‘వంతెన’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


యాభై ఏండ్లుగా రోషన్ లాల్ అక్కడ పని చేస్తున్నాడు.’ఇది పెద్ద దర్బారు…’, అంటాడు,’…జీవితం నిజమో అబధ్ధమో మనకెందుకు? మృత్యువును మించిన నిజం లేదు!’ అతని తండ్రి నుంచి ధర్మబధ్ధంగా ఆ కర్మ కాండ అతనికి సంక్రమించింది. యాంత్రికంగా నిలబడి లోకాలు మారిన వ్యక్తి బంధువుల సమక్షంలో విధిగా విధానాన్ని నిర్వహించి వెళ్లిపోతాడు. ‘అందరినీ దాటించే వంతెనను నేను.నాకు భావోద్రేకాలతో పని లేదు.కదలిక అందరికీ పనికి రాదు…’,అంటాడు. నిగం బోధ్ ఘాట్ దగ్గర కూర్చుని ఎవరైనా ‘మీ నిజ“‘వంతెన’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ”ని చదవడం కొనసాగించండి

‘ఎదలోయల నిదురించే…’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


  ఎవరో జో కొడుతున్నారు. తెలియటం లేదు.ఎవరో పాడుతున్నారు.వినిపించటం లేదు.చల్లని గాలి ఎందుకు వీస్తోందో తెలియటం లేదు.ఎటు నుంచి ఎటు వీస్తోందో తెలియటం లేదు.తెలియకుండానే మబ్బులు చంద్రుని మీదకు పాకినట్లు నిద్ర ఎందుకు నా మీద వాలిపోతోందో తెలియటం లేదు… ~~~***~~~ ‘కథలో కొద్దిగా శృంగారం ఉంటే బాగుండేది…’,ఒకాయన అంటున్నాడు,’… అలంకారాలు బాగానే వాడారు కానీ పదజాలం అల్లినప్పుడు ఒకే సరళిలో ఉంటే బాగుండేది.’ టేబిల్ కు అటు కూర్చున్నాయన కళ్లజోడు తీసి దాని స్థానం గడ్డం“‘ఎదలోయల నిదురించే…’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ”ని చదవడం కొనసాగించండి

నిద్ర మిత్రులు!~వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


కార్పొరేట్ ఆసుపత్రి సెల్లార్ లో కాంటీన్ అది. ఓ కప్పు టీ తీసుకుని ఒక టేబిలు దగ్గర కూర్చున్నాను. ఎదురుగా ఒక ముసలాయన వచ్చి కూర్చున్నాడు. ‘ఎక్కడో చూసాను మిమ్మల్ని!’,అన్నాడు. ‘నా ఙ్ఞాపక శక్తి చాలా పూర్ సార్! కాకపోతే ఆసుపత్రిలో, రైల్వే స్టేషన్లలో, తిరుమల లైనులో ఎక్కడైనా బఫే లైనులో నాకనదరూ ఎక్కడో అక్కడ చూసినట్లే ఉంటారు! ఎవరైనా చెయ్యి ఎత్తితే నేను కూడా ఒక సారి కళ్లు ఎగరేసి చెయ్యి చూపిస్తాను!’ ‘బాగుంది. వాళ్లు“నిద్ర మిత్రులు!~వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ”ని చదవడం కొనసాగించండి

నేను దురాత్ముడను!


ఏ నిద్రలోనో నిదురిస్తున్న నీరజాక్షుని వద్ద నిలచాను ‘నేను దురాత్ముడను ‘,చిన్నగా పలికాను నాతో నీకొక పనుంది… నన్ను చూడటానికి మూడు కారణాలు ఆదుకొనే కార్యక్రమం చేపడితే ముందు చెడిపోయినవారిలో అందరికంటే ఎక్కువ చెడిపోయినవారితో మొదలెట్టాలి.నేను నీ ముందే ఉన్నాను… నేను దురాత్ముడను! రెండు,నన్ను బాగు చేస్తే పాటుగా ఎందరో బాగవుతారు. నీ పని సులభం! నేనంతటి దురాత్ముడను.నాతోనే మొదలెట్టు.నీకు నాతో పనుంది. నేను దురాత్ముడను! మూడు,నీ కీర్తిని వేయి రెట్లు పెంచగలను! నాలాంటివాడిని కూడా ఆదుకోగలడన్న“నేను దురాత్ముడను!”ని చదవడం కొనసాగించండి

‘ఇద్దరు’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


పెద్దాయన తప్పదన్నట్లు పార్కులోకి ప్రవేశిస్తాడు.ఆయన వెనుక భార్య అప్పుడప్పుడు అలా చేయిని పట్టుకున్నట్లు పట్టుకుని లోపలికి వస్తుంది. బిల్ గేట్సో లేక ఒబామా లాగానో మొత్తం పార్కంతా సింహావలోకనం చేస్తాడాయన.మెల్లగా ఇద్దరూ ఒక్కో చెట్టూ చూసుకుంటూ నడుస్తారు. ప్రతి చెట్టు దగ్గర ఏదో వెతుక్కుంటున్నట్లు  చూస్తారు. ఏమి పారేసుకున్నారో తెలియదు.రోజూ ఇంతే! దొరుకుతుందనే ఆశ మటుకు పోలేదు!ఒక రోజు కొద్దిగా వెంట నడిచాను. ‘ఏమి పోయిందండీ?’,అడిగాను. ఆవిడ వెనక్కి తిరిగి కొద్దిగా భయంగా చూసింది.పెదాల మీద చూపుడు“‘ఇద్దరు’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ”ని చదవడం కొనసాగించండి

దురద


‘మీ కోసం చేసే  ప్రోగ్రాం  కు మరో సారి స్వాగతం. ఈ రోజు మన ముందున్నారు,ప్రొఫెసర్ ఆదుర్ద సుబ్బారావు గారు! నమస్కారం ఆదుర్ద గారు!’ అటు విశాలమైన కళ్లజోడుతో ఆయన కనిపించాడు.వాళ్లావిడనే పంకించి చూస్తున్నట్లు అందరినీ చూశాడు. నేను కూడా టి.వీ లోకి వచ్చాను,, నన్ను తక్కువగా అంచనా వేయద్దు అని చెబుతున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. చిన్నగా చేతులు జోడించి ‘ నమస్కారం ‘ అన్నాడు. ‘ ఆదుర్ద సుబ్బారావు గారు దురద లోకి లోతుగా వెళ్లారు…అంటే“దురద”ని చదవడం కొనసాగించండి

సుబ్బారావు మరల అరుగు మీదకి వచ్చాడు!


సుబ్బారావు  చాలా రోజుల తరువాత అరుగు మీదకొచ్చి చెయ్యి పైకెత్తి నాయకుడిలాగా అటూ ఇటూ ఊపాడు. ‘ఎవరూ లేరు ‘,ప్రక్కనున్న శ్రీమతి చిన్నగా,చక్కగా చెప్పింది. ఎప్పటిలాగే గోడకి ఆనుకుని కూర్చున్నాడు సుబ్బారావు. ‘నీకు కనబడరు.ఈ చెయ్యి నేను జనం కోసం చూపించలేదు.ఈఅరుగు ప్రపంచానికి ఒక కిటికీ! ఇక్కడ ఆలోచనామృతం అలా జాలు వారుతుంది.’ ఎదురింటిలోని చిన్న కుర్రాడు గేటు తీసి ఇవతలకొచ్చి చక్కగా గోడ తడిపేశాడు… ఇటు తిరిగి ‘గుడ్ మార్నింగ్!’ అన్నాడు. ‘జాలువారింది!’ ‘కరెక్ట్!’ ‘ఇంతకీ“సుబ్బారావు మరల అరుగు మీదకి వచ్చాడు!”ని చదవడం కొనసాగించండి

‘ రాత్రి’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


‘ మన వ్యవస్థకు పట్టిన కాళరాత్రి ఇది.ఎంతసేపు,అదే తెల్లారుతుంది…’

సుబ్బారావుకు అరుగు మీదే సాహిత్య అకాడమీ!-వేదాంతం శ్రీపతిశర్మ


‘అవును మరి!అది రథం ముగ్గు.అందులో గొబ్బెమ్మలను బంధించి మమ్మలను గొబ్బెమ్మలను చేసి ఇంటిలో ఉంచారని చక్కగా చాటింది!మా మనోరథం సాగటంలేదని అందంగా చెప్పింది.’ ‘ఈ ముగ్గు భాష్యం ఎక్కడా వినలేదు!’

‘మరి? అదే సృజనాత్మకత అంటే!