ఓరే రాజా…


 

సెప్టెంబర్ 13 2010 న కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ సి.ఎ.జీ సరిగ్గా పని చేయటం లేదు,రాజ్యాంగం లో నిర్దేశించిన తీరుగా ఆ సంస్థ లేదని పేర్కొన్నారు. (ఇండియన్ ఎక్స్ప్రెస్)

రైల్వే శాఖ లో మోటర్ కార్లను ‘అత్యవసర వస్తువుల ‘ జాబితాలో చూపటం,సాంకేతికంగా వీలు కాకపోయినా సి.సి.ప్లస్ కెపేసిటీ లో వేగన్లను లోడు చేయటం,రైల్వే దుర్ఘటనలు నిజానికి ఇటువంటి లోడింగు వలన , తద్వారా వెల్డింగ్ ఫ్రేక్చర్లు, లోకో ఫైల్యూర్లు వలన జరుగుతున్నాయని ఎవరు రిపోర్ట్ ఇచ్చారని ఈయన అనుకుంటున్నాడు? సి.ఎ.జి చెప్పింది. సి.ఎ.జి ఆర్.డి.ఎస్.ఒ లాంటి సంస్థ యొక్క క్లిష్టమైన సాంకేతికపరమైన విషయాలను బయట పెట్టింది.ఈ మంత్రిగారికి వొళ్లు దగ్గర లేదు…
2జి స్కాం ఎవరి వలన తెలుస్తోంది? సి.ఎ.జి వలన!ఇప్పుడు మాట్లాడతాడా ఈయన? నిజానికి ఈ ప్రభుత్వం లో ఉన్నవారు ప్రజలకు వారి గురించి ఏమీ తెలియదనుకోవటం వలన మరింత దుర్మార్గులుగా కనిపిస్తారు.ఏదో చెప్పి వారికేదో తెలుసునని నమ్మించే ప్రయత్నం చేసే వారిలో ఈయన, ఆ లుంగీ లోని బుధ్ధిజీవి!కాలం మారింది.ఈ వేషాలకు కాలం చెల్లిందన్న సంగతి వీరికి జీర్ణించుకోవటం కష్టమే!వారు పుట్టి పెరిగిన పరిసరాలు అవి.

125 లైసెన్సులలో 85 లైసెన్సులు మౌలికంగా అనర్హులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.పాత ఎంట్రీ ఫీసును విస్మరించి 2008 లో కొత్త ఆపరేటర్లను చేర్చుకున్నారని అర్థమవుతోంది.ప్రధాని సూచన ప్రకారం పారదర్శకత పాటించలేదు. (అయినా మనమోహనుడు అప్పట్లో తొణకలేదు!)
అప్పటి ఆర్థిక మంత్రి (ఇప్పుడు నోటికొచ్చింది వాగుతున్న చిదంబరుడు) ఇ.జి.ఒ.ఎం సలహా మేరకు ఈ పని చేయాలని చెప్పటం జరిగింది. అదీ పాటించలేదు! (ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్).
139652 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు దీని వలన దెబ్బ అని సి.ఎ.జి నొక్కి వక్కాణిస్తున్నది!
29 అక్టోబర్ 2010 నాడు సుప్రీం కోర్టు సి.బి.ఐ ను దారుణంగా తిట్టింది.న్యాయమూర్తి గంగులీ ఆ సంస్థని నిద్ర పోతున్నారా? అని అడిగారు.అయినా సిగ్గు లేకుండా మరో ఆరు మాసాలు కావలన్నారు!జస్టిస్ గాంగులీ అడిగిన ప్రశ్న చాలా సబబైనది.మీరు ఈ కేసును విచారిస్తున్నారు. అయినా రాజా ఇంకా మంత్రిగా ఉన్నాడు. ఇదే పధ్ధతి మిగతా మంత్రిత్వ శాఖలకు వర్తింపజేస్తారా? అన్నారు!హై కమాండుకు  అంత తేలికగా సిగ్గు రాదు.
కొద్దిగా వెనక్కి వెళదాం.ఈ రోజు సి.ఎ.జి ఎన్నడూ లేని విధంగా ఒక ప్రెస్ కాంఫరెన్స్ పిలచి ఈ విషయాలను బయట పెట్టటం లో చాలా పరమార్థం ఉన్నది.

2007 లో రాజా గారు స్పెక్ట్రం వేలం ఉండదని ప్రకటించారు.టాటా, రిలయన్స్ ఇద్దరూ వేలం అవసరం లేదని పేర్కొన్నారు.(సి.ఎ.జీ వీరిద్దరికీ అనర్హంగా కేటాయింపులయినట్లు చెబుతోంది)
కాకపోతే ఆర్థిక సర్వే రిపోర్ట్ స్పెక్ట్రం ను వేలం వేయాలని,ఆ కేపిటల్ గెయిన్ ను టేక్స్ చేయాలని చెప్పి యున్నది.

ఇన్ని జరుగుతున్నా కథ జరిగిపోయింది.
రాదియా, ఎన్.జి.ఓ,మీడియా వ్యవహారం తో మన వాళ్ల లాబీయింగు ఎంతగా కుళ్లుకుని పోయిందో చక్కగా కనిపిస్తోంది.

సి.బి.ఐ ఎందుకు అలా చల్ల బడిందో అర్థమవుతోంది.సి.బి.ఐ కాంగ్రెస్ సంస్థ అని కొందరు అభిప్రాయపడ్డారు కూడా…

ఈ రిపోర్టు పి.ఎ.సీ ముందు ఉంటుంది కాబట్టి పి.ఎ.సీ వ్యవహారం తరువాత జె.పి.సి గురించి ఆలోచించటం మంచిది.మొయిలీ లాంటి మంత్రులు సంస్థల గురించి మాట్లాడే ముందు వారి అంతరంగం గురించి ఆలోచించటం మంచిది.

ఏకాం లజ్జాం పరిత్యజ్య సర్వత్ర విజయీ భవేత్! (ఒక్క సిగ్గనే దానిని వదిలేస్తే సర్వత్ర విజయమే కదా!)

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: