‘న మంత్రం నో యంత్రం…’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


‘ అమ్మవారు ఆ కేలెండర్ లో బొమ్మలా ఉన్నారు. అసలుకి ఆవిడ మనలందరినీ ఎత్తుకునే ఉన్నది.’
పిల్ల లేచి నిలబడింది.’ ఎలా మావయ్యా?’
‘ మనకి తెలియదు. అమ్మ వొడిలో ఉన్నప్పుడు నువ్వు ఆడుకుంటావు అంతే! అమ్మ నిన్ను ఎలా ఎత్తుకుందో చూస్తావా?’…

‘నిన్న లేని అందమేదో'(25)-వేదాంతం శ్రీపతి శర్మ


ప్రేమించే వాడికి లోకాలతో పని లేదు. స్వర్గ నరకాలు పట్టవు. ప్రేమే ఒక ప్రపంచం! అది అలా స్థూలంగా నిలబడి ఉన్న ప్రపంచం కాదు. ఎప్పటికప్పుడు పొంగి పొరలి మనస్సనే చంద్రునితో ఆడుకుంటూ అంతరాత్మ అనే సూర్యుని చుట్టూ తిరిగిపోయే ప్రపంచం.

‘ఇమ్మొబయిల్’ -వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


ఈ జైలు అనంతం. ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు తాళం వేయగలదు. మరో ఆలోచన అన్ని ఆలోచనలకూ తాళం వేసి మూయగలదు… ఒక చిరునవ్వు చిన్నగా తాళం తెరవగలదు.

‘ నిన్న లేని అందమేదో’ (24)-వేదాంతం శ్రీపతి శర్మ


‘ ఆకాశానికి ఈ నది ఎంత చక్కగా అద్దం పడుతోంది? ‘

‘నిన్న లేని అందమేదో’ (23)-వేదాంతం శ్రీపతి శర్మ


జాగ్రత్తగా నాలుగడుగులు వేసి తోటలోంచి ఇవతలకి వచ్చాడు.
ఎందుకు గుర్తుకొచ్చిందీ?…ఏమో!

‘నిన్న లేని అందమేదో’ (22)-వేదాంతం శ్రీపతి శర్మ


ఏ నాడో జరిగిపోయిన కాలం లోని చప్పట్లను దుప్పట్ల లాగా కప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఏ లోకంలోనో నిదురించే పసి వాళ్లం. ఇలా ఈ ప్రకృతి ముందర నిలబడటం, ఒక కళాపోషకుని కెమెరాలో బందీ అవటం కళామతల్లి ఒడిలో వాలి అపారమైన ఆనందానుభూతిని ఇస్తున్నట్లుంది…

‘ నిన్న లేని అందమేదో’ (21)-వేదాంతం శ్రీపతి శర్మ


జలపాతంలోకి జాగ్రతాగా చూడు. నీరు ఎందరో అందమైన వనితలలాగా ముస్తాబయి అలా మారిపోయి మాయమైపోతూ ఉంటుంది. నువ్వు తొంగి చూడాల్సింది అక్కడ! అందానికి అందం కలుపు. ఆలోచనని నుదుటి బొట్టులాగా అలంకరించు. కల్పనను చీరెలా సింగారించు. నీలో మరో ప్రపంచం నిన్ను మరో సృష్టి వైపు నడిపిస్తుంది…’

‘నిన్న లేని అందమేదో’ (20)-వేదాంతం శ్రీపతి శర్మ


ఎవరైనా శృతి చేసి ఇయ్యమంటే క్షణంలో శృతి చేసి ఇచ్చే వాసంతి చిత్రంగా తీగెలను కదిలిస్తోంది. ఇవన్నీ భిన్నంగా మ్రోగాలనే అనిపిస్తోంది ఆ పిల్లకి…
శృతి తప్పాలని ఉన్నది. పాలు విరగాలని అనిపిస్తోంది. పొంగాలని ఆశ లేదు. ఏమో! విరిగిన పాలే కదా కళాఖండాలను తయారు చేసేది? ఆపి నవ్వుకుంది.

‘నిన్న లేని అందమేదో’ (18)-వేదాంతం శ్రీపతి శర్మ


ఎందుకో ఇంక కాసేపట్లో నిద్ర పట్టేయగలదు అనిపించింది. కలలోని ఆ నీటి మీద నడక సాగి ఆగిపోవచ్చేమోననిపించింది. ఒక తీరం అక్కడే దొరకగలదేమో అనిపించింది వాసంతికి!

”నిన్న లేని అందమేదో ‘(17)-వేదాంతం శ్రీపతి శర్మ


‘ ఓ బాటసారి ఇలా వెళుతూ మిమ్మల్ని చూసి ఏమీ చేయలేక ఇలా నా లాగా ఆగి కేవలం చూస్తూ ఉండిపోయినట్లు…అదలా ఉంచండి. ఎవరైనా ఆగిపోవాల్సిందే…