‘వంతెన’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


యాభై ఏండ్లుగా రోషన్ లాల్ అక్కడ పని చేస్తున్నాడు.’ఇది పెద్ద దర్బారు…’, అంటాడు,’…జీవితం నిజమో అబధ్ధమో మనకెందుకు? మృత్యువును మించిన నిజం లేదు!’
అతని తండ్రి నుంచి ధర్మబధ్ధంగా ఆ కర్మ కాండ అతనికి సంక్రమించింది. యాంత్రికంగా నిలబడి లోకాలు మారిన వ్యక్తి బంధువుల సమక్షంలో విధిగా విధానాన్ని నిర్వహించి వెళ్లిపోతాడు.
‘అందరినీ దాటించే వంతెనను నేను.నాకు భావోద్రేకాలతో పని లేదు.కదలిక అందరికీ పనికి రాదు…’,అంటాడు.
నిగం బోధ్ ఘాట్ దగ్గర కూర్చుని ఎవరైనా ‘మీ నిజ జీవితం మీద దీని ప్రభావం ఉండదా?’ అని అడిగితే చిన్నగా నవ్వుతాడు.
‘కనిపించనివి ముల్లోకాలు…,’చెబుతాడు,’…కని పెంచినవి మన లోకాలు. నమ్మకాలన్నీ కమ్మనైన నిజాలే! నమ్మలేనిది అబధ్ధమెందుకు?’
రోషన్ ఆ రోజు జ్వరం తో వొణుకుతున్నాడు.జోరున వాన.వాటిక బయట ఏదో అలజడి.గుంపులు గుంపులుగా జనం.క్రిందకి దింపిన శరీరాలన్నీ నుజ్జయి ఉన్నాయి.భవంతి కూలింది.డెభ్భయికి పైగా ప్రాణాలు కోలుపోయారు.
లేవలేకపోయినా త్వర త్వరగా అన్ని పనులూ పూర్తి చేసి వచ్చాడు రోషన్.ఎన్నడూ లేనిది ఎందుకో కన్నీరు కార్చటం మొదలు పెట్టాడు.
చనిపోయిన వారి బంధువులు ఇవ్వబోయినా రూపాయి పుచ్చుకోలేదు.ఒక ముసలాయన అందరికంటే చివర దగ్గరగా వచ్చి జేబులో ఏదో పెట్టాడు.
‘ఉంచవయ్యా…’,అన్నాడు,’…జరిగిన విషాదం ఒక ఎత్తు.వాన ఒక ఎత్తు.చేతికి కాగితాలు చేరి ఇక్కడికి రావటానికి ముప్ప తిప్పలు.నిర్జీవమైన శరీరాలు తడిసి నుజ్జయినా కొందరికి ఫరవాలేదు.తడిసిన కరెన్సీలయినా పుచ్చుకోందే వదలిపెట్టరు.
నువ్వెక్కడ దొరికావయ్యా?’
రోషన్ ఏమీ మాట్లాడలేదు.
‘ధర్మం కదా అని …అరే తడవకండి. లోపలికి రండీ’
‘ఫరవాలేదు.ఇక్కడ ఇంత తేలికగా పని కాదేమోనని ఎంతో ఆందోళనతో వచ్చాం.వారు పోయారు, వీరు పోయారు అనే బాధ ఎప్పటికైనా ఉంటుంది.మనం బ్రతికే  ఉన్నామన్న
నమ్మకం నిన్ను చూసాక కలిగింది…’
వాళ్లు బాధ పడుతూనే వెళ్లిపోయారు.
అంత్య క్రియలు చేసే రోషన్ ఎందుకో తనను తాను గర్వంగా చూసుకున్నాడు. తనూ ప్రాణం పోయగలడనుకున్నాడు.

కిటికీ లోంచి మురికి కాలువలా మారిన వాగు మీది వంతెనను అలాగే చూస్తూ నిలబడ్డాడు. వాన కురుస్తూనే ఉంది…

 

~~~***~~~

(ఢిల్లీలో ఇటీవల కూలిన లలితా పార్క్ లోని భవనం -సంఘటన ఆధారంగా వ్రాసిన కథ.రోషన్ అనే వ్యక్తి కథ జరిగిన కథ)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: