ఈ గంగకెంత దిగులు…


గంగా నదికీ,భారతీయ సంస్కృతికీ గల సంబంధం అందరికీ తెలిసిందే.గంగ నీరు అందరి ఇళ్లల్లో ఉంటుంది.స్వయంగా ఈ నది తనను తాను పవిత్రం చేసుకుంటూ ఉంటుంది అనే పౌరాణిక గాథలో నిజమున్నదంటూ శాస్త్రఙ్ఞులు కూడా చెబుతూ వచ్చారు.’ఆరోగ్యంగా ఉన్న ఒక నదిలో ఆక్సిజన్ బేక్టీరియాను హరించుకుటూ ముందుకు సాగుతుంది ‘ అనేది శాస్త్రీయ సిధ్ధాంతం. ఆరోగ్యంగా ఉన్న నది అంటే నిరంతరం ఉరకలు వేస్తూ ప్రవహించే నది అని మనం అనుకోవచ్చు.ఆ కథ కంచికెళ్లింది…

~~~***~~~

ఆధునిక ఆర్థిక ప్రగతి కోసం చేపట్టే కొన్ని ప్రక్రియలు పట్టణాల కోసం నీటి సప్లై వరకు పరిమితం అయిపోయి పట్టణాల డ్రెయినేజ్ వలన మరింత నీరు కలుషితమయ్యి ఉండవలసిన చోట నీరు ఎండి పోవటం కనిపిస్తోంది. మన దేశం లోని అతి పెద్ద హైడ్రి ఎలెక్ట్రిక్ డాం -తెహరి. ఇది సహజంగా ఏర్పడే నీటి స్ప్రింగులను మాయం చేసింది.పిపోలా లాంటి పల్లెటూర్లు గంగ సాగే దారిన ఎన్నో.ఇవన్నీ ఎడారులుగా మారిపోవటం ఒక ఎత్తు అయితే రాబోయే అల్ నినో ప్రభవంతో, టిబెట్ లో చైనా చేయబోవు వ్యవహారంతో మొత్తానికి గంగలోకి నీరు ఇక పైన ప్రవహించబోదని అర్థమవుతోంది.చేతులారా కొంత, ఆలోచన లేక కొంత మనం చేసుకున్న పని ఇది.పల్లెల నుంచి విద్యుత్తు, నీరు మొత్తం ఢిల్లీకి పంపి అక్కడ భూమిని నిర్వీర్యం చేసాం. ఆ ప్రాంతం ప్రజలు ఢిల్లీకి వలస వెళితే అదో కొత్త సమస్య. కొన్ని సంవత్సరాల క్రితం కొఇనా నది మీద డాం కట్టకూడదని, దాని దారి మళ్లించటం వలన పర్యావరణ బాధలు ఎక్కువవుతాయని చెప్పినా మన వాళ్లు వినలేదు. లాతూర్ లో వచ్చిన భూకంపం దీని ప్రభావమేనని తేల్చటం కూడా అయింది…

ప్రణాలికలలో దూరదృష్టి,ఇతర ప్రణాలికల సమన్వయం లేని చోట జరిగే అనర్థాలు ఇవే.దూరదృష్టి గురించి ఏమి మాట్లాడతాం? దురదలు, దురదృష్టి తప్ప ఈ దేశంలో మిగిలింది ఏమీ లేదు.ప్రకృతి తో ఆడుకుంటూ పెద్ద పట్టణాల వైపు నదీ జలాలను మళ్ళించటంలో గల ఇబ్బందులను సాంకేతికంగానూ పెద్దగా ఆలోచించలేదు,ఆర్థికపరంగానూ సమన్వయపరచలేదు.తెహరి లాంటి పనులు చేసేసి అణు విద్యుత్తు కోసం అమెరికాతో ఒప్పందం చేసి ఏమిటి ఉపయోగం?

తెహరి డాం నుంచి, అలాగే యమున నుంచి ఢిల్లీ వాసులకు ప్రతి రోజు, ప్రతి మనిషికి 66 గాలన్ల మంచి నీటి సరఫరా అవుతుంది.ఇందులో సగం నీరు లీకులున్న పైపులలోంచి వేస్టుగా కాలవలలోకి వెళ్లిపోతోందని అంచనా!1995 నుంచి ఈ నగరంలో 60% జనాభా పెరిగారు.ఇప్పటికీ అండర్ గ్రవుండ్ డ్రెయినేజ్ పూర్తిగా తయారు కాలేదు…

ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ భూగర్భ జలాలను వాడే దేశం మనది.వేల అడుగులు తవ్వుకుని కాళ్లు జాపుకుని కూర్చుంటున్నాం.నదీ జలాలు పంచుకోవటం లో సరైన విధానం ఉండదు.చుట్టు ప్రక్క ఉన్న దేశాలతో ఆ విషయంలో పెద్ద చర్చలేమీ ఉండవు.

గంగ మీద ఉన్న నమ్మకం ఎలా ఉన్నా నదులు సరైన విధానాలు లేకుండా  తిరిగి జలాన్ని నింపుకుంటాయనే నమ్మకం అంత మంచిది కాదు.ప్రకృతిలోని సహజమైన విధానాన్ని అర్థం చేసుకోవాలంటే వ్యక్తి కూడా సహజమైన వడయి ఉండాలి…సాంకేతిక పరిఙ్ఞానమంతా ప్రకృతి మనకు సహజమైన చింతన చేత ప్రసాదించిందని మరచిపోకూడదు.

జిస్ దేశ్ మే గంగా బహతీ హై…బహతీ థీ అని చెప్పాల్సి రావచ్చేమో!ప్రపంచ దేశాలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి ఇప్పుడు భారత దేశంలో అణు విద్యుత్తు కూడా ఉంది కానీ మంచి నీళ్లు లేవని వెనక్కి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.

ప్రళయం ప్రకృతి కాదు,మనమే సృష్టిస్తున్నాము!కనుల ముందునిలచి ఉన్న ప్రాణశక్తిని ఇదిగో ఇక్కడ కాదు, ఇక్కడ పెరగమని శాసిస్తున్నాము!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: