మన ఇంఫ్రాస్ట్రక్చర్-కామన్ వెల్త్ ఆటల వ్యవహారం లో మొదటి పాఠం…


అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి అంటూ చాలా మంది చెబుతూ ఉంటారు. అలా ఆలోచించగలిగే పరిస్థితులు కల్పించే దిశగా ఏ సంస్థా పని చేయదు.వ్యవస్థలో చీప్ అండ్ బెస్ట్ అనేదే టెండర్ల విషయాలలో కొనసాగాలంటే వ్యవహారం ఇలానే ఉంటుంది.చీప్ అనేది ఏ రోజూ బెస్ట్ కాదు.దేని మూల్యం దానికి ఉంటుంది.చెత్త వ్యవస్థలో ఉత్తమమైన పరిణామాలు చూపించమన్నప్పుడల్లా మిగిలేది-రెడ్ టేప్,కరప్షన్,నానా దౌర్భగ్యపు రీతులు…

2012 నుండి అయిదు సంవత్సరాల ఒక గడువులో ఒక ట్రిలియన్ డాలర్ల ఖర్చు ఇంఫ్రాస్ట్రక్చర్ మీద మన దేశం పెట్టనున్నది.ఇదే పధ్ధతిలో పెట్టనున్నదా? ఈ ప్రశ్నను ప్రధానమంత్రి గారు ముందు మేధావులందరి ముందరా పెట్టి సరైన సమాధానాన్ని పొందాలి.ప్రభుత్వ వ్యవస్థ సరైన వ్యక్తులను పని చేయనీయదన్న నగ్న సత్యాన్ని గుర్తించి ఆలోచించాలి.1.2 బిలియన్ జనాభా పట్టణాలలో అతి కిరాతకమైన పరిస్థితులలో జీవిస్తున్నది.ఇది చాలా వేగంగా పెరుగుతోంది.రోడ్ల నిర్మాణం లో ఉన్న సమస్యలు ఎప్పటి లాగే ఉన్నాయి.పెట్టుబడుదారులు ప్రభుత్వం లోని పధ్ధతులకు చిరాకు పడి దూరంగా ఉన్నట్లు అర్థమవుతోంది. వెస్ట్ బెంగాల్ లో తలపెట్టిన పి.పి.పీ ల పరిస్థ్తీ అలానే ఉంది.కాల్మాడీ మీద విరుచుకుని పడి ఉపయోగం లేదు.సమస్య ప్రధాని తన చుట్టూ చూస్తే అర్థమవుతుంది.దొరబాబులు సృష్టించుకున్న సామ్రాజ్యం ఇది.ముందు దానిని కూల్చే ఆలోచన చేయాలి. చేతకాకపోతే వల్ల కాదని ప్రక్కకు పోవాలి!

జి.డీ.పి లోని 6% మన దేశం ఇంఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతోంది.ఇది ఆసియా లోని ఎన్నో దేశాల కంటే చాలా తక్కువ. చైనా లో 11% ఉంది…

పెరుగుతున్న ఫిస్కల్ డెఫిసిట్,రా మటీరియల్ ధరలు విపరీతంగా పెరగటం, రిస్కులు తీసుకోమంటున్న పెట్టుబడిదారులు…ఇవి ఒక్క పూటలో తీరిపోయే సమస్యలు కావు.

వ్యవస్థలో ప్రక్షాళణకు పూనుకోవల్సి ఉంది.దానికి కూడా దొరబాబులను పెట్టి ఒక కమిటీ వేసి ఆ ప్రక్రియను పాతేసి పూడ్చేయటం మన వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.ఇటీవల తంజానియాలో రైల్వే ఇంఫ్రాస్ట్రక్చర్ కోసం ముందుకు వచ్చిన చైనాను ఆ దేశం వారు మనసారా ఆహ్వానించారు. భారతీయులు ఆ రంగం లో కనిపిస్తేనే చిరాకు పడ్డారు!సిగ్గు,లజ్జ అనేవి ఈ వ్యవస్థలో ఈదుతున్న వారికి ససేమిరా రాదు!

అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఆటల విషయంలో ఏ దేశంలోని మీడియా ఈ విధంగా ప్రవర్తించదు. సమస్యలోకి ఓతుగా వెళ్లి సూచనలు చేయటం ఎలాగూ ఉండదు.దొరికిందే ఛాన్స్ అని పండగ చేసుకుంటున్నారు తప్ప అక్కడ జరిగిన కొంత మంచి పనినైనా చూపించి దేశం కోసం పాపం పని చేస్తున్న వారిని ఉత్సాహ పరచటం ఇతర దేశాలలోని మీడియా వారు చేసే పని. మన వాళ్లు తాజ్ హోటల్ లో జరిగిన కాల్పులప్పుడే వారి నైజాన్ని బయట పెట్టుకున్నారు.ఇదో పెద్ద లెక్క కాదు.దేశాన్ని నిలబెట్టి అమ్మే ప్రక్రియలో మన మీడియా ముందు  నిలబడుతుంది.

కుక్కలలో రకాలుంటాయి.ఒకటి ఊరకే కాలు నాకుతూ ఉంటుంది.రెండు ఎటు పరుగు తీసి ఏది నాకాలా అని చూస్తూ ఉంటుంది.మూడు అక్కడ ఉన్న వారి సైగ కోసం చూస్తూ ఉంటుంది.నాలుగోది చిత్రమైనది.సైగలతో ,చిటికెలతో పని లేదు.చిటికెలో ఎక్కడ పడితే అక్కడే నాకేస్తుంది.మొదటి మూడు ఏవో ఒకరు చెప్పక్కరలేదు.నాలుగోది మటుకు మన మీడియా చేస్తున్న పని.ఇది ఈ రోజు మన నిజమైన ఇంఫ్రాస్ట్రక్చర్!

ఎనీ టేకర్స్?
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: