పాలసీ విషయాలలో తల దూర్చవద్దు-సుప్రీం కోర్టుకు ప్రధాని సందేశం!


ఆహార ధాన్యాల విషయంలో సుప్రీం కోర్టు వారు ధాన్యాన్ని పారేసే బదులు బీదవారికి ఉచితంగా ఇవ్వండి అని చెబితే ప్రధాని పాలసీ విషయాలలో తల దూర్చవద్దని సమాధానం చెప్పారు.దేశం లో నలభై శాతం కూరగాయలు, పండ్లు వేస్టుగా పారేయబడుతున్నాయన్నది పాలసీ విషయమేనా? పాలసీ అనే మాటలో న్యాయాన్యాలుంటాయి కదా? బాగుంది. అవి నిర్ణయించేందుకు ప్రభుత్వం ఉన్నది కాబట్టి అందులోకి రావద్దంటున్నారు పెద్దాయన. శుభం భూయాత్!

పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం లో విధిగా కోర్టు వారిని సంప్రదించటం ఎందుకు మానేసారని ప్రధాన న్యాయమూర్తి గారు అడిగినప్పుడు సమాధానం ఎందుకు చెప్పలేదో మరి!

అదలా ఉంచండి. ఆర్. బి.ఐ లోని ఉషా తొరట్ పదవీ విరమణ తరువాత ఎవరు రావాలీ అనే దానికి ప్రభుత్వం వారు ఒక సర్చ్ కమిటీ వేసారు. ఎందుకు సార్? ఇటీవల ఆర్.బి.ఐ పని తీరు వలన ఆర్థిక వ్యవస్థ ఈమాత్రంగా నిలబడి ఉంది!సరైన సమయానికి ఆర్.బి.ఐ తన క్రెడిట్ పాలసీని చక్కగా మేనూవర్ చేసింది.ఉషా తొరట్ పలు చోట్ల ప్రభుత్వనికి ఇబ్బందులు సృష్టించింది కాబట్టి సరైన వాళ్లు కావాలి.గవర్నర్ కు వదిలేయలేరన్నమాట!అదివరకు ఎక్స్టెన్షన్లు ఇచ్చినట్లు ఎందుకు ఇవ్వటం లేదు?ప్రపంచం లో చాలా దేశాలు సెంట్రల్ బాంకుకు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తున్నాయి.బ్రిటన్ లో ఫైనాన్షియల్సర్వీసెస్ అథారిటీని పూర్తిగా తీసేసారు!మనం దొరబాబులను మరి కాస్త చంకన ఎత్తుకుంటున్నాము! ఫైనన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవెలప్ మెంట్ కౌన్సిల్ ఏర్పరచినప్పుడు (విదేశీ పెట్టుబడుల వ్యవహారాల కోసం)ఆర్. బి.ఐ నుంచి ఒక్క ప్రతినిధీ లేకుండా ఎందుకు చేసారు?మీ పనులకు అడ్డమనే కదా?

ఇటీవల న్యాయ విషయాలకు  సంబంధించిన ఒక ట్రైబ్యూనల్ లో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది…

ఆర్థిక సర్వే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు-ఇది పాలసీకి సంబంధించినవే!2009 లో అ ఆహార ధాన్యాల డిస్ట్రిబ్యూషన్, బఫర్ గురించి సరైన నిర్ణయం తీసుకోగలిగినప్పటికీ అలా చేయకపోవటం వలన ప్రస్తుత ఫుడ్ ఇంఫ్లేషన్ ఇలా ఉన్నదని, స్క్యూఫ్లేషన్ లోకి వ్యవస్థ ఎన్నడూ లేనట్లుగా వెళ్లిందనీ ప్రభుత్వాన్ని తప్పు పట్టటం జరిగింది!సమాధానం ఏది?హుక్కా ముఖర్జీ గారు ఏమీ మాట్లాడరేమి?

డాక్టర్ గారు ఏమి చేస్తున్నారు?వదిలేద్దాం. మేధావులు పదవులలో తక్కువ, పెదవి మీద ఎక్కువ పని చేయగలరేమో! సుప్రీం కోర్టు వారిని ఎందుకు విమర్శించటం?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “పాలసీ విషయాలలో తల దూర్చవద్దు-సుప్రీం కోర్టుకు ప్రధాని సందేశం!

  1. I heard a news in Bangalore some time back, that is, farmers have thrown away tomatoes (their crop) on the roads as they did not enough price for them but they have not donated / distributed them to any poor people.

    Similarly, last year vegetable vendors expected a lot of demand for Ash gourd during Dasara festival time and when the supply was too much for the demand, vendors could not sell all of them and there were lot of ash gourds around Bangalore the vendors just left them instead of distributing them to the needy.

    What could be the reason? 🙂 , Of course, I know about the some sale offers on expiry nearing food items 🙂

    ~sUryuDu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: