మామ ఒబామా భారత్ లో!


‘ Today, the terms of competition revolve around a central axis: a nation’s ability to mobilize,attract,and retain human creative talent.Every key dimension of international economic leadership from manufacturing excellence to scientific and technological advancement will depend on this ability’~Richard Florida in his book ‘The Flight of the Creative Class’.

~~~***~~~

తన టర్మ్ లోని పూర్వార్థం లో మన దేశానికి వస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామా.ఆర్థిక పరిస్థీలోని విస్తీర్ణాన్ని పెంచి అమెరికాలో ఉద్యోగాలు సృష్టించటం కోసం,చైనా కు ఓ చిన్న చెక్ పెట్టటం కోసం ఈ పని ఒబామా చేస్తున్నట్లు పలు వర్గాలు ఏర్కొనటం జరిగింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు,అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలు,ఆర్థిక విధానాలు ఎలా ముడి పడి ఉంటాయో అందరికీ తెలిసిందే.2008 లో సివిల్ న్యూక్లియర్ ఒప్పందం నేపథ్యం లో అమెరికాలోని నాస్ డాక్ లో అక్కడి అణు నిర్మాణ రంగం లో ఉన్న కంపనీల షేర్ లన్నీ అకస్మాత్తుగా పెరిగాయి…
అదలా ఉంచి ఒక సారి చైనా మాట వచ్చింది కాబట్టి ఒబామా భారత్ రాక,భారత్,అమెరికా సంబంధాల పట్ల చైనాలో ఎలాంటి స్పందన ఉన్నదో చూద్దాం.సెంటర్ ఫర్ అమెరికన్ స్టడీస్,(ఫ్యుడన్ యునివర్సిటీ,షాంఘాఇ) అధ్యక్షుడు డింగ్లీ షెనన్న మాట ఆసక్తికరంగా ఉంది.పొఖరన్ నేపథ్యం లో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఏర్పరచిన అమెరికా భారత్ పట్ల  పెద్ద గొప్పగా ఏమీ వ్యవహరించలేదని ఆయన పేర్కొన్నారు.అతి శక్తివంతమైన ప్రజాస్వామ్యం అయిన అమెరికా అతి పెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్ పట్ల గౌరవం ఏమీ కనబరచలేదని చెప్పారు.భారత్ యొక్క కాంపెటిటివ్ నెస్ ఆ దేశం లోని ఇన్స్టిట్యూషనల్ ఇన్నొవేషన్,ఆర్థిక పెరుగుదల నుంచి వస్తుంది కానీ కేవలం అమెరికాతో చేతులు కలిపితే ఏమీ రాదన్నారు.చైనా వారి నుంచి ఈ స్పందన సామాన్యమే.కాకపోతే ఆయన చెప్పిన కొన్ని అంశాలు ఆలోచించవలసినవి.మొదటిది-ఏదైనా దేశం మీడ దాడికి దిగేటప్పుడు భారత్ కళ్లు మూసుకుని అమెరికాను బలపరచబోదు.రెండు,అణు సప్లై గ్రూప్ విషయంలో చైనా భారత్ కు సపోర్ట్ గానే ఉన్నదని చెబుతున్నారు(గతంలో ఆ గ్రూప్ ఆపరేషన్ల పై ఏర్పరచిన నియమాలానిటినీ చైనా ఒప్పుకోలేదు).మూడవది-బుష్ చైనాకు నాలుగు సార్లు వచ్చినప్పుడు భారత్ కు చెక్ పెట్టాలని రాలేదు. అలాగే ఇప్పుడు భారత్ కు ఒబామావస్తే చైనాకు ఏమీ అభ్యంతరం లేదు.’అతి పెద్ద శక్తులైన చైనా లేదా భారత్ దేశాలతో ఆ ప్రాతిపదిక మీద ఎవరూ వ్య్వహరించరని ఈయన చెబుతునారు!
బాగుంది.చైనాలో ఆర్థిక విధానాల నేపథ్యం లో తన చుట్టూ ఉన్న అన్ని దేశాల మార్కెట్లను వారి మానవ వనరులతోనూ,సాంకేతిక నైపుణ్యంతోనూ (ముఖ్యంగా ఇంఫ్రాస్ట్రక్చర్ లో)ఆక్రమించాలనే ఒక ధోరణి కనిపిస్తుంది.కొన్ని దశాబ్దాలుగా చైనా ఒరవడి అలాంటిదే!అవసరం అనుకున్న చోట ఎంతో గౌరవప్రదంగా మాట్లాడుతుంది.మరునాడే  అరుణాచల్ మాది అంటుంది…

మామ ఒబామా దగ్గరకు వద్దాం.వ్యాపారం అంటున్నారు.నిజమే.ఇది లాభదాయకమైన విషయమే.పెట్టుబడుల గురించి ఆలోచిస్తే  1992 తరువాత ఇరు దేశాల మధ్య డబల్ డిజిట్లలో పెట్టుబడులు సాగుతూ వచ్చాయి.ప్రస్తుతం 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇరు పక్షాలలో ఉన్నట్లు అంచనా.ఇరు దేశాల ద్వి పక్ష వ్యాపారం 43 బిలియన్ డాలర్లు ఉండవచ్చు.కాకపోతే ఇది అమెరికాకు, చైనాకు ఉన్న దానిలో పదిలో ఒక వంతు కంటే తక్కువ.
ఇక్కడే స్ట్రేటెజిక్ భాగస్వామ్యం ముందుకు వస్తుంది.డ్యువల్ యూస్ టెక్నాలజీ విషయంలో కనుక ఒప్పందం కుదిరితే ఒక విధమైన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం వైపు ముందుకు వెళ్లగలం.అతి పెద్ద రక్షణ రంగ మార్కెట్ తలుపులు అమెరికాకు తెరుచుకుంటాయి.మన ఆయుధాల ఆధునీకరణ విధానం లో కనీసం మరో అయిదేండ్లు పట్టవచ్చని ఉన్న అంచనా చైనాకు ప్రతి రోజూ సంబరంగానే ఉంటుంది.ఆ దిశగా ఆలోచిస్తే అది మంచి పరిణామమే.కొద్దిగా ముందుకు వెళ్లి అమెరికా మన స్పేస్ రిసర్చ్ (ఇస్రో),అలాగే డి.ఆర్.డి.ఓ ను ఎంటిటీల జాబితాల నుండి తొలగిస్తే అది గణనీయమని చెప్పవలసి ఉంటుంది.
ఏది ఎలా ఉన్నా మల్టీ బ్రాండ్ రిటెయిలింగ్ లో అమెరికా ఎఫ్.డి.ఐ ను సాధించగలదని కనిపిస్తోంది.
మిగతావి ఒప్పందాల తరువాత చూడగలం.

~~~***~~~

ముంబయిలో సముద్రం మీద నుండి కట్టిన రాజీవ్ గాంధీ ఫ్లై ఓవర్ మీదుగా వెళితే ప్రపంచీకరణ,ఆధునికతపట్ల గర్వంగా ఉంటుంది.అక్కడికి చేరుకునే ముందు ఇతర  బ్రిడ్జీల క్రింద శాశ్వతంగా స్థిర పడ్డ మురికి వాడలను చూస్తే మరో విషయం ముందుకు వస్తుంది.హ్యూమన్ డెవెలప్ మెంట్ ఇండెక్స్ లో భారత్ చాలా వెనుక బడి ఉన్నది.ఆర్థిక అభివృధ్ధి,ప్రజల సౌఖ్యం ఎడ దారి, పెడదారి లా ఉండటం చాలా మందిని కలవరపెడుతోంది.
ఒబామా ట్రిప్ లో క్లైమేట్ చేంజ్, ఆఫ్రికా లోని దారిద్ర్యం రంగాలలో భారత్ అమెరికాతో కలసి పని చేయటం గురించి చర్చలు ఉండగలవని తెలుస్తోంది.స్ట్రేటెజిక్ భాగస్వామ్యం లో పెద్ద పిక్చర్ ను చూసి ముందుకు కదులుతామని ఇరువురూ చెబుతున్నారు.దీనిని ఒక అవకాశంగా తీసుకుని తర తరాలుగా మూలుగుతున్న మామూలు మనిషిని ఆ పెద్ద పిక్చర్ ఫోకస్ లోకి తేగలమా అనే ఆలోచన ఎవరికైనా వస్తే బాగుంటుంది.లేకపోతే అంతా మామూలే! అక్కడ నిషేధించబడిన మందులు మామూలుగా మనం ఇక్కడ మనం మింగుతూనే ఉంటాం…
ప్రపంచ పరిస్థితులు,అర్థిక మాంద్యం ఇలా మారుతూ ఉన్న తరుణం లోనే అవసరానికి కొందరు మన వద్దకు వస్తారు.సమయం,అవసరం,డబ్బు లేదా ఆర్థిక పరిస్థితి-ఈ మూడే లోకాన్ని నడుపుతాయి.మన జనం మన మార్కెట్.మన జనం మన సంపద.వీరికి అనుగుణంగానే బేర సారాలు జరుపవచ్చు.అదే మన శక్తి.మన జనం పట్ల వోటు రాజకీయాలకు భిన్నంగా ఆలోచించగలిగే ప్రతిభ ఉన్నవారి దగ్గరినుంచి ఈ మంచి అవకాశాన్ని గుర్తించగల నైజాన్ని ఆశించవచ్చు…వారు ఉన్నారా?
~~~***~~~

ఈ వ్యాసం లో ముందుగా చెప్పిన మాట-పోటీ అనేది మానవ సృజనాత్మకత చుట్టూ తిరుగుతుందని రిచర్డ్ ఫ్లోరిడా చెప్పారు.దానిని ఎంతగా ఆకర్షించి పెంపొందిచే ప్రయత్నం ఒక దేశం చేయగలదో అంతగా ప్రపంచం లో రాణించగలదు.ఈ సృజన శీలులు ఎక్కడివారైనా కొన్ని ప్రశ్నలు డిగి తీరుతారు-మామ ఒబామా ముందుగా తాజ్ లో బలి అయిపోయిన వారి సంస్మరణార్థం ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ ఘాతుకానికీ అమెరికా ఏ దేశం మీదనైనా దాడి చేసే నైజానికీ గల సంబంధం ఆ సమయం ఆయనకు గుర్తు వస్తుందా?
మార్కెట్ గురించి చర్చలు జరిపే ముందు భోపాల్, ఏండర్సన్ వ్యవహారం గుర్తుకు వస్తుందా?
తీవ్రవాదులకు స్వగృహమైన పాకిస్తాన్ కు మిలియన్ల డాలర్ల ఎయిడ్ ఇస్తున్న వీరికి కశ్మీర్ లో ఎందరు సైనికులు,ప్రజలు,పోలీసు దళాలు ప్రాణాలు కోలుపోతున్నారన్నది గుర్తుకొస్తుందా?
వీరందరూ మీకు కావలసిన మార్కెట్ లో అభిన్నమైన అంగాలని మరవకండి.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “మామ ఒబామా భారత్ లో!

  1. మీరు చెప్పిన షాంఘాయ్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ నేను విన్నాను ఇక్కడ రేడియోలో. చాలా బేలెన్సుడ్ గా చెప్పారనిపించింది. మీరు కూడా వివిధ కోణాలనించి చూసి రాశారు. బాగుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: