2011 ఆంగ్ల సంవత్సరం మీకెలా ఉంది…


పదకొండులో పదనిసలు

మిత్రులకు, బ్లాగ్ బంధువులకు 2011 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!

 

మీరు పుట్టిన తేదీని బట్టి సన్ సైన్ నిర్ణయించుకుని 2011 లోని విశేషాలను చూసుకోగలరు.

2011 చాలా మంది జీవితాలలో కొన్ని విచిత్రాలను ముందుకు తీసుకుని రాగలదు.ఈ సంవత్సరానికి ఒక ప్రస్ఫుటమైన విశేషం ఉన్నది.దేనినైతే మరచిపోయామని మనం అనుకుంటామో అది మరో రూపంలో ముందుకు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రపంచ దేశాలలో నాయకత్వాలు ఎక్కువగా విశ్లేషణల మీద కాకుండా మానసిక ప్రోద్బలం మీద నిర్ణయాలు తీసుకోవటం వలన భారీగా ఇబందులు ఎదుర్కునే సూచనలున్నాయి.ఐరోపా దేశాలకు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

భారత దేశానికి మే నెల వరకూ ప్రశాసనికపరమైన ఇబ్బందులు దండిగా ఉ ండవచ్చు.ప్రజలకు మానసికపరమైనవి,కళ్లకు సంబంధించినవి,అంటువ్యాధు లు ఇత్యాదుల రోగాల వలన బాధలుండగలవు.ఆంధ్ర రాష్ట్రానికి జనవరి నుండి మే మాసం లోపు తీవ్రమైన సమస్యలు కనిపిస్తున్నాయి.

వ్యాపారస్తులకు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవటం వలన ఇబ్బందులుండగలవు.వైఙ్ఞానికులకు, శిక్షకులకు మంచి సంవత్సరం.

ప్రేమికులు మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి!భార్యా భర్తల సంబంధాలలో ఇరువురూ జీవితభాగస్వామి దగ్గరనుంచి చాలా ఎక్కువ ఆశించటం వలన కోపతాపాలకు లోను కాగలరు.
విద్యార్థులకు, నిరుద్యోగులకు  మంచి సంవత్సరం.

మేషం (మార్చ్ 21-ఏప్రిల్ 30)

సంవత్సరం ప్రారంభంలో ఇతరులను మరింత వివేకంతో అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు.దానధర్మాలకు కాలం వెచ్చిస్తారు.కళల పట్ల ఒక మంచి అవగాహన ఏర్పడగలదు.సంవత్సరం తరువాతి భాగంలో ఆత్మబలం అధికం  కాగలదు.కొత్త పనులను చేపడతారు.నూతన విద్యను అభ్యసించేందుకు మంచి ప్రయత్నాలు చేస్తారు.మీ యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు కొన్ని చిలిపి పనులు చేస్తారు!శరీరం బరువు బాగానే పెరగగలదు.
ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ అజీర్ణం, ఎముకల విషయం లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.జూన్ మాసం నుండి అదృష్టం కలసి రాగలదు.పెట్టుబడులు లాభించగలవు.ప్రయాణాలు చేయాలనే తీవ్రమైన కోరిక కలుగగలదు.
కొందరికి ఈ సంవత్సరం జీవితంలో కొత్త మలుపు కాగలదు.

మందులు,రత్నాలు,రాళ్లు,రసాయనాల రంగాల వారికి విశేషమైన ఫలితాలుండగలవు.
బత్తాయి రంగును చిక్కని నీలం మీద వాడిన వారికి అదృష్టం కలసి రాగలదు.

వృషభం (ఏప్రిల్ 21-మే 21)

ఈ సంవత్సరం మిత్రుల వలన పొందిన లాభాలను పొందుపరచుకోవలసి ఉంటుంది. పెరిగిన పరపతిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.విదేశీయులతో మంచి సంబంధాలు ఏర్పడగలవు.కొంత మంది పట్ల కరుణతో వ్యవహరిస్తారు.ఈ సంవత్సరం మీ శత్రువులు నిస్సహాయ స్థితి లోకి వెళ్లటం వలన మీకు కొన్ని లాభాలుండగలవు.
ఇతరుల ప్రేమను పొందటం లేదనే ఒక భావన మిమ్మల్ని బాధ పెట్టగలదు.పాత మిత్రులు గుర్తుకు వస్తారు.స్టాక్ మార్కెట్ లో ధనం వెచ్చిస్తారు. ఈ విషయంలో ఉత్తరార్థం  మంచిది.
అవివాహితులకు ఫిబ్రవరీ, ఆగస్ట్ మాసాలు అదృష్టం కలసి వచ్చే మాసాలు.
రాజకీయాలలో ఉన్న మహిళలకు ఈ సంవత్సరం చాలా బాగున్నది.జీవిత భాగస్వామి పట్ల దుడుసుగా వ్యవహరించటం మంచిది కాదు.వాద్వువాదాలకు దిగకండి.
మార్చ్ నెలలో ఆరోగ్యం కొంత కలవర పెట్టగలదు. ఈ సంవత్సరం చర్మం విషయం లో శ్రధ్ధ వహించవలసి ఉంటుంది.
కాగితాల మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.
ఉద్యోగస్తులు కొందరు ఉద్యోగ విరమణ నిమిత్తం ఆలోచన చేయగలరు.
దొంగ దారులు తొక్కే ఆలోచన లేకపోతే ఈ సంవత్సరం మంచి ఫలితాలనివ్వగలదు.

గృహ నిర్మాణ వస్తువులు,నూనె,స్త్రీల వస్తువులు,ముత్యాలు,ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీస్ లో వ్యాపారం చేసే వారికి కలసి రాగలదు.

పావురాయి రంగు వాడిన వారికి విశేషమైన లాభాలుండగలవు.

మిథునం (మే 22-జూన్ 21)

వృత్తులలో రణిస్తారు.మంచి గుర్తింపుతో పాటు పురస్కారాలు కూడా లభించగలవు.అధికార దుర్వినియోగానికి తీవ్రమైన ప్రలోభాలు ఉండగలవు.వృత్తి రీత్యా చాలా ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రాగలదు. రాజకీయ రంగంలో ఉన్నవారు మే నెల వరకు ఆర్జించిన పేరును ఆ తరువాత పోగొట్టుకునే అవకాం ఉన్నది.
పరిశ్రమలలో ఉన్న వారికి చక్కని ఫలితాలు కలవు.కాకపోతే ఇంటి బాధ్యతలు ఎక్కువయి ఇంటి పట్ల శ్రధ్ధ వహించవలసి ఉంటుంది.ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం ఆలోచింప చేస్తుంది.
మానసిక అందోళన వలన కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోగలరు.ధ్యాన మార్గం అవలంబించండి.
సంవత్సరం చివర ధార్మిక చింతన అధికం కాగలదు.
హృద్ రోగం ఉన్న వారు శ్రధ్ధ వహించాలి.గృహ నిర్మాణం చేయదలచుకున్న వారికి మంచి సంవత్సరం.

పుస్తకాలు, పేపరు, పత్రికలు,పాలు,ఇన్స్యురెన్స్ రంగాల వారికి ఇది మంచి ఫలితాలనిచ్చే సంవత్సరం.

ఈ సంవత్సరం పసుపు,బ్రౌన్  రంగులు ఉపయోగించటం మంచిది.

కర్కాటకం(జూన్ 22-జులై 23)

మార్చ్ నెల నుంచి తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతంగా పూర్తి కాగలదు. కళాకారులు రాణిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలున్నాయి. వ్యాపారస్తులకు సంవత్సరం ఉత్తరార్థం కలసి రాగలదు. ప్రయాణాలు వీలయినంత వరకు మానుకోవటం మంచిది.బదిలీలు కోరుకుంటున్న వారికి మంచి సంవత్సరం.మీ కంటే చిన్న వారి విషయాలలో దూకుడుగా కాకుండా నిదానంగా ప్రవర్తించ వలసి ఉంటుంది.
కొందరి ప్రవర్తన అర్థం కాకపోవటం వలన చికాకులు ఉండవచ్చు.కొందరు ప్రతిభావంతులకు  ప్రభుత్వం ఆహ్వానం పంపగలదు.రాజకీయాలలోని వారికి కొత్త మలుపులు కనిపించవచ్చు.
స్త్రీలు బంధువర్గం తో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.కొన్ని ఉదర బాధలను మినహాయిస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంవత్సరం చివర    ప్రసవం ఉన్న స్త్రీలు తగు జాగ్రత్తలు వహించాలి.
కోర్టు వ్యవహారాలలో ఉన్న వారు ఆగస్ట్ మాసంలో మధ్యవర్తిత్వాలను వాడుకునే ప్రయత్నాలు చేయటం మంచిది.

కేబిల్స్,ప్రచురణలు,సంగీత వాయిద్యాలు,దృశ్య సాధనాలు వగైరాల రంగాల వారికి విశేషంగా లాభించేసంవత్సరం.

ఈ సంవత్సరంతెలుపుతో తామ్ర రంగును కలిపి వాడటం మంచిది.

సింహం (జులై 24-ఆగస్ట్ 23)

ఈ సంవత్సరం మీలోని కొత్త శక్తిని కనుగొంటారు. ప్రజలలో ఆదరణ,ప్రాచుర్యం పొందుతారు.అందరినీ కలుపుకుని వెళ్లే మీ నైజం చలా చోట్ల ఉపయోగపడ్ అగలదు.

గృహ నిర్మాణం లో  ఉన్న వారు ఏప్రిల్ లోపల పనులు పూర్తి చేసుకోవటాలుం మంచిది.ఉద్యోగస్తులకు కొన్ని చికాకులున్నప్పటికీ మంచి ఫలితాలుండగలవు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఆలస్యమైనా ఆదాయం బాగుండగల్దు.స్త్రీల వలన పలు లాభాలున్నాయి.మీ మాటలు సూటిగా, న్యాయబధ్ధంగా ఉన్నందుకు ఇతరులు జాగ్రత్త పడే అవకాశాలున్నాయి. కాకపోతే కొన్ని చోట్ల మౌనం ఇంకా ఎక్కువగా పని చేయగలదని గమనించండి.

కళ్లు, కాళ్ల విషయం లో శ్రధ్ధ వహించాసి ఉంటుంది.ఇది చాలా విజయవంతమైన సంవత్సరం.

దరీలు,దుప్పట్లు,సెంటులు,ప్రయాణాలకు పనికి వచ్చే వస్తువులు,ధాన్యాల రంగాల వారికి లాభించే సంవత్సరం.

పట్టు తెలుపు రంగు వాడిన వారికి అద్భుతమైన ఫలితాలుండగలవు.

కన్య (ఆగస్ట్ 24-సెప్టెంబర్ 23)

భావుకత ఎక్కువగా నిండి కార్యాలను కొన్ని కారణాల వలన మరో రోజుకు ఆపేసే లక్షణాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇతరులకు ఎక్కువగా సహాయాలు చేయగలరు.కొందరు తీర్థయాత్రలకు బయలుదేరతారు…

ఇవన్నీ అలా ఉంచి భూమికి సంబంధించిన  విషయాలలో లాభాలున్నాయి.న్యాయ సంబంధమైనవి,ప్రచురణలకు సంబంధించినవి కలసి వచ్చు సంవత్సరం.అలసట వలన ఆరోగ్యం ఎక్కువగా దెబ్బ తినగలదు.ఉపాసన మార్గం ద్వారా చాలా పనులు నెరవేరగలవు.ఇది గమనించవలసిన అంశం.

కొన్ని యోగాలు సమానాంతరంగా ప్రభావం చూపగలవు.పూర్తిగా భిన్నంగా ఉండే కార్యకలాపాలు సాగించాలనే కోరిక ప్రబలమవుతుంది.ఉత్తరార్థం లో ఎంతో కాలంగా పీడిస్తున్న ఒక జటిలమైన సమస్య చాలా సునాయాసంగా తీర్ ఇపోవటం ఈ సంవత్సరం లోని విశేషం.
వ్యాపారస్తులు ఎక్కువ  పనిని భాగస్వాములకు వదిలేయటం మంచిది.

బంగారం,కమ్యూనికేషన్స్,ఎగుమతులు, దిగుమతులు, విద్యకి సంబంధించిన వస్తువుల రంగాల వారికి విశేషంగా కలసి రాగలదు.

ఒకే రంగును కాకుండా వైవిధ్యం గల రంగులను వాడిన వారికి మంచి ఫలితాలుండగలవు.

తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

ఎన్నో  ఘటనలు అనుకోకుండా అలా జరిగిపోతూ వెళ్లిపోయే  సంవత్సరం ఇది.చాలా మటుకు మీరు ఏది మాట్లాడినా  అందరూ తప్పుగానే అర్థం చేసుకోగలరు.పెట్టుబడులు ఆచి తూచి చేయవలసిన కాలం.
కొత్త భాగస్వామ్యాలు సంవత్సరం పూర్వార్థంలో కలసి రాగలవు.అనారోగ్యంతో బాధ పడే వారికి మంచి వైద్యసదుపాయం లభించి ఊరట పొందగలరు.
సంవత్సరం ఉత్తరార్థంలో అవివాహితులకు మంచి అవకాశాలున్నాయి.ఎక్కువగా ప్రజలతో వ్యవహారాలు చేసే వారికి మంచి సంవత్సరం.కొత్త వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయగలరు.
ప్రభుత్వం వారు కొన్ని రహస్యమైన విషయాలను అప్పగించే సూచనలున్నాయి.పరిశోధనలు ఫలించగలవు.అనవసరమైన భయాందోళనలు ఇబ్బందులు పెట్టగలవు.వాటి వలన ఏదో ఊహించుకుని ఏదో చేసేసి తీవ్రమైన ఇబ్బందులకు లోను కాగలరు.అందు చేత ధ్యాన మార్గాన్ని అవలంబించి మనసును మామూలు స్థితిలో ఉంచటం చాలా అవసరం.

రవాణా,వార్తా ప్రసారం,కాంట్రాక్ట్ పనుల రంగాల వారికి విశేష లాభాలుండగలవు.

ఈ సంవత్సరం తామరకు రంగు వాద్డటం వలన మంచి ఫలితాలుండగలవు.

వృశ్చికం(అక్టోబర్ 24-నవంబర్ 22)

అదృష్టం కలసి వచ్చే సంవత్సరం ఇది.వెన్నెముకకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.మోయలేని బరువులు మోయటం,కష్టమైన భంగిమలలో క్రింద పడ్డవి తీయటం వలన చాలా సమస్యలుండగలవు.ఆరోగ్యం బాగున్నపటికీ కొన్ని సందర్భాలలో అనాలోచితంగా ప్రవర్తించటం వలన ఇబ్బందులు ఎదురు కాగలవు.గడచిన సంవత్సరం కంటే ఈ ఏడాది ఉత్సాహం ఎక్కువగా ఉండగలదు.
ప్రేమలో పడ్డారని అనుకున్నవారు కొద్దిగా పరిస్థితులను పరిశీలించుకోవాలి.
సంతాన సాఫల్యం ఎక్కువగా ఉన్న సంవత్సరం ఇది.విద్యా వేత్తలకు, ధార్మిక చింతన కలవారికి మంచి కాలం.ఆహార వ్యవహారాలలో కొన్ని నియమాలను పాటించటం వలన లబ్ధి పొందగలరు.
వైవాహిక విషయాలలో భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అన్ని విధాలా సములను చూసుకోని యెడల సమస్యలు ఉండగలవు.
మిత్రులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలలో సమస్యలు తెచ్చి పెట్టగలరు.నిరుద్యోగులకు సాంకేతిక రంగాలలో,విద్యా రంగాలలో ఉద్యోగావకాశాలు హెచ్చుగా ఉండగలవు.

వెండి,ఫర్నిచర్,రియల్ ఎస్టేట్,సబ్బులు,నీటికి సంబంధించిన రంగాల వారికి మంచి లాభాలుండగలవు.

బంగారం రంగు శరీరం మీద ఏ విధం గానైనా ధరిస్తే ఎక్కువగా లాభాలు పొందగలరు.

ధను (నవంబర్ 23-డిసెంబర్ 21)

అన్నీ పంచుకునే యోచన ప్రబలంగా ఉండే సంవత్సరం ఇది.రచయితలు, కళాకారులు మంచి ప్రతిభ చూపగలరు.జరగబోయేది ఊహించ గల్గటం వలన చాలా విషయాలలో విజయం పొందుతారు.
బాధ్యతలు అధికమవుతాయి.వృత్తులలో రాణించినందుకు తగు పుర్స్కారాలు పొందగలరు.వద్దనుకున్నా రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు.ఉత్తరార్థం లో ప్రభుత్వ వర్గాల వలన కొన్ని ఇబ్బందులుండగలవు.
బాంకింగు,పొగాకు,తోలు,గ్లాస్,ఆర్థిక రంగాలలో ఉన్న వారికి విశేషమైన లాభాలున్నాయి.
కలుషితమైన నీటి వలన జ్వరాల బాధలుండగలవు.విద్యార్థులకు విదేశీ అవకాశాలు బాగున్నాయి.

షిప్పింగ్,విదేశీ వ్యాపారం,పరిశోధనా రంగాలలోని వారికి విశేషమైన లాభాలున్న సంవత్సరం.

వంకాయ రంగును ఎక్కువగా వాడటం వలన మంచి ఫలితాలుండగలవు.

మకరం (డిసెంబర్ 22-జనవరి 20)

తర్కం మీద ప్రపంచం యావత్తూ నడుస్తుందని భావించే మీకు కొన్ని ఆలోచింపజేసే సంఘటనలు ఎదురు కాగలవు.స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు అవకాశాలను జారవిడిచే అవకాశాలుండగలవు.విలాసానికి ధనం ఖర్చు చేస్తారు.కొన్ని కోరికలు ప్రబలమవుతాయి.
బంధు వర్గం తో చర్చలు జరుపుతారు.ఉబ్బసం ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తులలో ఉన్నత విద్యలను అభ్యసించాలనుకునే వారికి మంచి సంవత్సరం.ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
ఈ సంవత్సరం పలు చోట్ల అసమ్మతి వలన మనసు కొన్ని చికాకులకు లోను కాగలదు.ఎలెక్ట్రానిక్ రంగాల వారికి ఈ సంవత్స్రం విశేషమైన ఫలితాలివ్వగలదు.

భాగస్వాములతో భిన్నాభిప్రాయాలుండగలవు.ఈ సంవత్సరం అకస్మాత్తుగా అందే వార్తలతో నిండి ఉంటుంది.నలుపు తెలుపు  కలసి  ఎక్కువ వాడిన వారికి అదృష్టం కలసి రాగలదు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)

తిరుగుబాటు చర్యలను ఎదుర్కుంటారు.కొంత వేదాంత ధోరణి ఏర్పడగలదు.మార్కెటింగ్ రంగాల వారికి లాభాలు బాగున్నాయి.అదనపు బాధ్యతలను స్వీకరించి ఓపికతో నిర్వర్తిస్తారు.దూరం వెళ్లిన వారు దగ్గరవుతారు.సంగీతం పట్ల కొత్తగా ఆసక్తి పెరుగుతుంది.
సంవత్సరం పూర్వార్థంలో చేసిన పెట్టుబడులు  రాణించగలవు.బట్టలు,వ్యవసాయం,వాహనాల రంగం వారికి విశేష లాభాలుండగలవు.
హృద్రోగం ఉన్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి.విద్యార్థులకు మంచి సంవత్సరం.అనుకున్న చోట విద్య అభ్యసించే అవకాశం లభించగలదు.
అనుకున్న చోటు నుండి కాకుండా అనుకోని చోటు నుండి ఆదాయం ఉండగలదు.
అవివాహితులు అతి దగ్గరలోనే  సంబంధం ఉన్నదని తెలుసుకుంటారు.
పలుచని నీలం రంగు ధరించిన వారికి చాలా విషయాలలో కలసి రాగలదు.

మీనం (ఫిబ్రవరి 20-మార్చ్ 20)

గతంలో తలపెట్టిన కార్యాలు పూర్తి కాగలవు.ఆదాయం పుంజుకోగలదు.జీవిత భాగస్వామితో కొన్ని వాద్వివాదాలు ఉండగలవు.చాలా విషయాలలొ చరిత్ర గురించి చర్చించటం వలన ఇబ్బందులుండగలవు.ప్రకృతి పట్ల ఒక నూతన అధ్యయనాన్ని ప్రారంభించగలరు.కొన్ని పథకాలని మీరు సరైన సమయం కోసం ఆపి ఉంచిన యెడల ఈ ఫిబ్రవరిలో వాటిని అమలు చేయటం మంచిది.మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది.

ఈ సంవత్సరం ఆలోచనలు తగ్గించి, లౌకికమైన వ్యవహారాల వైపు దృష్టి సారించటం మంచిది.మీకంటే చిన్నవారి ఆరోగ్యం కాపాడుకోవలసి ఉంటుంది.

మీడియా, మనోరంజక రంగాలలో ఉన్న వారు మంచి లాభాలు పొదగలరు.అలాగే విలాసానికి, అందచందాలకీ ఉపయోగపడే వస్తువుల వ్యాపారస్తులు ఈ సంవత్సరం రాణించగలరు.
నీలి రంగుతో తెలుపును కలిపి వాడితే మంచి ఫలితాలు పొందగలరు.

 

Happy new year once again!

 

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

6 thoughts on “2011 ఆంగ్ల సంవత్సరం మీకెలా ఉంది…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: