మానవుడు, హక్కులు…!


ఈ బొమ్మ చూస్తే మనకు ఏదో గుర్తుకొస్తుంది. గాంధీ గారు, ఆయన వెనుక ఇతర స్వాతంత్ర్య సమర యోధులు ఉన్న చిత్రం…

ఎందుకు పోరాడారు? ఎవరి కోసం పోరాడారు…అనిపిస్తుంది. ఇక్కడున్నది చీకటి బ్రతుకుల మధ్య పోరాటం-మరో స్వాతంత్ర్యం ఎక్కడ? ఎప్పుడు?

ఈ రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దివసం!

~~~***~~~

రైల్వే ప్లేట్ఫార్మ్ మీద నిలబడ్డప్పుడల్లా నా మీద నుంచి రైళ్లు పరిగెట్టినట్లే ఉంటుంది. పట్టాల మీద నుంచి ఆ మనుషులు అలా ఊడ్చుకుంటూ, కడుగుతూ పోతూ ఉంటారు…

ఒక్కో సారి బైక్ మీద వెళుతూ కూడా అలా ఆలోచిస్తూ పోతాను. ఎదురుగా చెత్త ఎత్తుకుని వెళ్లే లారీ మీద ఓ చిన్న కుర్రాడు కూర్చుని ఉంటాడు…

పెద్ద పెద్ద దొరబాబులు (ఆధునిక నిరక్షర రాక్షసులు) ఇళ్లల్లో బంగళా ప్యూన్ లను పెట్టుకుంటారు. వాళ్ల పిల్లలు వీళ్ల పిల్లలకు మేజోళ్లు తొడుగుతూ ఉంటారు. ..

ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కారిడోర్ లో మూలగా ఒకడు క్రింద పడి ఉన్నాడు. అక్కడ పాన్ పరాగ్, చెత్త ఉమ్మి వేసిన చోట ఈగలు ముసురుతూ ఒకాయన పడి ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు…

~~~***~~~

జైళ్లు, పోలీసు హింసలు, ఇలా రక రకాల అరాచకాలు ప్రపంచం లో అన్ని చోట్లా జరుగుతూనే ఉంటాయి. మానవ హక్కులు అనగానే మానవునిగా పుట్టినందుకు ఆలోచన అనే హక్కు ఉన్నందుకు ఇలా భావుకుడనయిపోయి ఏమీ బావుకోకుండా ఏమిటి సాధించేది?
నిన్న అంతర్జాతీయ ఏంటి కరప్షన్ దివసం! ఈ రోజు అనతర్జాతీయ మానవ హక్కుల దివసం! అక్కడ లక్షల కోట్లు, ఇక్కడ కోట్ల ప్రాణాలు…అక్కు పక్షులలా బ్రతకటం తప్ప హక్కుల గురించి ఆలోచించి ప్రయోజనం?

~~~***~~~

 

ఆస్పత్రి లో నేను కూర్చున్న వరుసలో ఒక కుర్రాడు కూర్చున్నాడు. ఎంత సేపటికీ అతన్ని పిలవటం లేదు.
‘ఎవరి కోసం వచ్చావు బాబూ?’, అడిగాను.
‘పని మీద వచ్చాను.’
‘ ఏమి పని?’
‘లోపల ‘
‘అందరికీ లోపలే ఉంటుంది పని!’
ఇంతలోనే ఎవరో సైగ చేయటం వలన లోపలికి వెళ్లి ఏవో కాగితాల మీద వేలి ముద్రలు వేసి ఇటు వచ్చి ఒక సంచీ…చెత్త ఏరుకునే సంచీ తీసుకుని బయటకు నడిచాడు. సిస్టర్ ని అడిగాను.
‘ఆ కుర్రాడు దేనికి వచ్చాడు?”
ఆమె చెప్పలేదు.నవ్వి లోపలికి వెళ్లిపోయింది.
అక్కడ మందుల కౌంటర్ లో ఉన్న అమ్మాయి చెప్పింది,’ అతను చెత్త ఏరుకునే కుర్రాడు. ఒక చెత్త కుండీలో పసి బిడ్డ దొరికితే కుక్కలు తినకుండా సంచీలో వేసుకుని ఇక్కడికి తీసుకుని వచ్చాడు.’
‘బ్రతికే …?’
చిన్నగా తల ఆడించింది.
‘బ్రతకవచ్చు…’

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “మానవుడు, హక్కులు…!

  1. ఇవన్నీ అతి మామూలుగా చూస్తూ, ఇదంతా వారి గత జన్మ పాపఫలమని, తాము పుణ్యాత్ములం కాబట్టే ఈ బతుకు బతుకుతున్నామన్న ఆలోచనతో అలా సాగిపోయేట్టు చేస్తోంది మన ఖర్మ సిద్ధాంతం. కానీ అలా ఆ కొందరు బతకడానికి అది వాళ్ళ ఖర్మ కాదని, మనలో కొందరి పాపకార్యఫలమని ఎరుక గలిగేట్టు ఎప్పుడు చెప్పగలమో. మానవ హక్కులు, స్వేచ్చ, ప్రజాస్వామ్యాలకు గుత్తదారునిగా ఫోజులిచ్చే పెద్దన్న అమెరికా ఎంత ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూందో ఇటీవలి వికీలీక్స్ తదనంతర పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి. హింస, ప్రపంచమంతా హింస జరిగిపోతోందని ఘోషించే వారు ఆకలి, దారిద్ర్యం కనా హింసా రూపాలేముంటాయోనని ఎప్పుడు గ్రహిస్తారో..

    మీకు ధన్యవాదాలు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: