శ్రీ ఖరనామసంవత్సర ఫలితాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు     మిత్రులకు,బ్లాగ్ బంధువులకు,ఆప్తులకు శ్రీ ఖరనామసంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం తొలి రోజు సూర్యుని తొలి కిరణాలు భరతభూమి మీదకు చేరినప్పుడు గల లగ్నాన్ని, గ్రహస్థితులను పరీక్షించి చూస్తే కొన్ని అద్భుత యోగాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం వాక్చాతుర్యం గలవారికి,నిజమైన నాయకులకు,స్వావలంబనతో, స్వయంకృషితో ముందుకు సాగిపోవువారికి,సేనాపతులకు,ధైర్యం గలవారికి,ఉపాసనలోనున్నవారికి,సూక్ష్మబుధ్ధి గలవారికి,డబ్బు సంపాదించాలనుకునే వారికి,సంతానం పొందాలనుకునేవారికి విశేషమైన ఫలితాలనివ్వగలదు. ప్రజలు ఎక్కువగా అనవసరమైన ఖర్చులు చేసే దిశగా పయనించగలరు.రాజకీయాలలో“శ్రీ ఖరనామసంవత్సర ఫలితాలు”ని చదవడం కొనసాగించండి

నవంబర్ 2010 రాశి ఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహ చంచరీక: నిరంతరం మంగళమాతనోతు మేష రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకునే మాసం ఇది.గతం లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.బాగా ఖర్చులు చేస్తారు.సహోద్యోగులతో జాగ్రత్తగా మసలవలసి ఉంటుంది.దూరప్రయాణం చేసే అవకాశం ఉంది.ఆదిత్య హృదయం చదవండి.శనివారం తక్కువ మాట్లాడండి. వృషభ రాశి: పదోన్నతి పొందుతారు.మిత్రులు సహకరిస్తారు.స్త్రీలు అభివృధ్ధిలోకి వస్తారు.లావాదేవీలు లాభిస్తాయి.నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాలలో మీ మొండి వైఖరి వలన ఇతరులు బాధ పడతారు. మీరు గతం“నవంబర్ 2010 రాశి ఫలాలు”ని చదవడం కొనసాగించండి

శ్రీ దక్షిణామూర్తి దీక్ష-కోటప్ప కొండ


శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ: ఈశ్వరుని అనుఙ్ఞ చేత భక్తుల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కొరకు ఈ క్రింది విషయాలను మనవి చేసుకుంటున్నాను: యల్లమునిమంద గ్రామంలో గతంలో మునులు మందలు మందలుగా శివుని ప్రార్థిస్తూ ఉండేవారు. సతీ వియోగం తరువాత పరమశివుడు లోకాలను సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత ప్రశాంతత లభించిందని పురాణం చెబుతున్నది.ఈ గ్రామమే ప్రస్తుతం యలమంద గ్రామం అని చెప్పుకుంటున్నాము.కోటప్ప కొండ ప్రాంతం లో మూడు శిఖరాలున్నాయి. బ్రహ్మశిఖరము (త్రికూటేశ్వరుడు/త్రికోటేశ్వరుడు),రుద్రశిఖరము, విష్ణు శిఖరము.బ్రహ్మశిఖరం మీద“శ్రీ దక్షిణామూర్తి దీక్ష-కోటప్ప కొండ”ని చదవడం కొనసాగించండి

సెప్టెంబర్ 2010 రాశిఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు మేష రాశి: మంచి లాభదాయకమైన మాసం.నూతన పరిచయాల వలన కొన్ని సొకర్యాలు ఏర్పడగలవు.ఒక దూరప్రయాణం ఉండగలదు.చమత్కారం గా మాట్లాడి అందరినీ ఆకర్షిస్తారు. ఇంటి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు.ధార్మిక పరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.నీరు వలన కలిగే జబ్బుల విషయంలో జాగ్రత్త వహించాలి. వృషభ రాశి: పదోన్నతి ఉండగలదు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉండగలవు.స్థిరాస్తి కలసిరాగలదు.బంధువులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన మాసం. మాసం పూర్వార్థంలో పిల్లలు“సెప్టెంబర్ 2010 రాశిఫలాలు”ని చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 2010 రాశి ఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు మేష రాశి: అసంతృప్తి నుండి బయట పడతారు.మాసం మధ్యలో దూరప్రయాణం సంభవం. మాసం చివర కొత్త పనులు చేపట్టగలరు.మీకంటే చిన్నవారి ఆరోగ్యం ఆలోచింపచేస్తుంది.పెద్దలు సహకరిస్తారు.పుకార్లను నమ్మటం మంచిది కాదు.అలసట వలన తొందరపాటు ఆలోచనలకు గురి కాగలరు. ఈ మాసం మంచి ఫలితాలను ఇవ్వగలదు.కలసి వచ్చే సంఖ్యలు 1,11. వృషభ రాశి: అదృష్టం కలసివచ్చే మాసం.ఇంటిలో సౌఖ్యం బాగుండగలదు.కుటుంబ సభ్యుల పురోగతి బాగుంటుంది. గతంలో వ్రాసిన ఒక డాక్యుమెంట్“ఆగస్ట్ 2010 రాశి ఫలాలు”ని చదవడం కొనసాగించండి

జులై 2010 రాశిఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు మేష రాశి:బంధువర్గానికి దగ్గరవుతారు. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతారు.కొత్తగా పెళ్లయిన జంటతో పరిచయం కాగలదు.నూతన జివన శైలిని అవలంబించే ఆలోచన కలుగవచ్చు.ఈ మాసం వ్యాపారం లాభించగలదు.సంతానం అభివృధ్ధిలోకి రాగలదు.మూడవ వారం బి.పి పరీక్ష చేయించుకోవాల్సి రాగలదు. విష్ణు సహస్రనామం చదవండి. వృషభ రాశి: విరోధులను అధిగమించాలనే తీవ్రమైన ఆలోచనలు కలుగవచ్చు.రెండవ వారంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. సరైన సమాచారం సమయానికి రాకపోవటం వలన కొంత వృధా ఖర్చు“జులై 2010 రాశిఫలాలు”ని చదవడం కొనసాగించండి

జూన్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం  మంగళమాతనోతు మేష   రాశి: ఈ      మాసం      వింత    అనుభవాలతో       ప్రారంభం   కాగలదు.  పెద్దలతోనూ   కావలసిన   వారితోనూ   జాగ్రత్తగా   వ్యవహరించవలసి   ఉంటుంది. కొత్త   వ్యక్తులు   పరిచయం      కాగలరు.   ఏదైనా   కొత్త   పనిని   మొదలు   పెట్టటం   మంచిది.  మూడవ   వారంలో   ఒక   కార్యక్రమం   చేపడతారు. పెద్దల   ఆశీర్వాదం   పొందుతారు.రవి,బుధ, శుక్ర   వారాలు  కలసి   రాగలవు. మంగళ   వారాలు     మౌనం    పాటించటం   మంచిది. వృషభ   రాశి: మూడవ   వారంలో   అనారోగ్యం    బాధించగలదు. వ్యాపారం     “జూన్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ”ని చదవడం కొనసాగించండి

మే 2010 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


ఈ మాసం ముఖ్యమైన గ్రహ సంచారం గురు గ్రహం మొదటి వారంలో కుంభం నుంచి మీన రాశికి చేరటం. కేంద్రం లోని ప్రభుత్వానికి ఒక సంచలనం సృష్టించే సంఘటన ఎదురు కావచ్చు. ప్రస్తుతం ఉన్న విపక్షానికి కొంత బలం చేకూరవచ్చు. ప్రధానమంత్రి గారి ఆరోగ్యం కలవర పెట్టగలదు. మాసం చివర పార్టీల కూటములలో భేదాభిప్రాయాల వలన సమస్యలు రావచ్చు.

ఏప్రిల్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ: సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు ఈ మాసం గ్రహస్థితి: రవి మీన మేష రాశులు,బుధుడు మేషం,శుక్రుడు మేష, వృషభ రాశులు,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,గురువు కుంభ రాశులు సంచరిస్తున్నారు. ఈ మాసం మేష సంక్రమణం విశేషం,కుంభ మేలా లో స్నానం విశేషమైన ఫలితాలను ఈయగలదు.మాసం మధ్య నుండి అనారోగ్యంతో బాధ పడు స్త్రీల ఆరోగ్యం బాగు పడగలదు.విషజ్వరాల బాధలు అధికంగా ఉండగలవు. ఒక విదేశీ నాయకుడు తీవ్రమైన అస్వస్థతకు గురి కాగలడు.ఆగ్నేయ“ఏప్రిల్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ”ని చదవడం కొనసాగించండి

‘వికృతి’ ఏమంటున్నది?-వేదాంతం శ్రీపతిశర్మ


ఈ సంవత్సరం దేశంలో అనుకోని కాలంలో వర్షాలు,ఉత్తరార్థంలో వ్యాపారంలోనూ, ఆర్థికంగానూ మంచి పరిణామాలూ,సాంకేతిక రంగంలో,వైఙ్ఞానిక రంగంలో మంచి పురోగతి,క్రీడా రంగంలో మంచి ఫలితాలు,భారతీయులకు ప్రపంచ వ్యాప్తిగా గుర్తింపు పొందు పురస్కారాలు,విదేశ వ్యవహారాలలో మంచి పురోగతి కనిపిస్తున్నాయి.