గడ్డరికా ప్రవాహం-మన సాంకేతిక విద్య!


మన దేశం లోని సాఫ్ట్ వేర్ విద్యార్థులలో 75% మంది రానున్న సంవత్సరం నిరుద్యోగులుగా మిగిలిపోగలరని నాస్ కోం హెచ్చరించింది.మన రాష్ట్రం లోని కళాశాలలోంచి 12 శాతమే కాంపస్ రెక్రూట్ మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారని తెలుస్తోంది.

ఈ వెర్రి తెచ్చి పెట్టిన సమస్యను మరి కాస్త పరిశోధిద్దాం…రాష్ట్రంలో 700 ఇంజనియరింగు కళాశాలల పరిస్థితి దారుణంగా ఉన్నదని తెలుస్తోంది.గత రెండు సంవత్సరాలలో దాదాపు 3.2 లక్షల ఇంజినియరింగు విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండిఓయారని మంత్రి గారు చెబుతున్నారు.ఈ సంఖ్యకు 1.2 లక్షలు ఇప్పుడు చేరనున్నారు.
కారణాలు చాలా మందికి తెలిసినవే. 22000  మంది లెక్చరర్లు అవసరం ఉన్న చోట కేవలం 9200 మందే ఉన్నారు.2010-11 లో లక్ష సీట్లు ఖాళీగానే ఉండిపోవటం మనకు కనిపిస్తున్నది. దేశంలో 2800 ఇంజినియరింగ్ కళాశాలలుండగా అందులో 25% మన రాష్ట్రం లో ఉన్నాయి.కానీ దేశంలో కేవలం 7% మాత్రమే లెక్చరర్లుండటం పెద్ద సమస్య.

ఏది కొత్తగా వచ్చినా ఒక్క పరుగున వ్యాపారం చేసేయటం మన రాష్ట్రం లో ప్రజలకు పరిపాటి.కాస్త ముందూ వెనుకా ఆలోచించటం కొద్దిగా తక్కువే.ఇంజినియరింగు రంగం లో మన వాళ్లు చేస్తున్న వ్యాపారం శిరిడీ లేదా శబరిమలై లో టెంట్ వేసుకుని ఆంధ్రా మీల్స్ అన్నట్లే కనిపిస్తుంది.ఇక చూస్తే కుర్రాళ్ల తలి దండ్రుల లైను.సాంఘిక విద్య,భాషలు,కళలు,భౌతిక శాస్త్రం,ఖగోళ శాస్త్రం…ఇవన్నీ తిండి పెట్టవు అని భయ పెట్టే వారు మరి ఈ సాఫ్ట్ వేర్ వారికి ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉన్నదంటే ఏమి చెబుతారు?

అదలా ఉంచి ఈ మధ్య తెలుగమ్మాయిలు అబ్బాయిలు సఫ్ట్వేర్ లో లేకపోతే వివాహాలు చేసుకోరుట!ఇటీవల పెళ్లి చూపులకు వచ్చిన ఒక ఐ.ఐ.ఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ ని ఆ అమ్మాయి అడిగింది-అమెరికా వెళ్లే అవకాశం ఉన్నదా? అని. అతను నవ్వి నేనున్నది ఐ.ఐ.ఎం లో…ఒక వేళ వాళ్లు పంపితే వెళతాను లేకఓతే నాకు అవసరం లేదు అన్నాడుట. అంతే! కుర్చీ లోంచి లేచి లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని అతని ముందర నుంచే వాకిట్లోకి వెళ్లిపోయింది మహాతల్లి! మన తెలుగు వారి వేలం వెర్రి చరమ స్థాయిలో ఉన్నది!

ఏటా జరిగే ఈ ప్రవాహం పట్ల అందరూ కొంత ఆలోచించి కుర్రాళ్ల భవిష్యత్తు పాడవకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. తల్లి దండ్రులు కేవలం ఇన్స్క్యూరిటీ అనే త్రాటి మీద నడిస్తే నిజా నిజాలకు చాలా దూరంగా ఉండిపోగలరు.అన్ని వ్యవస్థలలోని అవస్థలను అర్థం చేసుకుని ముందుకు వెళ్ల వలసిన అవసరం ఉంది.
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “గడ్డరికా ప్రవాహం-మన సాంకేతిక విద్య!

 1. భవిష్యత్ పరిణామాలను అంచనా వేయలేని ప్రభుత్వాలు ,జేబులు నింపుకొనే యత్నంలో రాజకీయులూ విచ్చలవిడిగా వీధి బడుల్లా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు విసిరేస్తే, బ్లాక్ మనీ ఏమిచేయాలో సీలింగు భూములు ఎలా పరిరక్షించుకోవాలో తెలియక సతమతమౌతున్న అనేక వర్గాల కామందులు అవకాశాన్ని తమకనుకూలంగా మార్చుకొని ఇంజనీరింగ్ కాలేజీలనే విద్వత్తు ను అందించలేని బ్లాక్ హోల్స్ సృష్టించి యువతను ఆకర్షించి అసంబద్ధ ఆకర్షణలు రేకెత్తించి వారి భవిష్య శక్తిని బక్షించి భారత భవితను నిర్వీర్యం చేస్తున్నారు.
  తలిదండ్రులంటారా,బిఎస్సీ బదులు ఇదీ .అనే నిర్లిప్తత.ఎలాగోలా ఎన్నిబాధలు పడినా మన వంతుగా మామూలు డిగ్రీ బదులు ఇంజినీరింగ్ చదివిద్దాం . వస్తే మంచి వుద్యోగం వచ్చి బిడ్డ జీవితం బాగు పడుతుంది. లేకుంటే మామూలు డిగ్రీ వాడిలాగానే జీవితం కొన సాగిస్తాడు.ఇది మధ్య తరగతి జీవి తపన.
  ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు భవిష్య ప్రణాళికలు ,అంచనాలూ లేకుండా దూర దృష్టి లోపించి వ్యవహరించడం వల్లనే ఈ స్థితి.

  “తెలుగమ్మాయిలు అబ్బాయిలు సఫ్ట్వేర్ లో లేకపోతే వివాహాలు చేసుకోరుట”

  పుట్టిన నాటినుండి చదువే వ్యాపకమైన నేటి సమాజంలో సామాజిక విషయాల పై అవగాహనా లోపం వల్ల కొంత మంది యువత మీరు ఉదహరించినట్లు ప్రవర్తించ వచ్చుగాక . అంత మాత్రాన యువతదో తలిదంద్రులదో తప్పుగా నిర్దారించ వద్దు.
  ప్రపంచంలోనే మహాద్భుతమైన మాననవ వనరులు వుండీ సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళి కలే లేని మన దేశంలో ప్రభుత్వాలు, నిరుద్యోగ నివారణ ఇలాగైనా కొంత వరకు సాధించ వచ్చనుకొనియువతకు విదేశీ బాట చూపుతున్నారు.విద్యలో ప్రతీ రంగం స్వయం వుపాధినందిన్చేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించి యువతకు నమ్మకం కలిగిస్తే ప్రస్తుతమున్న ఇంజినీరింగ్ విద్య లాటి అజాగళ స్తనాస్వాదనలో తలమునకలు కారు.

   1. మనిషి పుట్టినప్పటి నుండి కుటుంబం మొదటి విద్యాలయమైతే , సమాజం రెండవ విద్యాలయం, ప్రస్తుత విద్యాలయాలన్నవి మనిషి కి విద్యనభ్యసించడంలో తృతీయ ఘట్టం.
    దురదృష్ట వశాత్తూ విస్చ్చిన్నమై నిర్జీవమైన వుమ్మడి కుటుంబ జీవన వ్యవస్థ,…అభద్రత లో కుటుంబ సభ్యులు. ,ఆర్ధికపరమైన చిక్కులతో చన్నీళ్ళకు వేణ్నీళ్ళు గా భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాల ఊబిలో చిక్కుకొన్న కారణంగా చిన్నాభిన్న మౌతూ కుటుంబ విద్యాలయాలు.

    ప్రక్కనున్నవాడెవరో పట్టని సామాజిక జీవన వ్యవస్తలో వికృత రూపం పొందుతున్న భావ వైవిధ్యాలు “సామాజిక విద్యా వ్యవస్తను” భ్రష్టు పట్టించేసాయి. ప్రస్తుత విద్యా విధానంలో 16 గం ల సమయం చదువుల చుట్టూ గడిపే యువతీ యువకులకు సామాజిక అవగాహన పెంపొందించుకొనే అవకాశ మేది ?

    వేగవంతమౌతున్న జీవన విధానంలో తలిదంద్రులనుండీ మార్గ నిర్దేసికత లేక , రాబందుల రెక్కల చప్పుడులా ఆర్ధిక సంబంధాలుగా మారుతున్న బాంధవ్యాలు అందించలేని , ప్రేమ ఆప్యాయతలు మమకారాలు. ఈ తరుణంలో యువతలో వ్రేళ్ళూను తున్న అభద్రతా భావన ,ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో యువత .దీనంతటికీ కారణం సమాజ అవసరాలకు ,అభివృద్ధికి ఉత్పత్తికీ ఉపయోగపడని ప్రస్తుత విద్యావిధానం పై అవగాహనా రాహితిలో ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యావిదాన్ని సంస్కరించ లేక పోతున్నాయి .
    ఇందుకు యువతను ‘ వారెందరైనా” భాధ్యుల్ని చేయలేము. విద్యా విధానంలో పెను సంస్కరణలు తీసుకు రానప్పుడు జీవన సంవిధాన సమరం యిలా కొనసాగుతూనే వుంటుంది వేరేవరినో ప్రతివక్కరూ భాధ్యుల్ని చేసుకొంటూ పోతూ…..
    శ్రీపతి గారూ ప్రస్తుత సామాజిక వ్యవస్తపై మంచి సబ్జెక్ట్ ఎంచుకొని చర్చకు వుంచినందుకు అభినందిస్తూ శ్రేయోభిలాషి. …నూతక్కి

 2. శర్మగారు,
  అసలికి ఈ రోజుల్లో అమ్మాయిలకేకాదు వారి తల్లిదండృల పొగరుని చూడాలి. నాలుగు రూపాయల డబ్బులు కనిపిస్తే ఒంటి మీద గుడ్డలు నిలవటం లేదు. పోని వీరేమైన పెద్ద విజేతలా అంటె చాలా మంది మధ్యతరరగతి వారు, వారికేమైనా తెలివి తేటలు అఘోరించాయా అంటె పైన మీరు చెప్పిన రకాలు ఐ.ఐ.ఎం గురించి కూడా ఆ అమ్మాయికి అవగహాన లేదంటె ఎంత మొద్దు రాచిప్పో అర్థం చేసుకోగలరు. ఇక వారి అమ్మానాన్నలు ఇంకెంతటి మొద్దు రాచిప్పలో ! వారి
  గురించి ఎమీ చెప్పగలం. ఇటువంటి వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇక ఇటువంటి వారి డిమాండ్లు ఎలా ఉంటాయి అంటే పెళ్ళి కొడుకు సౌత్ లో నే పని చేయాలి. అది వారి మొదటి అమ్మాయి బెంగళూరు లో ఉంటే అక్కడే కాబోయె అల్లుడు బెంగళూరు లోనే పని చేస్తూ ఉండాలి. పెళ్ళి ఐన తరువాత అల్లుడు ఇంట్లొ తిష్ట వేయటానికి అనుకూలం గా ఉండాలి. ఒకప్పుడు అల్లుడింట్లో ఎక్కువరోజులు గడపటం అంటే ఒక నామోషి. ఇప్పుడు అల్లుడి కాళ్ళకు ముందుకాళ్ళ బంధం వేస్తూ మా అళ్ళుడు చాలా మంచి వాడు. మాకు కోడుకుతో సమానం అని అతని స్వేచ్చని పూర్తి గా హరిస్తున్నారు. అదే కాక ఎప్పుడైనా అల్లుడి అమ్మానాన్నలు కొడుకు దగ్గర ఎప్పుడైనా గడపాలని అనుకున్నా వియ్యంకులు ఎప్పుడు అల్లుడింట్లో పందికొక్కులా పడి ఉంటారు. కొడుకు దగ్గరికి వెళ్ళి అతనిని ఇబ్బంది పెట్టటం ఎందుకులే అని మగ పిల్ల వారీ తల్లిదండృలు ఎంతో వ్యథ కు గురి అవుతూ ఉంటారు.

 3. @ Nutakki gaaru >> ఇందుకు యువతను ‘ వారెందరైనా” భాధ్యుల్ని చేయలేము

  prathi vyAkhyA nizaM 🙂

  @ Sarma gaaru,

  meeru oka pArsvam mAtramE cheppi untAru (adi tappu koodaa kaadu) …అల్లుడి అమ్మానాన్నలు koodA mundE jAgratha padi untE?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: