చందన్ కియారిలో చైనా వారు మనకు నేర్పుతున్న విద్య


కొద్ది కాలం క్రితం బంగ్లదేశ్ లో భారతీయ రైల్వే వారు అక్కడి ఇంఫ్రాస్ట్రక్చర్ లో పాలు పంచుకొనేందుకు వెళ్లారు. వీళ్ల వ్యవహారానికి వాళ్లు తట్టుకోలేదు!మెల్లగా చైనా వారు దూరారు. ఉచితంగా కొన్ని ఇంఫ్రాస్ట్రక్చర్ పనులు చేయటానికి ముందుకు వచ్చారు. అది ఒక స్ట్రాటజీ!

ఈ రోజు తంజానియా లో మన దేశం లోని సాంకేతిక వర్గం వారిని దగ్గరకి రానీయటం లేదు. కారణం? మన  దొరబాబుల వ్యవస్థ అటువంటిది.తంజానియాలో మన స్థానాన్ని చైనా ఆ ఆక్రమించింది…

అంత దూరం వెళ్లక్కరలేదు.మన దేశానికే వద్దాం.ప్రస్తుతం ఇంఫ్రాస్ట్రక్చర్ మీద జి.డి.పి లో 5% కంటే ఎక్కువ పెట్టని మనం చైనాతో ఎలాగూ తూగలేము.రానున్న దశాబ్దం లో ఈ రంగానికి చాలా డబ్బు కేటాయించినట్లు తెలుస్తోంది.వీటిలో పి.పి.పిలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.కాకపోతే మన ప్రభుత్వం చాలా ఆలస్యంగా నిద్ర లేచిందని చెప్పవలసియున్నది.ప్రస్తుతం ఈ రంగం లో నైపుణ్యం గల వారి సంఖ్యలో తీవ్రమైన కొరత ఏర్పడింది.ఎలెక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, వెల్డర్లు,మెకానిక్కులు, మేసన్లు ఇటీవల ఏర్పడిన జనరేషన్ వ్యత్యాసంలో కనిపించటం లేదు.కారణం సింపుల్.నిరుద్యోగం సమస్య అలానే ఉన్నప్పుడు అత్యవసరమైన రంగాలలో ఇంఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి సారించి ప్రభుత్వం శిక్షణ పథకాలను ఏర్పరచలేదు.

హ్యూమన్ కాపిటల్ అంటే మన దొరబాబులకు ఎంత తెలుసో తెలుసుకోవటం పెద్ద కష్టమైన పని కాదు.ట్రెయినింగ్ అనే ప్రక్రియను మన వాళ్లు చాలా దూరంగా ఉంచటం మరో దౌర్భాగ్యం.జనాభాను చీదరించుకోవటం మనకు తెలిసిన విద్య.దానిని డైనమిక్ గా మార్చటం చైనా వాళ్లు చేయగలిగారు.జనాభాను సరైన హ్యూమన్ కాపిటల్ గా గుర్తించగల్గటానికి మన అధికారులకు అధికార దుర్వినియోగం,హోదా,దోచుకుని తినటం,బెల్లు నొక్కి ప్యూన్ చేత చెత్త పనులన్నీ చేయించుకోవటం లాంటి నీచమైన బ్రిటిష్ సామ్రాజ్యపు మైండ్ సెట్ నుండి ఇవతలకి   రావలసిన అవసరం ఉన్నది.సరెండర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఎంత చేస్తే వాళ్ల సి.ఆర్ లు అంత బాగుంటాయి. పైకి పోయి మరింత దోచుకోవచ్చు.కాకపోతే ఇక్కడ కామెడీ ఏమిటంటే కాలం మారి పోయి చాలా కాలం అయింది.వాటిని  అసహ్యించుకుంటున్నారు అనే ఆలోచన నలుగురిలోకీ వచ్చి క్లంసీగా నిలబడే ఏ బొద్దింకా అనుకోదు…
నెహ్రూ గారు ప్రియదర్శినికి ఒక సారి వ్రాసారు-ఈ రాజా మహారాజాలు ఇంకా ఆ దుస్తులలోనే తీగేస్తూ ఉంటారు. ఆంగ్లేయులు ఏదైనా పార్టీకి పిలిస్తే అలాగే వచ్చి నిలబడతారు.అందరూ వారిని వింతగా చూస్తుంటే ఏమనుకుంటారో ఏమో కానీ దే మేక్ ఎ బిగ్ న్యూసెన్స్ ఆఫ్ దెం సెల్వ్స్…అన్నారు.
వీళ్ల పరిస్థితీ ఇలానే మారుతోంది…

చందన్ కియారీలో (ఝార్ ఖండ్)చైనా వాళ్లు (15000)మన వాళ్లకు స్టీల్ ప్లాంట్ తయారీలో కలసి పని చేస్తూనే శిక్షణ ఇస్తున్నారు.ఈ లేబర్ చాలా నిదానంగా పని చేస్తారని వాళ్లు చెబుతున్నారు.కొద్దిగా సోమరితనం కూడా ఉన్నదని చెప్పారు.
చైనా వాళ్లు పోర్ట్లు,హైవేలు,స్టీల్ ప్లాంట్ లు,పవర్ ప్లాంట్ లు, ఆయిల్ రిఫైనరీలు,బ్రిడ్జులు,టెలికం  రంగాలలో మన దేశంలో పని చేస్తున్నారు.ఢిల్లీలోని కొత్త ఎయిర్ పోర్టులో గ్లాస్ ఫకాడ్ ను వీళ్లే తయారు చేసినట్లు తెలుస్తోంది.
అశోక్ పార్థసారథి గారు  ఒక సారి  ‘ద హిందూ ‘దిన పత్రికలో ఒక మంచి మాట చెప్పారు (22.06.2006).ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ వారు గోండా జిల్లాలోని మంకపుర్ లో డిజిటల్ ఎలెక్ట్రానిక్ స్విచింగ్ సిస్టంస్ తయారు చేసే ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసారు.ఇందులోని సిబ్బంది  అక్కడి ట్రైబల్స్! వారికి శిక్షణ ఇప్పించి  ప్రపంచ స్థాయిలో దీటైన ప్రాడక్ట్లను తయారు చేయించగలిగాం.

ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం? విధానాలు ఏర్పరచే వారిలో దూరదృష్టి లేకపోవటం.పొట్ట పోసుకోవటం తప్ప దేశం కోసం ఆలోచించే సివిల్ సర్వెంట్ కనిపించటం లేదు.సాటి మనిషిని, వాడిలోని గుణగణాలనీ గుర్తంచగలిగే వ్యవస్థ రానంతవరకూ ఈ అడుక్కుని తినే పరిస్థితి తప్పదు!

సరైన సమయం లో సరైన శిఖణా ప్రణాలికల ద్వారా పబ్లిక్ ఎంట్ర్ప్రైసెస్ ను దృఢంగా తీర్చి దిద్దే పనిలో మన దేశం అప్పటి ఫ్రాన్స్, ఇప్పటి చైనా దగర చాలా నేర్చుకోవాల్సి ఉంది.ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ లోకి దూరే వారికి మైండ్ సెట్, పబ్లిక్ స్ట్రాటజీల మీద ఒక మార్పు,ప్రపంచ తీరు తెన్నుల మీద సరైన బోధనా తరగతులు ఏర్పరచాలి. ఇంఫ్రాస్ట్రక్చర్ పనులను ఆర్థిక పురోగతితో చైనా మేళవించగలిగింది. మన మేధావులు ఎందుకు చేయలేకపోయారు?!చైనా ఆ కళను అలా వదిలేయలేదు.దొరికిన చోట ఉపయోగించుకుని అమ్ముకుంటోంది కూడా!దటీస్ హ్యూమన్ కాపిటల్!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “చందన్ కియారిలో చైనా వారు మనకు నేర్పుతున్న విద్య

  1. చాలా ముఖ్యమైన విషయాలు బయటికి తెచ్చారు.
    డబ్బునీ సహాయాన్ని ఎరచూపి ప్రపంచ దేశాల్ని తన కోటుజేబులో వేసుకోవడాన్ని అలవోకగా నిర్వహించే అమెరికాకే – ఈ విషయంలో చైనా ఝలక్ తినిపిస్తున్నది. అనేక ఆఫ్రికను దేశాల్లో ఇటువంటి ఉచిత ఇంఫ్రా సహాయం ఇస్తామని చెప్పి దానికి బదులుగా ఆయా దేశాల ఖనిజ వనరులన్నిటిపై గుత్తాధిపత్యం తీసుకుంటున్నది చైనా. తద్వారా రాబోయే దశాబ్దాల్లో అనేక లోహాలు, ఇతర ధాతువులు కొనుక్కోవాలంటే చైనాని శరణు వేడక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: