9/11-మస్జిద్ కట్టే మాట,కురాన్ ను తగులబెట్టే మాట…


ఒక మాష్టారు బాగా అల్లరి చేస్తున్న కుర్రాడి తండ్రిని పిలిపించి చెప్పాడు,’మీ వాడు తెగ అల్లరి చేస్తున్నాడు.అస్సలు చెప్పిన మాట వినడు.ఎలాగండీ?’
ఆయన మాష్టారిని ప్రక్కకు తీసుకుని వెళ్లాడు.’చూడండి సార్.తేలికైన పని చెబుతాను….’,అన్నాడు,’…మా వాడి ప్రక్కన కూర్చునే అబ్బాయిని చితకబాదేయండి.మా వాడికి భయం వేసి అల్లరి మానేస్తాడు.’,అన్నాడు!

~~~***~~~
కొందరి నైజంలో ఎంతసేపూ ఇంకొకరిని బాధించే తత్వమే కనిపిస్తుంది.ఆత్మశోధన,అంత:కరణము జీర్ణించుకున్న సంప్రదాయంలో ముందు మన వాడు ఏమి తప్పు చేసాడా అనే ఆలోచన ముందు కలుగుతుంది.ఆ తరువాత ఒక నిర్వచనానికి వస్తారు.ఈ ప్రక్రియ పారలౌకికమైన, పరమార్థిక చింతనకు దోహద పడేది కానీ లౌకికమైన  వ్యవహారానికి,దైనందిన శాసనానికి సరైనది కాదు.దాని ప్రతిఫలం భారతదేశం కొన్ని శతాబ్దాలుగా అనుభవిస్తూ వస్తోంది…

ఇస్లాం మతం మీద జిహాద్ అనే అంశం పట్ల, ఇస్లామిక్ తీవ్రవాదం అనే విషయం మీద పలు చోట్ల రగులుకున్న తీవ్రమైన విమర్శలకు ఒక ప్రతిక్రియగా మా మతం చెడ్డది కాదు,మేము తీవ్రవాదులం కాము అని చెప్పేందుకు ఒక ప్లాట్ ఫారం తయారు చేసే ఆలోచనలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర గ్రౌండ్ జీరో లో ఒక ఇస్లామిక్ సెంటర్ ను, మస్జిద్ ను కట్టే పనికి కొందరు పూనుకోవటం జరిగింది.దానికి విరుధ్ధంగా పలు చోట్ల  పబ్లిక్ ఒపినియన్ కూడా చెలరేగింది.కొద్ది రోజుల క్రితం ఈ బ్లాగులో నేను ఒక వర్గం వారి అభిప్రాయం తో ఏకీభవించటం కూడా జరిగింది.వారి అభిప్రాయంలో మతం మాట ప్రక్కన పెట్టి సెప్టెంబర్ 11 ఘాతుకంలో ప్రాణాలు కోలుపోయిన వారి కుటుంబాల గాయాల మీద శాశ్వతంగా నిలచిపోయే ఖారం చల్లటం అవుతుంది,ఇది మంచి పని కాదు అని .ఈ మాటలో నిజం లేకపోలేదు.ఇస్లాం పట్ల విరోధం లేని వారికి కూడా ఉద్రేకం కలిగించే పని ఇక్కడ చేస్తున్నారా అనే ప్రశ్న మిగిలింది.

అదే క్రమంలో ఆ రోజున కురాన్ పుస్తకాలను తగులబెట్టాలనిపాస్టర్ టెరీ జోన్స్ పిలుపునిచ్చారు. ఇది ఇలా సాగుకుంటూ పోయే వ్యవహారం…ఆ దేశంలో తీవ్రమైన మనస్తాపాన్ని ఇరు వర్గాలలో మిగిల్చి అవకాశం, అవసరం వచ్చినప్పుడల్లా సంఘ విద్రోహక శక్తులు వారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే కాలానికి ఇది పునాదిగా తయారవగలదు.

మహమ్మదీయులు కట్టవలసినది అక్కడ మస్జిద్ కాదు.ఆ నీచమైన పనిని చేపట్టి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వారికీ, ఇస్లాం మతానికీ ఎటువంటి సంబంధం లేదు అని నిర్ద్వంద్వంగా చెప్పదలచుకున్నా,అటువంటి చిత్తశుధ్ధి నిజంగా ఉన్నా,అక్కడ ఆ చనిపోయినవారి ఙ్ఞాపకార్థం ఒక సర్వమతాలకు సరిపోయే స్తూపాన్ని కట్టి తిరిగి ద్వేషం ఉన్మాదం అనేవి మానవతను లొంగదీయకూడదని ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరపాలి…

ఖయ్యాం తన రుబాయీలో అంటాడు:

కలపయు మట్టిరాలనిడి కట్టిన దేవళమందు నీకు ఏ ఫలము లభించు?
ప్రేమరసభావ యుతుండవయేని కామినిన్ వలపుము,ప్రాణహీనమగు బండలు వేయిటి కన్న
శ్రేష్ఠమై అలరుగదా, మనుష్య హృదయమ్ము ప్రతి ప్రణయానురక్తులన్!

కామిని మాట అలా ఉంచి మానవాళి కోసం ప్రేమరసభావహృదయం అనే మాట అమృతవాక్కులా వినిపించాడు.భవనాల మీద  కాదు,ప్రేమ, వాత్సల్యం ,మానవత అను భువనత్రయాల మీద మానవజాతి భవిష్యత్తు నిలబడి ఉంది.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “9/11-మస్జిద్ కట్టే మాట,కురాన్ ను తగులబెట్టే మాట…

  1. బాగా చెప్పారు.ఇప్పుడు మానవజాతికి కావలసింది ప్రేమ, వాత్సల్యం ,మానవత.రెచ్చగొట్టేందుకు కాకపోతే మసీదు అక్కడే ఎందుకు కట్టాలి?మసీదే ఎందుకు కట్టాలి?సర్వమత ప్రార్ధనా మందిరం లాంటిది కట్టొచ్చు.డబ్బుంటే ఇంకా ఎక్కడయినా స్థలాలు కొని కట్టుకోవచ్చు.ఖురాన్ ను తగలబెడితే సమశ్య ఇంకా తీవ్రమౌతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: