత్ర సమస్యల మీద ఈ రోజు ఆదివారం ఆంధ్రప్రభలో వ్యాసం ఉంటుంది చూడగలరు. ఇది జ్యోతిష శాస్త్రానికీ, ఆరోగ్యానికీ సంబంధించిన శీర్షిక.

‘ కంటిలో నలుసు ‘-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


కిటికీ దగ్గరకు వచ్చి ప్లాట్ఫార్మ్ మీద నిలబడ్డాడు. అటు వైపు నుంచి కిటికీ అద్దాన్ని వేలితో కొలుస్తున్నాడు. అది పగలగొట్టే ఆలోచనో లేక మరి ఏమిటో అర్థం కాలేదు. రైలు బయలు దేరే లోపు మరల ఎక్కేశాడు.

‘ఒక చింత చెట్టు, ఒక మఱ్రి చెట్టు’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


సంక్రాంతి వెళ్లిపోయుంది. ఒక చింత చెట్టుకీ, ఒక మఱ్రి చెట్టుకీ చెరో గాలిపటం అలా తగులుకుని ఉన్నాయి. కొద్ది సేపు అలా గాలికి అటూ ఇటూ ఊగాయి. ఒకటి నీలి రంగులో ఉంది. ఒకటి తెల్లని రంగులో ఉంది. ‘నా పేరు నీలు ‘ చెప్పింది నీలి గాలి పటం. తెల్లనిది కొద్దిగా సిగ్గు పడింది. ‘ నా పేరు నీలు ‘ రెట్టించింది నీలి గాలిపటం. తెల్లనిది మరల ఊగింది. ‘ శ్వేత ‘, కులుకుతూ చెప్పింది అది, ‘శ్వేతను నేను ‘

వేదాంతం శ్రీపతి శర్మ కథ ‘ బంగారు వాకిలి ‘


మిత్రులకు సమాచారం-నా కథ ‘ బంగారు వాకిలి ‘ ఈ వారం ‘ నవ్య ‘ వార పత్రిక ( తేదీ 07.01.2009 )లో చదివి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్ప గలరు.