కలిసుందాం రా…!


మార్చ్ 2010 లో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది.పెళ్లి ముందు శారీరిక సంబంధాలు పెట్టుకోవటంలో తప్పు లేదని ఖుష్ బూ చేసిన వ్యాఖ్యల మీద మద్రాసు హై కోర్టు తప్పు పట్టగా ఆమె సుప్రీం కోర్టులో దావా వేయగా న్యాయమూర్తుల బృందం అటువంటి పబులను తప్పు పట్టేందుకు ఏమీ కారణాలు లేవని చెప్పింది.వివాహం జరగకుండా కలసి ఉండే సంబంధాలు పెట్టుకోవటం కూడా తప్పు కాదని చెప్పింది.

~~~***~~~

ఆగస్ట్ 2010 లో సుప్రీం కోర్టు ‘లివ్ ఇన్ ‘ సంబంధం ఉన్న వ్యక్తిని ఏ సెక్యూరిటీ లేకుండా వదిలేయవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పింది.

అక్టోబర్ 2010 లో ఇప్పుడ్య్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును చూద్దాం:

‘సాంఘికపరమైన సంబంధం ‘ గురించి కోర్టు ప్రస్తావిస్తోంది. ఈ ప్రస్తావన వివాహం అనే వ్యవస్థను అధిగమించి మాట్లాడుతోంది కానీ మన దేశం లోని ప్రశాసనం ఈ విషయంలో ఎటువంటి  విధానాన్ని తలపెట్టింది అనే ఆలోచన చేసినట్లు కనిపించటం లేదు.ఇది సాంఘికపరమైన విషయమే కాదు,సాంఘిక దురాచారాలు, నేరాలు,అత్యాచారాల గోల ఇందులో ఇమిడి ఉన్నదన్న ఆలోచన, సామాజికపరమైన చైతన్యం తృణప్రాయంగానైనా న్యాయమూర్తులలో కనిపించలేదు.’సాంఘిక సంబంధం ‘ అనే  మాట కొద్దిగా ఆలోచించి వాడవలసిన మాట.

భరణానికి అర్హురాలు అవ్వాలంటే ఈ రకమైన సంబంధం లో ఉన్న మహిళ సమాజానికి వివాహబంధం లో ఉన్న వ్యక్తిలాగా సమాజం ముందుకు రావాలిట!ఈ న్యాయమూర్తులు నేల మీద ఉన్నారా లేక ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు?

వయసు వివాహానికి తగ్గది అయి ఉండాలి.బాగానే ఉంది.

వివాహం చేసుకునేందుకు అన్ని విధాలా ఇద్దరూ అర్హులయి ఉండాలి.

ఇద్దరూ ఇష్టం గానే కలసి ఉండిన సంబంధం అయి ఉండాలి.

ఇవి వీళ్లు చెప్పిన విషయాలు!

ఎంతమందితో జంపు జిలానీ చేసినా ఫరవాలేదా?వైవాహిక పరమైన వ్యవహారం లోకి కోర్టు వారు తీసుకుని వచ్చేస్తారా? బాగుంది.
మార్చ్ నెలలో వివాహం ముందు శారీరిక సంబంధాలు పెట్టుకోవటం లో తప్పు లేదన్న కోర్టుకు ఇప్పుడు ఈ ‘లివ్ ఇన్ ‘ వ్యవహారానికి వివాహ వ్యవస్థతో ముడి ఎందుకో?!లివ్ ఇన్ వ్యవహారం వైవాహిక వ్యవస్థలోని బాధ్యతను ప్రక్కన పెట్టి శారీరిక న్యాయం, కొద్దిగా ఇతర అవసరాలకు ఉపయోగపడేందుకు చేసుకునే ఏర్పాటు.అది విచ్చలవిడితనానికి దిక్కుమాలిన హై సొసైటీ ఇచ్చిన రూపాంతరం.ఆ వర్గం లో అభిన్నమైన భాగం మేమని చెప్పకుండానే చెబుతున్నారు ఈ న్యాయమూర్తులు.

చాలా కాలం క్రితం కలసి ఉండటం నేరం కాదు, కాకపోతే వైవాహిక బంధం లో లేనప్పుడు ఆ విధంగా కలసి ఉండటం నైతికమా కాదా అన్నది సమాజం నిర్ణయించాలి, కోర్టు కాదు అని ఒక ప్రాంతం హై కోర్టు వారు తీర్పు ఇచ్చారు.అది ఒక పధ్ధతిగా ఉంది. నీతి,న్యాయం,సంస్కృతి,సంఘం,సమాజం…ఇలా కొన్ని పదలు ఇంకా శబ్దకోశం లో ఉన్నాయని వారు గుర్తు చేసారు!అవి లేవని వీరు ఈ రోజు చెబుతున్నారు!

ఇక్కడ మరో చిత్రం కనిపిస్తోంది. పార్లమెంటు ‘బంధాలను వైవాహిక బంధాలుగానే ‘ చెప్పింది కానీ ‘లివ్ ఇన్ ‘ సంబంధాల గురించి చెప్పలేదని, ఆ రకమైన చట్టాలను ఏర్పరచే బాధ్యత వారిది కాదని కోర్టు వారు చెబుతున్నారు.మరి పర్లమెంటు వైవాహిక బంధం గురించే చెప్పిందని చెబుతున్న వారు వివాహం ముందు శృంగారం లో తప్పు లేదని ఎలా చెప్పేస్తున్నారు?ఇక్కడ పార్లమెంటు గుర్తుకు రాలేదా?

మన వ్యవస్థలో దున్నపోతులు ఎక్కువయ్యారు.మామూలు జంతువులు కావు. మదపిచ్చి కమ్మేసి ఏమీ కనిపించని పశువులు అన్ని రంగాలలోనూ నిండి పోయారు.అదీ అసలు సమస్య!
ఏకాం లజ్జాం పరిత్యజ్య సర్వత్ర విజయీ భవేత్!…ఒక సిగ్గు అనే దానిని త్యజిస్తే చాలు.సర్వత్ర విజయమే!
కానీయండి!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “కలిసుందాం రా…!

 1. మీ అవగాహనలో కొద్దిపాటి లోపాలున్నాయి.

  ౧. పెళ్ళికి ముందు సెక్సుసంబంధం తప్పు కాదంటే దానర్థం – ఆ సంబంధాన్ని శిక్షించడానికి అవసరమైన చట్టాలు ఇప్పటిదాకా లేవని కోర్ట్ అభిప్రాయం. కనుక వైవాహిక సంబంధాలను మాత్రమే కోర్ట్ ముందు నిరూపించగలం. లివ్-ఇన్ సంబంధాల్ని నిరూపించలేం. నిరూపించాలంటే వారు చెప్పిన ప్రీ-కండిషన్స్ ఆవసరమవుతాయి. న్యాయపరంగా ఇదొక టెక్నికల్ కాంప్లికేషన్. అదే వారు స్పష్టం చేశారు.

  ౨. కోర్ట్ అభిప్రాయమేంటంటే “వివాహపూర్వ సంబంధాలూ, లివ్-ఇన్ సంబంధాలూ పెట్టుకుంటే పెట్టుకోండి. మేమేమీ శిక్షించం. కానీ ప్రస్తుతం ఉనికిలో ఉన్న వ్యవస్థ ప్రకారం అలాంటి సంబంధాలకు చట్టపరమైన గుర్తింపు గానీ తద్ద్వారా సంక్రమించే హక్కులూ, బాధ్యతలూ గట్రా మాత్రం ఉండవు. అందుకు సిద్ధపడితేనే అలాంటివి పెట్టుకోండి” అని !

  ఇందులో అసంబద్ధత ఏముంది ? ఉన్న చట్టాల ననుసరించి తీర్పులిచ్చే అధికారం మాత్రమే కోర్టులకు ఉంది. లేని నియమాల్ని కల్పించే అధికారం వాటికి లేదు. ఆ విషయమే వారూ తెలియజేశారు.

 2. ఇప్పుడు అమల్లో ఉన్న వివాహ – విడాకుల వ్యవస్థ వల్ల ఇటు మగవాడికీ, అటు ఆడదానికీ ఇద్దరికీ సుఖం లేదు. వివాహిత జీవితాలు దుఃఖభాజనంగా పరిణమించాయి.

  Let this marriage system die its natural death. Why are you worried ? It has long outlived its original purpose. This system over0burdened the male with monetary responsibility of everyone around him. It has practically rendered him a money-making machine and also a dignified slave to woman. Live-in relations will drive the last nail into its coffin. That event will be something to celebrated by all men (males) on a grand scale.

  1. Quite right! The present brand of females have got used to a system of advocating responsibilities for the husband with no obedience or regard for him or his family! The upsurge from such a situation is this new found convenience. The legal system can scarcely go into this…

   I have only pointed out the helplessness of the Legal system in coming round to a socio cultural issue. It should have stated precisely that and left it there instead of talking about the live in relations and a case for alimony with reference to the marital system. This is where the Court’s inconsistent attitude stands exposed.
   There is fundamentally no difference between my post and your comments!

 3. @వారు వివాహం ముందు శృంగారం లో తప్పు లేదని ఎలా చెప్పేస్తున్నారు…
  ఏమయినా గానీండి ..మన సమాజం లో వివాహం ముందు గానీ తర్వాత గానీ తప్పుడు సంబందాలు విచ్చలవిడిగా జరుగుతూ వున్నాయ్..ఆడగానీ, మగ గానీ అది తప్పుగా భావించకున్నారు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: