జగన్ ‘కాఫీహౌస్’ చెస్!


 

చదరంగం ఆటతో పరిచయం ఉన్న వాళ్లు ఈ రకమైన ఆటను గుర్తు పట్టగలరు.ఆటలోకి దింపి నువ్వాడింది తప్పు అని నిరూపిస్తూ  రిస్కులు తీసుకుంటూ ఆటను ఫోర్స్ చేస్తాడు ఆటగాడు.ఈ పధ్ధతిలోనే తెరవాట-తెరచి రాజు అనే పధ్ధతి కూడా ఉన్నది.

నిజమే! రిస్కు తీసుకోలేకపోతే ఆటా లేదు, పాటా లేదు!ఆంధ్ర ప్రదేశ్ లో అసలు ఏమిటి పరిస్థితి అనేది సోనియాకు ఆ ముగ్గురూ ఏదో చెబితే,ఒక్క పూట కూడా రాష్ట్రానికి రాని మేధావులు ఏదో కూస్తే, సినిమా హాలు బయట బ్లాక్ లో టికట్లు అమ్ముకునే వాడిలా కనిపించే వీరప్ప మొయిలీ విశ్లేషణలు చెబితే ఓ మేధావి లాగా ఒక మహారాణిలాగా కూర్చుని ఆవిడ నిర్ణయాలు తీసుకుంటోంది!

కొన్ని సంవత్సరాల క్రితం ఇదే సోనియా ఒక లిస్టు తీసుకుని అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ వద్దకు వెళ్లింది.అప్పటి అతిపెద్ద చంచా అర్జున్ సింగ్ ఇచ్చిన సలహా అది.సంతకాలేవి? అన్నాడాయన.వెనక్కి వచ్చి ‘తప్పుగా చెప్పావు.అడక్కూడనిదే అడిగాడు. అవతలికి పో!’,అన్నది.

ములాయం సింగ్ వరండాలో కూర్చున్నాడు.సోనియా నీ సపోర్ట్ కోరుకుంటోంది అని వర్తమానం తీసుకుని వచ్చాడు ఒకాయన.’ఆమెనే రమ్మను ‘,అన్నాడాయన!
ఎవరి అభిమానం వారికుంటుంది.

ప్రజారాజ్యం పార్టీ సమావేశమయ్యి మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పే అవసరం ఎందుకొచ్చింది? ఇప్పుడు కాదా? అంటే ఢిల్లీకి పిలిపిచుకుని మంతనాలు జరపటం వాస్తవమే కదా? ఆంధ్రుల అభిమాన మెగాస్టార్ రాజకీయ పరిణతి ఉంటే చేయవలసిన పనేనా ఇది?

రోషయ్య మహాశయుడు దిగిపోయిన సందర్భంగా ఆ నలుగురూ  ఢిల్లీ నుంచి వచ్చి పార్టీ అధినేతకు ముఖ్యమంత్రి సంగతి వదిలేస్తున్నామని సి.ఎల్.పి చేత తీర్మానం చేయించి తెలుగు వారు అటు ఆడా,ఇటు మగా కాని మాడా లాంటివారని వెక్కిరింతగా అందరికీ చెప్పి అవతలికి వెళ్లిపోతే సిగ్గుగా లేదూ…దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పటికీ వీళ్లు ఏదో గర్వపడే మాట లాగా ఆవిడ పెట్టిన భిక్ష, శునకాల్లాగా తోక ఆడిస్తూనే ఉంటామని మాట్లాడతారు.
మీ మొహాలు మండ!మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు. సోనియా కాదు.పార్టీ అంతర్గత వ్యవహారాలతో ప్రజలకు సంబంధం లేదు.ఈ నేల తెలుగు వాడిది.మరొకడు వచ్చి ఇక్కడి ఈడియట్స్ ను ఆడుకుని వెళ్లిపోతుంటే ఇంత కాలం జరిగిపోయింది.కాలం మారింది.నాలుగో క్లాసు కుర్రాడిని అడిగినా నవ్విపోతాడు!

అశ్వథ్థామ పిండి పాలు త్రాగుతుంటే పిల్లలు సాటి పిల్లలు నవ్వి ఆట పట్టించారు.ద్రోణుడు మిత్రుని వద్దకు వెళ్లి భంగ పడ్డాడు…తరువాత జరిగింది సామాన్యమైన కథ కాదు!

33 ఎం.పీలను ఇచ్చి కాంగ్రెస్ ను సంతోషకరమైన స్థితిలో పెట్టిన వై.ఎస్. భార్య ఆమె కుమారుడు, ప్రజలు ఎన్నుకున్న జగన్ తో ఢిల్లీ వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఏమి చేస్తోందండీ?ఎవరి తల్లికి అవమానం జరిగితే ఎవరూరుకుంటారు?

చెస్ ఆట తెలిసిన వారికి ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది.ఆటలోకి దిగి ఊబిలోకి దిగబడి ఇంకొకరి ఆటలో ఆడుతున్నామని తెలియక ఆడుతున్న ఈ చెత్త అధిష్ఠానం ఏ నాడో ఓడిపోయిందని చాలా మందికి తెలుసు!

ఏది ఏమయినా జరుగుతున్న రాజకీయ పరిణామాలలో ఒక మంచి అంశం ఉన్నది.ప్రజలలోకి స్వతంత్రంగా వెళ్లి కాంగ్రెస్ తో సంబంధం లేకుండా వేరే పార్టీ జెండా మీద జగన్ ప్రజల మన్ననలు పొందితే కనుక అది దేశ ప్రజాస్వామ్యానికే ఆరోగ్యకరమైన విషయం.

రాహుల్ గాంధీ కూడా కొద్దిగా యోచన చేయవలసి ఉన్నది!

 

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “జగన్ ‘కాఫీహౌస్’ చెస్!

  1. This is one of the finest piece of commentary that I read on the current happenings.

    I utterly fail to understand the wisdom shown by the so-called high command.

    Shame on the people who voted for సర్వే సత్యనారాయణ like sycophants, who is all on the TV airing utterly disgraceful & inhuman statements like “అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో”

    These buffoons made me sympathize with the otherwise corrupt spoiled brat Jagan

  2. జగనేదో ఘనుడని కాదు కాని ,చాలా లేటైనా ఆత్మాభిమానాన్ని Delhi పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకుండా ధైర్యంగా చొరవ తీసుకున్నందుకు అభినందనీయుడు. .జయాపజయాలు, విజయ పరాజయాలూ ప్రాజాధీనాలు. నీచ నికృష్ట రాజకీయ చదరంగంలో తానో పావుగా మారకుండా తానె ఆటాడేందుకు సిద్ధమౌడం అభినందనీయమేగా.
    (If possible pl. provide your contact No. again.)…Nutakki.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: