‘రక్తచరిత్ర ‘చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ‘ఫిల్మ్ నువార్ ‘ అనేది ఫ్రెంచ్ వారు 1948 లో ఒక తరహాకు చెందిన చిత్రాలకు ఉపయోగించారు. వీటిలో ముఠా గొడవలు,రాజకీయాలు, సోషల్ రియలిసం,ఇలాంటివి చోటు చేసుకున్నాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఫిల్మ్ నువార్ తరహా చిత్రాలు రాజకీయ సంఘటనలతో చాలా గట్టిగా ముడిబడి ఉండటం పలు భాషలలో,పలు దేశాల చలనచిత్ర రంగం లో మనం చూసాం.(లిటిల్ సీసర్,ద పబ్లిక్ ఎనిమీ,స్కార్ ఫేస్…1930 లోనివి ).సామాన్యంగా ప్రొటాగనిస్ట్ తన హింసతో కూడిన యాత్రలో  మృత్యువు వైపు వెళుతూ కూడా ఒక న్యాయాన్ని నిరూపిస్తూ సాగిపోవటం మనకు కనిపిస్తుంది.ఆ పధ్ధతిలో ఆలోచిస్తే రాం గోపాల్ వర్మ గారి చిత్రం ‘రక్త చరిత్ర ‘ఒక గొప్ప ప్రయోగం.వివేక్ ఒబెరాయి (పరిటాల రవి పాత్రలో) నేను సిస్టం లోకి కాదు నేనే సిస్టం గా మారుతాను…అనే మాట చెప్పినప్పుడు చాలా కాలం తరువాత ఒక వెండి తెర మీద విసువల్ మీడియం ను ఎంచుకుని నిజ జీవితం లోని కథను మలచి ఇంత మాట చెప్పిన దర్శకుడు కనిపించినందుకు సంతోషించాను!

~~~***~~~

పరిటాల రవీంద్ర ఒక నాయకుడుగా ఎందుకు ముందుకొచ్చాడు అనే అంశం మీద ఈ చిత్రం మొదటి భాగం నడుస్తుంది (రెండవ భాగం నవంబర్ లో విడుదల కానున్నది). చదువుకుంటున్న రవి తన తండ్రిని హతమార్చిన వ్యక్తుల మీద తీసుకునే ప్రతీకారం కథాంశం. ఇంటర్వల్ తరువాత రాజకీయపు రంగుతో ఆనందపురం లో ఎన్నికలు, సినీ రంగం నుండి వచ్చి రజకీయాలలో రణించాలని అనుకున్న శివాజీ రావ్ గూండాయిసం ను ఎదుర్కొనే దిశగా రవిని తనతో కలుపుకోవటం ఇవన్నీ ముందుకు వస్తాయి…

ముఠా తగాదాలలో కొన్ని పాత్రలను చూద్దాం.నరసింహా రెడ్డి కి ప్రక్కనుండే నాగమణి పాత్రలో కోటా శ్రీనివాసరావు గారి నటన రక్తి కట్టింది. నిమ్న వర్గాల గ్రూప్ లో ఉండి వంచింపబడ్డ వ్యక్తిగా ఆశీశ్ విద్యార్థి నటన ముందుకు వచ్చింది.చిత్రం ఏమిటంటే పాత్రలు తెలిసి ఉన్నప్పుడు ఆ పాత్రలను దర్శకుడు ఏ ప్రక్రియలోకి ఎంచుకుని ఒక కథను ప్రదర్శించదలచుకున్నాడు అనేదు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న నటులు ఈ చిత్రం లో నటించారు.

వివేక్ ఒబెరాయి రవి పాత్రకు జీవం పోసాడు.పోలీసులు ఈరోజు వరకూ అసలు ఎవరిని కాపాడారు? వారి సిబ్బందినే కాపాడుకోలేకపోయారని కోటా పోలీసు వారికి చెబుతున్నప్పుడు పోలీసు వేషాలలో వచ్చి వివేక్ ముఠా అతన్ని హత మార్చటం కొత్త ప్రయోగం. సూటిగా ఏక్షన్ లో ఒక నిజాన్ని దర్శకుడు చెప్పాడు.

రాజకీయ నాయకుడు వివేక్ ను ఏమిచేయాలో తణికెళ్ల భరణి దగ్గర తెలుసుకోమంటాడు. భరణి అతన్ని మందు గడ్డం తీయమంటాడు.ఏది ఎలా ఉన్నా మొహం మటుకు చాలా నీటుగా కనిపించాలని చెప్పటం బాగుంది. వెను వెంటనే రాజకీయ నాయకుని క్లోస్ అప్ నవ్వు తెప్పించింది.టాపిక్ ఈస్ ఓవర్ అనే మాట ఆ పాత్రకు అద్దుకుంది.

బుక్కా హత్య చాలా రియల్ గా చిత్రీకరించారు. అది ఆర్.జి.వి బ్రాండ్!

ఈ చిత్రం లో వెనుక నుంచి ఇచ్చిన వ్యాఖ్యానం అనవసరం అనిపించింది.పైగా ఆ గొంతు ఎవరిదో కానీ అనాస పండు ముక్క ముళ్లతో పాటు ఇసకతో కలిపి గొంతులో పెట్టుకుని మాట్లాడుతున్నట్లుంది. టెంపో కోసం నేపథ్య సంగీతం బాగానే ఉపయోగపడినా చూస్తున్నది రక్త చరిత్ర అని ప్రతి సారీ వెనుక నుంచి రక్త రక్త అని భయపెట్టటం అనవసరమేమోననిపించింది.

కెమెరా పట్టుకున్న వారు ప్రతిభావంతులు.
నిజానికి ఈ చిత్రం విడుదల ముందు వచ్చిన వివాదాలు,మీడియా సృష్టించిన వ్యవహారం అంతా అనవసరం అనిపించింది.ఏ వర్గం వారికైనా ఒక ఫిర్యాదు చేసే తావు నాకైతే ఎక్కడా ఏమీ కనిపించలేదు.

~~~***~~~

ఈ చిత్రం లో వివేక్ ఒబెరాయి,శత్రుఘ్న సింహ (ఎన్.టి.ఆర్),సూర్య,కోటా శ్రీనివస రావు,ప్రియమణి,రాధికా ఆప్తె,అభిమమన్యు  సింగ్ ఇత్యాదులు నటించారు.
రచన-ప్రశాంత్ పాండే,కెమెరా-అమోల్ రాఠోడ్.

తరువాయి భాగం కోసం ఎదురు చూడాలి!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “‘రక్తచరిత్ర ‘చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

  1. ఈ చిత్రం లో వెనుక నుంచి ఇచ్చిన వ్యాఖ్యానం అనవసరం అనిపించింది.పైగా ఆ గొంతు ఎవరిదో కానీ అనాస పండు ముక్క ముళ్లతో పాటు ఇసకతో కలిపి గొంతులో పెట్టుకుని మాట్లాడుతున్నట్లుంది. – This golden voice owner is “RAMGOPAL VERMA”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: