పచ్చని చిలుకలు తోడుంటే…


Bass సౌండ్ అంటే ఏమిటని ఒకాయన ఒక సౌండ్ ఇంజనియర్ ని అడిగాడు. ఆయన  ఎన్నో రకాలుగా చెబుతున్నాడు.ప్రక్కనే కూర్చున్నాయన ఒక మాట అన్నాడు.’సార్, యేసుదాస్ గారి గొంతు విన్నారు కదా? అది  Boss   మైక్ లేకుండా Bass సౌండ్ అంటే!’ నిజమే! చక్కని సాహిత్యం(తమిళం లోంచి అనువదించినా ఈ పదాలు అందరికీ దొరకాలిగా?) చక్కని సంగీతం,చాలా సృజనాత్మకంగా చిత్రీకరించిన పాట ఇది.ముఖ్యంగా ఈ చిత్రం లో చాలా సరైన సమయం లో చూపించిన పాట.రెండు“పచ్చని చిలుకలు తోడుంటే…”ని చదవడం కొనసాగించండి

ప్రేం కా ఛుట్ హై ఫటాకా తో ధమక్ …


  మన జానపదం లోని అద్భుతం ఇది! వెనుక పాల్గొంటున్న వారి హావభావాలు,మధ్య మధ్యలో నాటక పక్కీలో సాహిత్యానికి భావ ప్రదర్శన ఇస్తూ తిరిగి లయలోకి సున్నితంగా జారుకుని నాట్యం చేసే తీరు గొప్పది. నౌషాద్ , షకీల్ బదాయుని కాంబినేషన్, దిలీప్ కుమార్ బృందం అదరగొట్టిన పాట ‘గంగ జమునా’ చిత్రం లోనిది.

చిగురులు వేసిన కలలన్నీ…


ఈ పాట విన్నప్పుడల్లా గుండెలో ఏదో గుబులు. ఎందుకో తెలియదు. చిన్నతనంలో మా ఎదురింటి లోంచి మర్ఫీ రేడియో మ్రోగటం, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, మధురమంజరి అనే పాటల ప్రొగ్రాం ఇలా అన్నీ గతస్మృతులు దొరలిపోతాయి… నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే!  నారాయణరెడ్డిగారి మాటలు, సాలూరి వారి సంగీతం, కళ్యాణి రాగం, కె.బి.కె. మోహన్ రాజు గారి మొదటి సినీ గీతం,సుశీల గళం అన్నీ ఈ యుగళం లో కలసిపోతాయి. ఒక ఫొటో“చిగురులు వేసిన కలలన్నీ…”ని చదవడం కొనసాగించండి

మౌనమె నీ భాష…


నేపథ్య గీతాలలో ఈ పాట ఎందరి నోట్లలోనో ఆడుతూ ఉంటుంది.అంతే కాదు.నేనేమీ మాట్లాడను అని చెప్పాలనుకున్నప్పుడు మిత్రులు చాలామంది చిన్నగా ‘మౌనమె నీ భాష…’అంటూ ఎత్తుకుంటారు! బాలచందర్ గారి ‘గుప్పెడు మనసు ‘ చిత్రంలో ఒక్క సారిగా కథ యావత్తూ నిశ్శబ్దం లోకి వెళ్లినప్పుడు ,అందరి ఆలోచనలూ ఆగిపోయినప్పుడూ, మౌనాన్నీ, మనసునూ ముడి పెట్టి ఒక నేపథ్య గీతాన్ని ఎంచుకుని దర్శకుడు అద్భుతమైన ప్రక్రియను చూపిస్తాడు.ఆత్రేయ గారు ఆబ్స్ట్రాక్ట్ వస్తువుకు కాంక్రీట్ స్వరూపాన్ని ఇచ్చినట్లు నాకు తెలిసి“మౌనమె నీ భాష…”ని చదవడం కొనసాగించండి