ఈ రాష్ట్రం లో ప్రభుత్వం ఉన్నదా?


ముప్పయి మూడు లోక్ సభ సభ్యులను కాంగ్రెస్ జెండా క్రింద పంపిన రాష్ట్రం.అగ్ర రాష్ట్రాలలో ఒకటైన రాష్ట్రం.విస్తీర్ణం లో నాలుగో అతి పెద్ద రాష్ట్రం.దేశం లో జి.డి.పీ విషయంలో నాలుగో స్థానం లో ఉన్న రాష్ట్రం.జనాభాలో అయిదవ స్థానంలో ఉన్న రాష్ట్రం.పన్నుల  నుండి ఆదాయం లో మహారాష్ట్ర తరువాత రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం (323369 కోట్లు).రెండున్నర కోట్ల వోటర్లు 2009 లో (రెండవ స్థానం)వోట్లు వేసిన రాష్ట్రం… వరదల వలన 50 లక్షల ఎకరాలు నాశనం“ఈ రాష్ట్రం లో ప్రభుత్వం ఉన్నదా?”ని చదవడం కొనసాగించండి

యూరోపియన్ యూనియన్ తో భారత్ ఒప్పందం


ఇటీవల యూరోపియన్ యూనియన్ తో తీవ్రవాదం అంశం మీద భారత్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం: 1. తీవ్రవాద సంస్థల స్థావరాలకు  విరుధ్ధంగా, తీవ్రవాదుల రాకపోకలను పట్టుకొనే విధంగా సంయుక్త చర్యలకు వీలుగా కొన్ని నియమాలు సృష్టించటం 2. తీవ్రవాదులకు ఆర్థిక వనరుల సదుపాయానికి విరుధ్ధంగా చర్యలు 3. స్ట్రాటజిక్ ఇంఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకోవటం 4. పరస్పర న్యాయ సహకారం-ఎక్స్ట్రద్షన్ ఇత్యాదులు 5. అంతర్జాతీయ సివిల్ ఎవియేషన్ లో,ప్రయాణాలలో విధానాలలో,ఇ-మెయిల్ ఇత్యాదులలో సహకారం 6.“యూరోపియన్ యూనియన్ తో భారత్ ఒప్పందం”ని చదవడం కొనసాగించండి

కనులు కనులతో…


నెబ్రాస్కా యూనివర్సిటీ వారు ఈ మధ్య ఓ చిత్రమైన పని చేసారు.ఓ కంప్యూటర్ లో ఒక ముఖ చిత్రాన్ని పెట్టి దాని కళ్లు అటూ ఇటూ తిప్పుతున్నప్పుడు దాని ముందు రాజకీయ నాయకులను కూర్చో పెట్టి ఎవరు దానితో పాటు తిప్పుతారు,ఎవరు తిప్పరు, ఇలా  ఎందుకు జరుగుతుంది అనేది పరీక్షించారు. పరీక్షలలో తేకిందేమిటంటే అలా కళ్లు తిప్పని వారందరూ కన్సర్వేటివ్స్! తిప్పే వారందరూ లిబరల్స్ ట! సామాజిక స్పందనకు,మనిషి శారీరిక పరమైన ప్రతిక్రియలకు,ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారనే“కనులు కనులతో…”ని చదవడం కొనసాగించండి

ఓ నిజమైన సినిమా కథ!


హైదరాబాదులో ఒక రైల్వే యార్డు దగ్గర నివసించే శమీం తోటి పిల్లలతో ఆడుకుంటూ ఒక గూడ్స్ బండీ ఎక్కేసాడట! తిన్నగా అది అతన్ని చెన్నై తీసుకుని వెళ్లింది. 1995 లో అక్కడ ఒక జువనైల్ గృహం లో చేరాడు. కోయంబేడు లో ‘ఉధ్ధవి ‘ అనే ఒక సాంఘిక సంస్థలో చేరి టైలరింగ్ నేర్చుకున్నాడు. ఒక కంపనీలో ఉద్యోగంలో చేరాడు. తన గతాన్ని మరచిపోవటం వలన తల్లి దండ్రుల గురించి ఆలోచన రాలేదు. ఒక్క సారిగా చిన్నతనం“ఓ నిజమైన సినిమా కథ!”ని చదవడం కొనసాగించండి

గడ్డరికా ప్రవాహం-మన సాంకేతిక విద్య!


మన దేశం లోని సాఫ్ట్ వేర్ విద్యార్థులలో 75% మంది రానున్న సంవత్సరం నిరుద్యోగులుగా మిగిలిపోగలరని నాస్ కోం హెచ్చరించింది.మన రాష్ట్రం లోని కళాశాలలోంచి 12 శాతమే కాంపస్ రెక్రూట్ మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారని తెలుస్తోంది. ఈ వెర్రి తెచ్చి పెట్టిన సమస్యను మరి కాస్త పరిశోధిద్దాం…రాష్ట్రంలో 700 ఇంజనియరింగు కళాశాలల పరిస్థితి దారుణంగా ఉన్నదని తెలుస్తోంది.గత రెండు సంవత్సరాలలో దాదాపు 3.2 లక్షల ఇంజినియరింగు విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండిఓయారని మంత్రి గారు చెబుతున్నారు.ఈ సంఖ్యకు 1.2“గడ్డరికా ప్రవాహం-మన సాంకేతిక విద్య!”ని చదవడం కొనసాగించండి

మనిషి మారలేదు…


ఇదే సమస్య. ప్రజలను దోచుకునేందుకు మాకు సరైన అవకాశాలు ఇవ్వలేదని మంత్రులు పబ్లిక్ గా బాధపడుతున్నారండీ ! వారిని ఓదార్చే ప్రక్రియలు కూడా ప్రారంభమయ్యాయి. మన ‘ప్రజా భక్షణ’ డిమాండులకు దిక్కు మాలిన హై కమాండ్ కూడా ఏదో చెయ్యబోతోందిట! 16.03.1947 లో శ్రీ శ్రీ గారు మద్రాసు  ‘ప్రజా రక్షణ ‘ ఆర్డినెన్స్ జారీ చేసిందని విని ఇలా వ్రాశారు: దేశం కోసం త్యాగం చేశామని చెప్పి పదవి చేపడగానే చూశారా! మన కాంగ్రెస్ చేసిన“మనిషి మారలేదు…”ని చదవడం కొనసాగించండి

జగన్ ‘కాఫీహౌస్’ చెస్!


  చదరంగం ఆటతో పరిచయం ఉన్న వాళ్లు ఈ రకమైన ఆటను గుర్తు పట్టగలరు.ఆటలోకి దింపి నువ్వాడింది తప్పు అని నిరూపిస్తూ  రిస్కులు తీసుకుంటూ ఆటను ఫోర్స్ చేస్తాడు ఆటగాడు.ఈ పధ్ధతిలోనే తెరవాట-తెరచి రాజు అనే పధ్ధతి కూడా ఉన్నది. నిజమే! రిస్కు తీసుకోలేకపోతే ఆటా లేదు, పాటా లేదు!ఆంధ్ర ప్రదేశ్ లో అసలు ఏమిటి పరిస్థితి అనేది సోనియాకు ఆ ముగ్గురూ ఏదో చెబితే,ఒక్క పూట కూడా రాష్ట్రానికి రాని మేధావులు ఏదో కూస్తే, సినిమా“జగన్ ‘కాఫీహౌస్’ చెస్!”ని చదవడం కొనసాగించండి

మాట్లాడు మాట్లాడు మోహనా!


ఏమీ చేతకానితనాన్ని చాలా మౌనంగా ఎంతో తెలివితేటలతో వ్యవహారం చేస్తున్నట్లు రంగులు పూయించుకుని కాలం వెళ్లదీయటం సంకీర్ణ ప్రభుత్వాలలో చాలా మంచి స్ట్రాటజీ అని కనిపిస్తున్న తరుణంలో స్వామీజీ మంచి చెక్ పెట్టాడు. సుప్రీం కోర్టు సింపుల్ గా ప్రధానిని అఫిడవిట్ ఇవ్వమని సెలవిచ్చింది. సి.బి.ఐ విచారణ చేపట్టినా ఆ మంత్రి పదవిలో కొనసాగటాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తోంది. అలాగే సి.బి.ఐ పని తీరును విమర్శించటం కనిపిస్తోంది. సోలిసిటర్ జనరల్ గారు సినిమా పక్కీలో చాలా మంచి“మాట్లాడు మాట్లాడు మోహనా!”ని చదవడం కొనసాగించండి

ఫోర్బ్స్ అతి శక్తివంతులైన గ్రామీణ వ్యక్తుల జాబితాలో నాందేడ్ నివాసి!


ఈయన పేరు దాదాజీ ఖోబ్రగడె. ఈయన వరి పంటలో ఒక కొత్త రకం కనిపెట్టి దానికి ఎచ్.ఎం.టి అని నామకరణం చేసారు.ఇది మామూలు రకం కంటే 80 శాతం ఎక్కువ పంటను ఇస్తుంది. దీనిని వాడి చాలా మంది రైతులు ఈ రోజు కార్లలో తిరుగుతున్నారని చెబ్తున్నారు. ఈయన పేరు ఫోర్బ్స్ లిస్టులో కూడా వచ్చింది. కాకపోతే దాదాజీ అనివార్య కారణాల వలన ఆయన మూడు ఎకరాల భూమిని అమ్ముకుని రోడ్డు మీద ఉన్నాడు… ప్రభుత్వాలకు స్కాముల“ఫోర్బ్స్ అతి శక్తివంతులైన గ్రామీణ వ్యక్తుల జాబితాలో నాందేడ్ నివాసి!”ని చదవడం కొనసాగించండి

ఓరే రాజా…


  సెప్టెంబర్ 13 2010 న కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ సి.ఎ.జీ సరిగ్గా పని చేయటం లేదు,రాజ్యాంగం లో నిర్దేశించిన తీరుగా ఆ సంస్థ లేదని పేర్కొన్నారు. (ఇండియన్ ఎక్స్ప్రెస్) రైల్వే శాఖ లో మోటర్ కార్లను ‘అత్యవసర వస్తువుల ‘ జాబితాలో చూపటం,సాంకేతికంగా వీలు కాకపోయినా సి.సి.ప్లస్ కెపేసిటీ లో వేగన్లను లోడు చేయటం,రైల్వే దుర్ఘటనలు నిజానికి ఇటువంటి లోడింగు వలన , తద్వారా వెల్డింగ్ ఫ్రేక్చర్లు, లోకో ఫైల్యూర్లు వలన“ఓరే రాజా…”ని చదవడం కొనసాగించండి