శ్రీ దక్షిణామూర్తి దీక్ష-కోటప్ప కొండ


శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ:

ఈశ్వరుని అనుఙ్ఞ చేత భక్తుల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కొరకు ఈ క్రింది విషయాలను మనవి చేసుకుంటున్నాను:

యల్లమునిమంద గ్రామంలో గతంలో మునులు మందలు మందలుగా శివుని ప్రార్థిస్తూ ఉండేవారు. సతీ వియోగం తరువాత పరమశివుడు లోకాలను సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత ప్రశాంతత లభించిందని పురాణం చెబుతున్నది.ఈ గ్రామమే ప్రస్తుతం యలమంద గ్రామం అని చెప్పుకుంటున్నాము.కోటప్ప కొండ ప్రాంతం లో మూడు శిఖరాలున్నాయి.
బ్రహ్మశిఖరము (త్రికూటేశ్వరుడు/త్రికోటేశ్వరుడు),రుద్రశిఖరము, విష్ణు శిఖరము.బ్రహ్మశిఖరం మీద ఒక బిల్వ వృక్షం క్రింద శివుడు బాల్యరూపంలో మేధా దక్స్గిణామూర్తిగా అవతరైంచాడని ప్రతీతి.అందుచేత దక్షిణమూర్తి అందరికీ గురువుగా పూజలందుకుంటాడు.

దక్షిణామూర్తి ఉపాసన మనశ్శాంతి కొరకు,విద్యా బుధ్ధుల కొరకు,ఏకాగ్రత్త, చిత్తశుధ్ధి కోసం,రోగ వినాశనం కొరకు,ఙ్ఞానం కొరకు,ఆయురరోగ్యైశ్వర్యముల కొరకు పలువురు చేపడుతూ ఉంటారు.

కోటప్ప కొండ చరిత్ర 1172 కంటే పూర్వం నుంచి కనిపిస్తుంది.కులోత్తుంగ చోళుని శిలాశాసనం (1172)దీనికి తార్కాణం.

సామాన్యంగా శివాలయాలలో దక్షిణ ద్వారం దగ్గర దక్షిణామూర్తి విగ్రహం మనం చూస్తాం.కైలాసం నుండి దక్షిణం  వైపు శివుడు తరలి రావటానికి ఇది ఒక చిహ్నమని పెద్దలు చెబుతూ ఉంటారు. కాకపోతే దక్షిణామూర్తి ఉపాసన, దీక్ష గురించి జనబాహుల్యంలో తక్కువ ప్రాచుర్యం ఉన్నది. ఈ దీక్ష గురించి వివరాలు దేవస్థానం వారి నంబరు:08647 247111 లేదా 247133 కు ఫోను చేసి బ్రహ్మశ్రీ గుడిపల్లి నాగభూషణం గారు గానీ లేదా చిలకలూరిపేట దక్షిణామూర్తి భక్తి సమాజం వారిని (9885790079)సంప్రదించి తెలుసుకోగలరు.

ముఖ్యంగా ఈ వ్యాసం ఇప్పుడు వ్రాయటానికి కారణం ఒకటి ఉన్నది. శ్రీ ద్కషిణామూర్తి దీక్ష ధనుర్మాసం లోని ఆర్ద్ర నక్షత్రం వచ్చే రోజుకు 40 రోజులు ముందు ప్రారంభమవుతుంది.అంటే ఈ సంవత్సరం నవంబరు 7 వ తేదీన ఈ దీక్ష ఇస్తారు.

ఈ దీక్ష ఎలా తీసుకోవాలీ ,పాటించవలసిన నియమలు ఏవి ,ఇతర వివరాలు త్వరలోనే ఇక్కడ పొందు పరచగలను.

శుభం భూయాత్!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “శ్రీ దక్షిణామూర్తి దీక్ష-కోటప్ప కొండ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: