నవంబర్ 2010 రాశి ఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహ చంచరీక: నిరంతరం మంగళమాతనోతు

మేష రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకునే మాసం ఇది.గతం లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.బాగా ఖర్చులు చేస్తారు.సహోద్యోగులతో జాగ్రత్తగా మసలవలసి ఉంటుంది.దూరప్రయాణం చేసే అవకాశం ఉంది.ఆదిత్య హృదయం చదవండి.శనివారం తక్కువ మాట్లాడండి.

వృషభ రాశి: పదోన్నతి పొందుతారు.మిత్రులు సహకరిస్తారు.స్త్రీలు అభివృధ్ధిలోకి వస్తారు.లావాదేవీలు లాభిస్తాయి.నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాలలో మీ మొండి వైఖరి వలన ఇతరులు బాధ పడతారు. మీరు గతం లో విస్మరించిన వారికి సహాయపడతారు.కలసి వచ్చే సంఖ్య 15.

మిథున రాశి: శత్రువుల మీద విజయం సాధిస్తారు.ఆదాయం బాగుంది.కొత్త పని చేపడతారు.మాసం మధ్య నుండి ఆరోగ్యం మెరుగు పడగలదు. హృద్ రోగం ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రేమికులకు మాసాంతం లో మంచి రోజులు. గృహ నిర్మాణం లో ఉన్న వారికి కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురు కావచ్చు.శివాలయం లో అభిషేకం చేయించగలరు.

కర్కాటక  రాశి: ప్రయాణాలు మానుకోవటం మంచిది.పాత మిత్రుల కలయిక ఉండగలదు. వ్యాపారస్తులు మాసం చివర నిర్ణయాలు తీసుకోవటం మంచిది.రాజకీయ నాయకులకు కొన్ని అనుకోని విజయాలు సంభవం.జీవిత భాగస్వామి వివేకం వలన కొన్ని సమస్యలకు పరిష్కారం లభించగలదు. పట్టుదలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. కులదైవాన్ని కొలవండి.

సింహ రాశి: భార్యా భర్తల మధ్య విభేదాలు ఉండగలవు.అనవసరమైన విషయం చర్చకు రాగలదు.బాధ్యతలు పెరుగుతాయి.వాహనం మారుస్తారు.బంధువుల నుండి సహాయం పొందుతారు.ప్రభుత్వం నుండి మంచి వార్తలు వింటారు.దంతాల విషయం లో జాగ్రత్త వహించాలి.కలసి వచ్చే వారం సోమవారం.

కన్య రాశి: మంచి నిర్ణయాలు తీసుకుంటారు.సంఘంలో గౌరవం బాగుంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పనులలో వితరణ వలన కార్యాలు పూర్తి కాగలవు.సైన్యం లో ఉన్న వారికి బదిలీ ఉండగలదు.భూమి అమ్మాలనుకున్న వారికి మంచి మాసం.కొందరి జోక్యం గురించి విచారన్ణ చేయవలసి ఉంటుంది.శ్రీసూక్తం పారాయణ చేయండి.

తుల రాశి: నేత్ర పరీక్ష చేయించవలసి రావచ్చు.అవివాహితులు వివాహం విషయం లో ఆలోచనలో పడగలరు.మీ చిన్న వారి పట్ల ఏదైనా నిర్ణయం తీసుకునే అంశం ఉంటే కొన్ని రోజులు వాయిదా వేయగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. ఉపాధ్యాయులకు గౌరవం లభించగలదు.రాజకీయాలలోని వారికి చిత్రమైన పరిణామాలుండగలవు.విష్ణు సహస్రనామం చదవండి.

వృశ్చికరాశి: గృహ సంబంధమైన విషయాలలో మంచి లాభాలున్నాయి.పనులు పూర్తి కాగలవు.ఆభరణాలు జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉన్నది.మీ వాక్చాతుర్యం కొందరిని ప్రభావితం చేయగలదు.కాల్పనికమైన మాటలకు లొంగకూడదు.విదేశీ యానం గురించి ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలుండగలవు.కలసి వచ్చు సంఖ్య 12.

ధను రాశి: తీర్థయాత్రలుండగలవు.ఇంటిలో చిన్న సైజు పోట్లాటలుండగలవు.తోడి కోడళ్ల మధ్య వివాదాలు వింతగా పరిణమించగలవు.మెట్లు ఎక్కేటప్పుడు గానీ దిగేటప్పుడు గానీ జాగ్రత్త వహించాలి.ప్రభుత్వోద్యోగులకు ప్రతిభ నిరూపించే అవకాశాలు బాగుంటాయి.ఆదాయం మెరుగు పడగలదు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

మకర రాశి: వ్యాపారస్తులకు లాభాలు బాగున్నాయి.ఇంటిలో శుభకార్యాలు జరుగగలవు.స్త్రీలకు బదిలీలు ఉండగలవు.మధ్యవర్తిత్వం వలన సమస్యలు తలెత్తగలవు.విద్యార్థులు మంచి ప్రతిభ చూపిస్తారు.వ్యవసాయ రంగం వారికి అలజడులు తప్పవు.కొత్తగా పెళ్లయిన వారికి మంచి పరిణామాలుండగలవు.

కుంభ రాశి:తప్పు ఒప్పుల బేరీజు వేయవలసిన సందర్భం పొంచి ఉన్నది.నూతన ఉద్యోగావకాశం ఉన్నది.విలాసానికి సమయం వెచ్చిస్తారు.మీ మాట అర్థం కాకపోవటం వలన ఇతరులు పనులలో ఆటంకం ఏర్పరచగలరు.ఆదాయం బాగుంటుంది.నాయకులు వారి మీద జరిగే ఆరోపణల పట్ల శ్రధ్ధ వహించాల్సి ఉంటుంది.పిల్లలు మంచి వార్తలు వినిపిస్తారు. హనుమాన్ చాలీసా చదవండి.

మీన రాశి: ఆలోచనల నుండి ఆచరణలోకి రావలసిన మాసం.చిత్రకారులు రాణించగలరు.లాభాపేక్ష లేని వారికి లాభాలు,ఆశ ఎక్కువగా ఉన్న వారికి కొంత నిరుత్సాహం ఈ మాసం విశేషం.కొందరి వైఖరి అర్థం కాకపోవచ్చు.విదేశాల నుంచి మంచి అవకాశాలకు సంబంధించి వార్తలు వినగలరు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఆదివారాలు కలసి రాగలదు.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

 

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “నవంబర్ 2010 రాశి ఫలాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: