మాట్లాడు మాట్లాడు మోహనా!


ఏమీ చేతకానితనాన్ని చాలా మౌనంగా ఎంతో తెలివితేటలతో వ్యవహారం చేస్తున్నట్లు రంగులు పూయించుకుని కాలం వెళ్లదీయటం సంకీర్ణ ప్రభుత్వాలలో చాలా మంచి స్ట్రాటజీ అని కనిపిస్తున్న తరుణంలో స్వామీజీ మంచి చెక్ పెట్టాడు. సుప్రీం కోర్టు సింపుల్ గా ప్రధానిని అఫిడవిట్ ఇవ్వమని సెలవిచ్చింది.

సి.బి.ఐ విచారణ చేపట్టినా ఆ మంత్రి పదవిలో కొనసాగటాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తోంది. అలాగే సి.బి.ఐ పని తీరును విమర్శించటం కనిపిస్తోంది. సోలిసిటర్ జనరల్ గారు సినిమా పక్కీలో చాలా మంచి ప్రదర్శన ఇచ్చారు. కోర్టు వారు ఆ ప్రదర్శన అక్కరలేదు, పెటిషనరే (సుబ్రమణ్యం స్వామి) ప్రధానిని పొగడటం జరిగిందని చెప్పారు. ఇక్కడ ఏమి జరిగినా సోనియా వ్యవహారం మీదనే ప్రజలు మాట్లాడతారు కానీ మోహనాంగుడు పాపం ‘మౌనమె నా భాష…నేనేమి సేతురా…’ అని చెప్పగలరు. టైంస్ ఆఫ్ ఇండియా లోని కార్టూన్ చాలా బాగుంది-సైలెన్స్ ఆఫ్ ద లాంబ్స్ అని శీర్షిక ఇచ్చింది ఆ పేపరు!

స్వామికి జవాబులిచ్చి యున్నారని సోలిసిటర్ జనరల్ గారు సెలవిస్తున్నారు. అవి సమాధానాల్యి ఉండవు. ప్రభుత్వం వ్యవహారాలలో కొన్ని చక్కని పదజాలాలుంటాయి. ‘లుకింగ్ ఇంటు ద మేటర్…’,’పరిశీలనలో ఉన్నది…’, ‘ విషయం సర్క్యులేషన్ లో ఉన్నది..’,’ తీవ్రంగా పరిశీలిస్తున్నారు…’,’ మేటర్ అండర్ కరెస్పాండెన్స్…’,’ ప్రాసెస్ లో ఉన్నది…’-ఇవి దిక్కుమాలిన సమాధానాలు! ఒక్కో సారి వేరియేషన్ కు వివరణ ఇయ్యమన్నప్పుడు ‘వేరియేషన్ మైనర్…’ అంటాడొకడు!

~~~***~~~

మామూలు మనిషికి సమాధానం ఒక ప్రధానిగా  న్యాయస్థానం లో నిలబడి అదే సమాధానన్ని పబ్లిక్ గా అన్ని చేనెళ్ల మాధ్యమంగా ఇవ్వవలసిన బాధ్యత ఆయనకు ఉన్నది. ఈ ప్రధాని ప్రజలకు ఏమీ చెప్పడా? నా గురించి తెలుసు మీకు కాబట్టి నన్ను ఒగ్గేయండి అంటాడా?

నాన్ సెన్స్!

వంద కోట్లకు ప్రధానా లేక ఒక మహిళ ఇంటి గుమాస్తానా ఈయన?
ఉదయం  లేచి రాత్రి ఇంటికి వెళ్లే లోపు శాల్తీలు ఏమవుతాయోననుకుంటూనే జీవితం గడుపుతున్న ప్రతి టేక్స్ పేయర్ కీ ఈయన జవాబుదారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు డిసెంబర్ డెడ్ లైనా లేక ఒక రిపోర్టుకు డెడ్ లైనా అనేది నాయకులంతా సామాన్యులకు గట్టిగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. రూల్ ఆఫ్ లా ఈ దేశం లో ఉన్నదా లేక రూల్ ఆఫ్ దిక్కుమాలిన రాజకీయాలు ఈ దేశాన్ని పాలిస్తున్నాయా? అడిగే హక్కు మాకుంది, చెప్పవలసిన బాధ్యత వారికుంది.

‘Freedom is the appreciation of necessity..’, said Marx,’…and necessity is blind but only in so far as it is not understood.’

రాజకీయాలు తప్ప ఇంకేమీ అర్థం కాని దేశం గా ఈ దేశం మారకూడదు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “మాట్లాడు మాట్లాడు మోహనా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: