మరో సావిత్రి సర్జనా సింగ్…


డానిష్ అజీజ్ (ఈ.టీవీ రిపోర్టర్ ) ఇచ్చిన ఒక రిపోర్ట్ (ఈనాడు 20.09.2010) కొద్దిగా కదిల్చింది.అజీత్ అనే ఒక లెక్చరర్ ను చంబల్ లోయలోని గూండాలు  ఎత్తుకెళ్లి అతని భార్య (సర్జనా సింగ్ )ను పది లక్షలు అడిగారు. ఆమె కొంత డబ్బు, కొన్ని నగలు తీసుకుని రాత్రి వేళ తెలియని ప్రాంతంలో చెప్పిన చోటుకు బయలు దేరింది. కూడా వచ్చిన సోదరుని ఆగ్రా దగ్గర ఆగరా అని ఆపేసింది!అతని ప్రాణాలను కూడా పణంగ పెట్టటం ఆమెకు ఇష్టం లేదు.ఆ ముఠా నాయకుడు విస్మయం చెంది ఆమెను సోదరిగా స్వీకరించి తన చెవి పోగులను బహుమానంగా ఇచ్చి అతన్ని వదిలేశాడు!డబ్బు తీసుకోలేదుట!

ఇంకా ఈ భూమి మీద వర్షాలు కురుస్తున్నాయంటే ఇటువంటి భారతీయ స్త్రీల వల్లేనని దృఢమైన నమ్మకం కలుగుతోంది…

భర్తలను కరివేపాకులా తీసి పారేసే భార్యలు,ఎవరి చెప్పు చేతలలోనో ఉంటూ ఎవరితోనో కాపురం చేసే పతివ్రతలు,అత్త మామలను రాచి రంపాన పెట్టే స్త్రీ రత్నాలు ఒక్క సారి ఈ వార్తను చదువ వలసి ఉన్నది…

సర్జనా సింగ్ ఎంత చదువుకుందో ఏమో!ఆమె చదివిన పుస్తకాలు,చూసిన సీరియళ్లూ,పాల్గొన్న కార్యక్రమాల గురించి మనకి తెలియదు. ఆమె విద్యావంతురాలని తెలుస్తోంది!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “మరో సావిత్రి సర్జనా సింగ్…

  1. సింహం చంపబోతుంటే, తన దూడకి పాలిచ్చి వస్తానని, తన మాట నిలబెట్టుకొన్న గోవు కథ పుక్కిటి పురాణం అనేవాళ్లు ఈ కథనం ద్వారా తెలుసుకోవచ్చు–బందిపోట్లకి కూడా “హృదయం” వుంటుందనీ, వాళ్లు పరిస్థితులకి మాత్రమే బానిసలనీ!

    ఆ బందిపోట్లకి నా జోహార్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: