మనిషి మారలేదు…


ఇదే సమస్య. ప్రజలను దోచుకునేందుకు మాకు సరైన అవకాశాలు ఇవ్వలేదని మంత్రులు పబ్లిక్ గా బాధపడుతున్నారండీ ! వారిని ఓదార్చే ప్రక్రియలు కూడా ప్రారంభమయ్యాయి.
మన ‘ప్రజా భక్షణ’ డిమాండులకు దిక్కు మాలిన హై కమాండ్ కూడా ఏదో చెయ్యబోతోందిట!

16.03.1947 లో శ్రీ శ్రీ గారు మద్రాసు  ‘ప్రజా రక్షణ ‘ ఆర్డినెన్స్ జారీ చేసిందని విని ఇలా వ్రాశారు:

దేశం కోసం త్యాగం
చేశామని చెప్పి పదవి చేపడగానే
చూశారా! మన కాంగ్రెస్
చేసిన పని సిగ్గు చేటు సిరి సిరి మువ్వా!

నికమైన శత్రువులతో
భుజం కలిపి ప్రజల బాధ పొడిగించే, స్వీ
యజనుల హింసించే ఫా
సిజపున్ ధోరణి వహించె సిరి సిరి మువ్వా

దేన్నైతే పూర్వం కా
దన్నామో, రాక్షసత్వమని యెంచామో
దాన్నే ఆరాధిస్తే
చిన్నతనం వేరె కలదె? సిరి సిరి మువ్వా

మన కాంగ్రెస్ ని యసెంబ్లీ
కనుపగ నదియున్న స్వేఛ్చ నవరోధించెన్
మనసు నపుంసకమని పన్
చిన దయితన్ దవిలినట్లు సిరి సిరి మువ్వా

దేవుడి పేరిట ఏవే
వో వెధవ పనుల్ పొనర్చుటున్నదె కద, హిన్
సావాదం గాంధీచే
సేవకులే చేయలేదే! సిరి సిరి మువ్వా

చీకటి బజారులో (వేళాకోళం కాదు)
లక్షల కొలదిగ మస్కా కొట్టిన
వాళ్లంతా శ్రీ కాంగ్రెస్ వాదులేర! సిరి సిరి మువ్వా

గౌను బనాయిస్తే దొర
సానిగ గడసాని మారజాలునే ఖాదీ
తానులు సైతాను ధరి
స్తే నాయకుడెట్టులవును? సిరి సిరి మువ్వా

కోట్ల కొలది ప్రజలను చీ
కట్లోపల వదిలి నేటి కాంగ్రెస్ రాజ్యం
కొట్లాటల, పోట్లాటల
చీట్లాటగమారిపోయె సిరి సిరి మువ్వా

అసలు సమస్యలు గ్రసం,
వసబం,వాసం! అలాంటి వాటిని
చూసే
వస లేక గింజుకొని చ
చ్చి సున్నమవుతోంది ప్రభుత! సిరి సిరి మువ్వా

ఎన్నాళ్లీ దారిద్ర్యం?
ఎన్నాళ్లీ అస్వతంత్ర హీన స్థితి?ఇన్
కెన్నాళ్లీ వైఫల్యం?
చెన్ననగర రాజ్యమందు? సిరి సిరి మువ్వా

(ఆనందవాణి వారపత్రిక 16.03.1947)

మంత్రిత్వ శాఖలు బాలేవని కొందరు మండి పడుతుంటే ఇక్కడ సబిత గారు నాకేమి మంత్రిత్వం ఇచ్చారని సెగట్రీని అడిగారుట. గృహ మంత్రిత్వ శాఖండీ అన్నాడుట ఆయన.
ఇప్పుడు నేనున్నది ఆ శాఖే కదా? అని కంఫర్మ్ చేసుకున్నారుట ఆవిడ! నిజమో కాదో తెలియదు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: