కిరణ్ కుమార్ గారి గ్రహాలేమంటున్నాయి?


పెద్దాయనకు ఆరోగ్యం బాగాలేదన్నారు.ఆ మాటకొస్తే ఆయనకు తొలి రోజు నుంచే ఏవీ బాగా లేవు.వరదలలోకి కాలెట్టారు.కె.సి.ఆర్ కాలు జాపి పడుకున్నాడు. దీక్ష చేపట్టిండ్రు సారు అన్నారు.మంత్రులంతా ఇంటిపేరులో శల్యుడిని చేర్చారు!ఎవరో ఓదార్చటానికి వస్తున్నారన్నారు. పాపం తలుపు దాకా వెళ్లి చూస్తే ఇక్కడికి కాదు జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభమయింది.లాభం లేదు. ఎటు చూసినా పాత్రికేయులే!అన్నీ మైకులే!రోజూ సెక్రటేరియట్ లో మధ్యాహ్నం ఓ రెండు గంటలు పడుకున్నప్పుడు కూడా వింత వింత కలలు వచ్చేవిట…పగటి కలలైనా కొద్దిగా కలవరపెట్టేవే!కిటికీ బయట అద్దం వెనుక ముసుగులో సోనియాఏదో పాట కూడా పాడుతున్నట్లు, ఉద్యోగస్తులు జీతాలకోసం గొడవ చేస్తున్నట్లు,కేశవరావు కేవలం నిక్కరు తొడుక్కుని అర్థం కాని భాషలో మాట్లాడుతున్నట్లు,ఇలా చాలా కలలు ఆయనకు వచ్చాయి.కాకపోతే చాలా ఎక్కువ సార్లు ఒక కల ఆయనకు అర్థం కాలేదు.బోనాలు జరుగ్తుండగా ఆయన వెనుక నుండి చ్స్తున్నట్లు,ఊరేగింపు ముందు పోతురాజును ఎక్కడో చూసినట్లు కనిపించేది.ఎవరో అంటున్నారుట…శరీరం డి. శ్రీనివాస్ ది, తల మటుకు కె.సి.ఆర్ ది అని వినిపించే లోపు పోతురాజు ఒక్క సారి వికటాట్టహాసం చేసి ఈయన వైపే తిరిగాడు.జ్వరం వచ్చిందంటే రాదూ పెద్దాయనకి?
మామూలుగా సోనియాని కలిసినప్పుడల్లా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి అనేది.ఇటీవల మటుకు ఆ రెస్ట్ అనే పదం ముందు ‘ఇక’ అని జోడించి పలికిందిట.అయిపోయింది.

~~~***~~~

మన రాష్ట్రాన్ని శని రాహువులు గట్టిగానే పట్టుకున్నాయి.విచిత్రం ఏమిటంటే వై.ఎస్.హెలికాప్టర్ బయలుదేరిన సమయం లో ఉన్న గ్రహాలు శని రాహువులే.రాష్ట్రానికి నడుస్తున్న దశ శని రాహువులది.ఇప్పుడు అడుగు పెట్టిన కిరణ్ కుమార్ గారికి (ఆయన జన్మ తేదీ వివరాలు సరైనవి అయితే ఆయన 13.09.1960 మకర లగ్నం లో జన్మించారు)శని మహర్దశలో రాహువు బుక్తి నడుస్తోంది.ఈ రోజు ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా కుంభ లగ్నం-అష్టమ శనిలో జరిగింది.ఈ ముహూర్తం అంత మంచిది కాదని తెలుస్తోంది.లగ్నం లో గురువున్నప్పటికీ గ్రహబలం సరిపోవటం లేదు.
ఈయనకు మార్చ్ 2013 వరకూ చాలా ఇబ్బందులు ఉండగలవు.పదవిలో అంతవరకూ కొనసాగుతారా అనేది చిక్కు ప్రశ్నే!
ఉన్న వివరాలను బట్టి ఈయనకు ఎక్కువగా, అనవసరంగా కూడా మాట్లాడే అలవాటు వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి.అష్టమంలో రాహువు, ద్వాదశంలో శని ఉండటం వలన, గోచారంలో సప్తమంలో రాహువు, నవమం లో గురువు ఉన్నందున ఎనిమిది పన్నెండు లోని గ్రహాల కలయికలోని దశ నడుస్తున్నందున-విపరీత రాజయోగం వలన ఈ పదవి కనిపిస్తోంది.స్వల్పకాలమేనని చెప్పకుండానే చెబుతోంది.
యోగకారకుడైన శుక్రుడు నవమంలో నీచ అయినప్పటికీ స్వస్థానంలోఉండి ఉచ్చ స్థితిలోనున్న బుధుని సంయోగం వలన, జాతకంలో రెండులోనున్న కేతువు ముహూర్తంలో చంద్రునితో కలసి ఉన్నందుకు, గురువుచే చూడబడినందుకు కొన్ని శుభఫలితాలు కనిపిస్తున్నాయి.కర్మస్థానం లోని రవి వలన పాలనా పధ్ధతి బాగుండగలదు.భూ వివాదాలు, అనుకోని ప్రమాదాలు తలెత్తగలవు.ఒక మతపరమైన ఘర్షణ కూడా కనిపిస్తున్నది.
ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ఎవరికి వారు చట్టాన్నీ, న్యాయాన్నీ చేతిలోకి తీసుకోకుండా నేనున్నానని పాలించగలిగే సామర్థ్యం ఉన్నదా అనే ప్రశ్నకి సమాధానం కూడా జాతకం కంటే అధిస్ఠానమే చెప్పాలని బల్ల గుద్ది మరీ చెప్పే నాయకుడు ఎవరైతే ఏమిటి?జాతకం ఎలా ఉంటే ఏమిటి?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “కిరణ్ కుమార్ గారి గ్రహాలేమంటున్నాయి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: