విలన్…


    ఒక సారి ఒక లోకల్ స్టేషన్ లో బండీ కోసం కూర్చున్నాను.ఆ రోజుల్లో ఎన్.ట్.ఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం ఆడిన వార్త చర్చల్లో ఉంది. బెంచీ మీద కూర్చున్న ఒకాయన తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.’ఏంటండీ ఈయన? ఈ వయసులో ఈ పనేమిటి? నాన్ సెన్స్!’,అన్నాడు.అక్కడ కూర్చున్న మరో వ్యక్తి నవ్వాడు.’సార్, అన్నీ సినిమా కథలే!సినిమా చూస్తూ ఉండటమే మన పని!ఊరకే బుర్ర పాడు చేసుకోనక్కరలేదు!’బాగుంది. సినిమాలలో హీరో విలన్ లా చివరి వరకూ కనిపించి“విలన్…”ని చదవడం కొనసాగించండి

మానవుడు, హక్కులు…!


ఈ బొమ్మ చూస్తే మనకు ఏదో గుర్తుకొస్తుంది. గాంధీ గారు, ఆయన వెనుక ఇతర స్వాతంత్ర్య సమర యోధులు ఉన్న చిత్రం… ఎందుకు పోరాడారు? ఎవరి కోసం పోరాడారు…అనిపిస్తుంది. ఇక్కడున్నది చీకటి బ్రతుకుల మధ్య పోరాటం-మరో స్వాతంత్ర్యం ఎక్కడ? ఎప్పుడు? ఈ రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దివసం! ~~~***~~~ రైల్వే ప్లేట్ఫార్మ్ మీద నిలబడ్డప్పుడల్లా నా మీద నుంచి రైళ్లు పరిగెట్టినట్లే ఉంటుంది. పట్టాల మీద నుంచి ఆ మనుషులు అలా ఊడ్చుకుంటూ, కడుగుతూ పోతూ“మానవుడు, హక్కులు…!”ని చదవడం కొనసాగించండి

దసరా శుభాకాంక్షలు!


శ్లో: పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సశివే అయి కమలే కమలానిలయే కమలానిలయ: స కథం న భవేత్ తవపదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే! జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే! మిత్రులకు, బ్లాగ్ బంధువులకు,ఇతర నెట్ వర్క్ బంధువులకు వేదాంతం శ్రీపతిశర్మ దసరా శుభాకాంక్షలు! ~~~***~~~

సుబ్బారావు అరుగు మీదకి వచ్చాడు!


‘చిట్టీ…’ ‘కాఫీ తీసుకోండి ‘ ‘ఇలా అరుగు మీదకి వచ్చి కూర్చుని చాలా కాలం అయింది ‘ ‘కరెక్ట్!’ ‘భాగ్యనగరం లో చాలా కాలంగా వాతావరణం ఏమీ బాగాలేదు.’ ‘ముందు కాఫీ తీసుకోండి. ‘రెండు గ్లాసులు కాఫీ పట్టుకుని నిలబడితే ఎలా ఉందో తెలుసా?’ చిట్టి పెదవి విరిచి ఒక ప్రక్కకు చూసింది. ‘చెప్పండి,మీకు ఓ ఆలోచన వచ్చినా కక్కు వచ్చినా ఆపకూడదు.తరువాత ఇబ్బంది.’ ‘దారుణంగా పోల్చావు.అయినా ఫరవాలేదు.తెనాలి రామకృష్ణకు పాలు,పెరుగు పట్టుకుని ఏమి కావాలో తీసుకోమని“సుబ్బారావు అరుగు మీదకి వచ్చాడు!”ని చదవడం కొనసాగించండి

పదములె చాలు…


కలాం గారు చెప్పిన కొన్ని విషయాలు ఇటీవల బల్క్ మెయిల్ లో వచ్చాయి.చాలా మంచి విషయాలు… ఆయన తండ్రి భాష యొక్క ప్రభావం గురించి చెప్పే వారట.మనసులో ప్రత్యేకమైన పదాలు సృష్టించే దృశ్యాల గురించి ఆయనకు బాగా తెలుసు.అంతే కాదు.పదాలు జీవితంలో సాద్ధించే వాటి మీద ఎంతో శక్తివంతమైన ప్రొగ్రామింగ్ చేస్తాయని ఆయన చెప్పే వారు. కలాం చిన్నతనంలో ,దాదాపు ఎనిమిది సంవత్సరాల వయసులో చెట్లు ఎక్కి తల క్రిందులా వ్రేలాడటం అలవాటు.ఒక ముప్పయి అడుగుల చెట్టు“పదములె చాలు…”ని చదవడం కొనసాగించండి

విధి


ఆర్మీ లోని మిత్రులతో బాగా పొద్దు పోయే వరకూ కూర్చున్నాను.వాళ్లు రకరకాల ప్రశ్నలు వేసారు. చేతులు చూడమన్నారు. రాత్రి పూట చూడనన్నాను. ఫేస్ రీడింగ్ చేయమన్నారు. సరదాగా ఒకరిద్దరికి చేసాను.అందరూ భవిష్యత్తు గురించి అడుగుతుంటే ఒక ఆలోచన వచ్చింది. ‘మీరంతా సైనికులు. వీటి గురించి మీకెందుకు?’,అన్నాను. ఒకాయన సిగరెట్ ముట్టించాడు. ‘మా మధ్యనే జరిగింది చెబుతాను వినండి…’,అన్నాడు. అందరం కుర్చీల్లోకి వెనక్కి వాలాం. ‘ఆ రాత్రి కూడా బాగా పొద్దు పోయింది.కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.కొద్దిగా ఛలిగా కూడా“విధి”ని చదవడం కొనసాగించండి

మహావీరుడు!


పుణెలో ఒక సారి కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనియరింగ్ లో ఒక మిత్రుడితో ఒక వారం రోజులున్నాను.అక్కడ సైన్యం లోని వాళ్లతో గడిపినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు  చర్చలోకి వచ్చేవి. రాత్రి మెస్ లో కూర్చున్నప్పుడు ఒక యువ కేప్టెన్ మరొకడితో 1971 యుధ్ధం విషయాలు చెబుతున్నాడు. కొద్దిగా దూరంగా కూర్చుని ఉన్న ఒక పెద్దాయన తన గ్లాసు పట్టుకుని వచ్చాడు. ‘యంగ్ మాన్, పెళ్లయిందా?’,అన్నాడు. అతను లేచాడు.ఈయన కూర్చోమని కూర్చోపెట్టాడు. ‘అమ్మాయిని చూసావా?’ ‘నో సర్!’“మహావీరుడు!”ని చదవడం కొనసాగించండి

గూగుల్, సాంబ్రాణీ,అరుణాచల్ ప్రదేశ్!


హిందీలో గూగల్ అంటే మనం వెలిగించుకునే సాంబ్రాణీ.దీని ధూపం చాలా ప్రశస్తమైనదని ,దృష్టిదోషం నిర్మూలిస్తుందని,సాయంత్రం వేళలో ఇంటిలో కానీ ఇంటి గడపకు కానీ ఈ ధూపాన్ని వేస్తే లక్ష్మీప్రదమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి! అస్తు! చిన్నప్పుడు మా ఇంటి ప్రక్కన చాలా లావుగా ఉండే ఒక మహిళ ఉండేది.గేటు దగ్గర నిలబడి వచ్చే పోయే వాళ్లను పంపిస్తూ ఉండేది.సాంబ్రాణీ సాయబు వచ్చి పొగ చేసి నెమలి ఈకను అటూ ఇటూ ఊపే వాడు.ఆవిడ అలాగే నిలబడేది.పైసా రాల్చేది కాదు.కొత్తల్లో“గూగుల్, సాంబ్రాణీ,అరుణాచల్ ప్రదేశ్!”ని చదవడం కొనసాగించండి

ఎందుకు చదువుతాం…


ఆలోచనలు సర్పాలలా పాకుతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. కొన్ని విషం చిమ్ముతాయి.కొన్ని దాక్కుంటాయి. కొన్ని చుట్టేసి బిగిస్తూ ఉంటాయి. ఊపిరి ఆడదు…వీటిని ఆయుధంగా స్వీకరించి బుధ్ధితో మథించి జీవితసత్యాలను అమృతంలా అనుభవించినవారికి అక్షరసత్యాలు అణు బాంబులలాగా శక్తివంతంగా చిత్తంలో దాగి ఉంటాయి…