అన్నీ యుధ్ధాలే…పోయేది జనం !


వికీ లీక్స్ మాటే నిజమయితే (నిజం కాదు అని చెప్పేందుకు అమెరికా దగ్గర పెద్దగా ఆధారాలేమీ కనిపించటం లేదు!) ఇరాక్ యుధ్ధం లో లక్షకు పైగా చనిపోతే అందులో 60 వేలకు పైగా చనిపోయింది సివిలియన్స్! మామూలు మనుషులు…

ఐ.ఎం ఎఫ్ లోపల అందరూ కొట్టుకుంటున్నారు! ఎకనమిక్ టైంస్ లో శుభద సబదె (సింబయాసిస్ లో గెస్ట్ ఫేకల్టీ) మంచి మాట చెప్పారు. 1944 బ్రెటన్ వూడ్స్ ఒప్పందం లో బంగారం ఒక ఔన్స్ కు 35 డాలర్లు బేరం ఆడింది అమెరికా. 1971 లో నిక్షన్ ఈ కరెన్సీ వ్యవహారం లోనే పెద్ద బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. ప్రస్తుతం ఉన్న అమెరికా ప్రభుత్వం చైనా లాంటి దేశాలతో బేరం చేస్తోంది దేనికో అందరికీ తెలిసిందే.  వారి డబల్ డెఫిసిట్ ను అందరినీ ఫైనాన్స్ చేయమని కోరుతోంది! దీనిని ఎదుర్కొనేందుకు మరల ఎక్కడో అక్కడ ఒక యుధ్ధాన్ని సృష్టించగలదనే ఊహ కూడా దాదాపు సరైనదే! చచ్చేది ఎవరు? సామాన్యుడే!
అంతా మోసమే! జర్మనీ 1990 లో యూరో దేశాలను కాపరేషన్ కోరింది. బుండెస్ బాంక్ ను టైట్ చేయద్దని ఆ దేశం పార్ట్నర్స్ అడిగారు. కాలేదు…

అన్ని దేశాలూ కరెన్సీ విలూవలను పి.పి.పి (పర్చేసింగ్ పవర్ పేరిటీ) స్థాయిలకు తగ్గించుకుంటూ పోతే చివరకు ఎస్. డి.ఆర్ (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) కరెన్సీలుగా మిగిలిపోతాయని ఒక హాస్యాస్పదమైన వ్యాఖ్య ఉన్నది.
జి20 దేశాలు ఈ విషయంలో ప్రపంచ దేశాలు కాపరేట్ చేయాలని కోరాయి. బాగుంది. కాకపోతే చరిత్ర చెబుతున నిజాలు వేరు. ఇంటిలో సమస్య అలానే పెట్టుకుని ఏ దేశమూ మరో దేశం బాగు కోసం విధానాలను మార్చుకోదు.
అందరి మార్కెట్లూ ఓపెన్…బేరాలు మటుకు నన్ను కాకుండా లెక్కేసుకోమని! ఈ కరెన్సీ యుధ్ధం చూడటానికి బాగుంది!
ప్రపంచ దేశాలలో దిగుమతులు,ఎగుమతులు మీద దృష్టి తగ్గి స్వావలంబన వైపు విధానాలు వెళుతున్నాయి. ఈ దిశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదరికం, ఇంక్లూసివ్ గ్రోత్ అనేవి మరల ముందుకు వచ్చాయని పెద్దలు చెబుతున్నారు! ఈ నేపథ్యం లో మన మార్కెట్ లో రెగ్యులేషన్, తేలికగా మనం అందుకునే బాహ్య కాపిటల్…ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం కొద్దిగా మరల ఆలోచించాల్సి ఉన్నది.

వాస్తవానికి ప్రస్తుతం  చాలా గట్టి డొమెస్టిక్ మార్కెట్ వైపు విధానం ఉండాలి. అది పర్చేసింగ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆదాయపు ఎలాస్టిసిటీ ఎక్కువగా ఉండే వారి మీద ఆధారపడి ఉంటుంది. ఈ అవకాశం భారత్ చైనాలో ప్రస్తుతం ఎక్కువగా ఉండటం గమనార్హం…(గ్రామీణ,పట్టణ ప్రాంతాలలోని జనాభా మధ్య ఉన్న వ్యత్యాసం, వివిధ సెక్టర్ల పని తీరు, మొబిలిటీ…). సర్వీసెస్ సెక్టర్ మీద మరో సారి ఇదే సమయం లో దృష్టి సారించి గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

భారత్ చైనాల సహకారం అమెరికా ఊరకే కోరటం లేదు. అక్కడ నిరుద్యోగం 10% దాటుతున్నది. ఒబామా గారి రాక వారి అవసరం అని గట్టిగా గుర్తించి మన ప్రభుత్వం ఆ దేశం లోని మన వాళ్ల ఉద్యోగాలు, విసాల వ్యవహారం చర్చలోకి తీసుకుని రావాలి. భౌగోళికంగా ఆలోచిస్తే చైనా తో ఇంఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఇప్పటికే మనకు, చైనాకు ఉన్న మంచి వ్యాపార సంబంధాల దృష్ట్యా ఈ రెండు ఆసియా దేశాలు కొన్ని విషయాలలో కలసి ఉన్నాయని చెప్పకుండానే అమెరికాకు చెప్పటం  వ్యూహాత్మకంగా చాలా అవసరం. జపాన్ తో తొందరపడి కొన్ని వ్యవహారాలను చేసుకుంటే ఇటు చైనా తేలికగా మన మాటలు ఒప్పుకోవటం జరగకపోవచ్చు!

కరెన్సీ యుధ్ధం ఎటు పోతుందో వేచి చూడాలి.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “అన్నీ యుధ్ధాలే…పోయేది జనం !

 1. //భారత్ చైనాల సహకారం అమెరికా ఊరకే కోరటం లేదు.
  అక్కడ నిరుద్యోగం 10% దాటుతున్నది. //

  హమ్మయ్యా! మన కుర్రాళ్ళు పది శాతం మంది నిరుధ్యోగులుగా ఉండంగా అక్కడివారూ భాగు పడిపోతున్నారేమోనని కుళ్ళుకునేవాడ్ని. మనలాగే అందరు చెడి ఉంటే అదో “తుత్తి”

 2. చావకిరణ్ గారూ,
  మీకు తెలియనిదేముంది. మనం టైం ఎంత అని అడిగితే ఎదుటి వాడు చెప్పే సామాదానం వెనుకు అతని ఆయువుకాలపు జ్నాపకాలుంటాయి. నాకిప్పిడు వయస్సు 43 సం.లు.ఏ చిన్న విషయాన్ని ప్రస్తావించినా గతమంతా క్లిబ్బింగులుగా, మేండేజ్ షాట్సులుగా దర్శనమిస్తూంది.

  మరీ పాఠకులకు బోరై పోకూడదని ఇలా కప్ప దాటు స్టైల్ మెయింటెయిన్ చేస్తున్నా. మరో టపాలో మీరన్నట్టుగానే వ్రాస్తా.

  మీ స్పందనకు థ్యాంక్స్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: