ఈ రాష్ట్రం లో ప్రభుత్వం ఉన్నదా?


ముప్పయి మూడు లోక్ సభ సభ్యులను కాంగ్రెస్ జెండా క్రింద పంపిన రాష్ట్రం.అగ్ర రాష్ట్రాలలో ఒకటైన రాష్ట్రం.విస్తీర్ణం లో నాలుగో అతి పెద్ద రాష్ట్రం.దేశం లో జి.డి.పీ విషయంలో నాలుగో స్థానం లో ఉన్న రాష్ట్రం.జనాభాలో అయిదవ స్థానంలో ఉన్న రాష్ట్రం.పన్నుల  నుండి ఆదాయం లో మహారాష్ట్ర తరువాత రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం (323369 కోట్లు).రెండున్నర కోట్ల వోటర్లు 2009 లో (రెండవ స్థానం)వోట్లు వేసిన రాష్ట్రం…

వరదల వలన 50 లక్షల ఎకరాలు నాశనం అయితే కేంద్రం నుండి ప్రధానమంత్రి ఎందుకు రాడు?జాతీయ విపత్తుగా పరిగణించరా?400 కోట్లు ఇచ్చి పొమ్మంటారా?అది పట్టుకుని ముఖ్య మంత్రి ఉపదేశాలు చేస్తాడా?

70% వ్యవసాయ కూలీలి వ్యవస్థీకృతులుగా లేని కూలీలు. వీరి పరిస్థితి ఏమిటి? రెండు వందలకు దగ్గరలో ఇప్పటికే ఆత్మహత్యలు జరిగిపోయాయి.2గి స్కాం లో సి.ఎ.జి అంచనా లక్షన్నర కోట్లు!

మైనారిటీ ప్రభుత్వాలు ప్రారంభం అయినప్పుడు పి.వి.గారు నడిపిన అయిదు సంవత్సరాలలో రిఫారంస్ నేపథ్యం లో మంత్రిగా పని చేసిన మనమోహనుడు పి.వి గారి మీద రక రకాల కేసులు నమోదయినప్పుడు ప్లీనరీలో ఆయనను ‘కం క్లీణ్ అని చెప్పటం జరిగింది.సీతారాం కేసరీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ముందుకు వచ్చాడు. జె.ఎం.ఎం కేసు హార్స్ ట్రేడింగ్ గోల వేడిగా ఉన్న సమయం!

డి.ఎం.కె సపోర్ట్ నేపథ్యం లో రాజా వారిని మరి కాపాడుకుంటూ వచ్చినందుకు సుప్రీం వేసిన వేటు ఈ ప్రధానిని తాకదా? (అ)ప్రధానులు నేను మిస్టర్ క్లీన్ అంటూ ఒక ఇమేజ్ పెట్టుకుంటే సరిపోదు.’షరాఫత్ కా షౌక్ ‘ అందరికీ ఉంటుంది.కీలకమైన స్థానం లో కూర్చున్న వాడు ఒక దురాగతం చేస్తేనే దుర్మార్గుడు అవుతాడనుకోవటం పొరపాటు. సరైన సమయానికి ఒక చర్య తీసుకోపోవటం కూడా క్షమించరాని నేరమే!

ఆంధ్రకు వస్తే ఈ గడ్డపాయనకు అసలేమీ అక్కరలేదు.కేంద్ర బృందం కూడా మెల్లగా కాళ్లీడుస్తూ వస్తుందట!ఎందుకు రావాలి? ఇక్కడ పురుష పుంగవులు ఎవరూ లేరని చాలా కాలం క్రిందటే తేల్చేసారు మరి!

ప్రభుత్వమా? అదెలా ఉంటుంది? అనడిగే రోజులివి!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “ఈ రాష్ట్రం లో ప్రభుత్వం ఉన్నదా?

  1. కాంగ్రెస్ ప్రజల తీర్పును ఎప్పుడు గౌరవించదు. Delhi లొ కూర్చున్న ఇటాలియన్ సొనియా ఎవరిని ఎప్పుడు కావలంటే CM చేయగలదు, తీసివేయగలదు.

    మారి కాంగ్రెస్ MP’s MLA’s లకు ఇంక సొంత బుర్రలు ఎక్కడవున్నాయి. ఒక ఇటాలియన్ సొనియా, 33 MPs and 157 MLA’s తొ ఎడు కొట్ల ప్రజలను చాసిస్తుంది. అలానే 200 + MP’s తొ 1.1 Billion ప్రజలను చాసిస్తుంది.

    ఈ వ్యక్తికి ఇటలిలొ అయితే, ఒక చప్రాసికి కావలసిన qualifications లేవు.

    నెత్తిన పెట్టుకున్నప్పుడు బరించక తప్పదు. ఒట్లతొ ఒడించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: