కశ్మీర్ మనది కాదా?


కశ్మీర్ ను తలచుకుంటేనే చాలా మందికి చిరాకు పుట్టటం ప్రారంభమయింది. గత ఇరవై ఏండ్లుగా జరుగుతున్న యుధ్ధానికి అంతూ పంతూ కనిపించటం లేదు. ఎందరు జవాన్లు, అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారో అని తలచుకుంటే బాధ పడటం తప్ప మరొకటి చేయలేని స్థితి. ప్రస్తుతం ఈ సమస్యను విశ్లేషించటం కోసం ఈ టపా పెట్టటం లేదు. ఈ వీడియోలో ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది అర్థం అవుతోంది. భారత దేసం మాప్ లో కశ్మీర్ ను వీరు చూపించటం కూడా మానేసి చాలా కాలం అయింది…గమనించండి. ఇతరత్ర వీడియోలలో కూడా ఇదే పధ్ధతి. చూస్తూ చూస్తుండగా మన దేశం లోని అంతర్భాగమైనది ఒక అంతర్జాతీయ వివాదాస్పదమైన ప్రాంతం గా ప్రపంచం గుర్తించటం పాకిస్తాన్ విజయం కాకపోతే ఎవరి విజయం?

ఆలోచించాల్సిన అవసరం ఉన్నది…
~~~***~~~

గిల్గిట్  బాల్టిసాన్ ప్రాంతంలో 11000 సైన్యాన్ని మొహరించినట్లు న్యూ యార్క్ టైంస్ లో వచ్చిన వార్తలను ఖండిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను ఒక్క సారి చూద్దాం.పి.ఓ.కేను పి.ఓ.కే గా వీరు వర్ణించటం లేదు.దీనిని ఉత్తర పాకిస్తాన్ అంటున్నారు.మన దేశం లోని జమ్ము కశ్మీర్ ను  ఇండియా కంట్రోల్డ్ కశ్మీర్ గా విదేశీ వ్యవహారాల జియాన్ యు పేర్కొనటం గమనార్హం.చైనా పాకిస్తాన్ కు,భారత్ కు మిత్ర దేశమని, సంప్రదింపుల ద్వారా కశ్మీర్ సమస్యకు సమాధానం వెతకాలని గురువారం రోజున ఈమె సందేశం ఇచ్చారు.ఈవిడ మాటలలో అసలు భరత్ కు ఏ ప్రాంతాన్ని మిగిల్చినట్లో!

ఇదిలా ఉంచండి.కశ్మీర్ లో ట్రూప్స్ ను మాన్ చేస్తున్నందుకు ఒక భారతీయ ఆర్మీ జనరల్ కు చైనా విసా ఇవ్వలేదన్న సంగతి అందరికీ తెలిసిందే! శాంఘాయిలో భారతీయ పర్యాటక ఎక్షిబిషన్ లోంచి భారత దేశపు మాప్ లను తీసేసారు చైనీయులు.ఆ మాప్ లలో అరుణాచల్ ప్రదేశ్  మన దేశంలో ఉన్నట్లు చూపించాముట!

ఏమిటి ఈ జులుం?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “కశ్మీర్ మనది కాదా?

 1. చాల మంచి అంశాన్ని లేవనెత్తినందులకు ధన్యవాదములు
  ఈ దేశం లో పుట్టిన ప్రతి వ్యక్తీ ఆలోచించాల్సిన విషయమది
  చేవలేని ప్రభుత్వాన్ని ఎంచుకున్న ప్రజలు సిగ్గుతో తలదించు కుంటున్న సందర్బం ఇది
  దేశమంటే కేవలం మనషులు మాత్రమే కాదు మట్టి కూడా అని తెలుసుకోవాలి
  వందే భారత మాతరం
  మీ లాంటి జాతీయ భావాలు కల్గిన వారి అభిప్రాయాలను తెల్సుకున్నందుకు చాలా సంతోషం ఒక్క సారి మా వెబ్ – సైటు ను చూడగలరని నమ్రతా పూర్వ నా మనవి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: