సెప్టెంబర్ 2010 రాశిఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

మేష రాశి: మంచి లాభదాయకమైన మాసం.నూతన పరిచయాల వలన కొన్ని సొకర్యాలు ఏర్పడగలవు.ఒక దూరప్రయాణం ఉండగలదు.చమత్కారం గా మాట్లాడి అందరినీ ఆకర్షిస్తారు. ఇంటి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు.ధార్మిక పరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.నీరు వలన కలిగే జబ్బుల విషయంలో జాగ్రత్త వహించాలి.

వృషభ రాశి: పదోన్నతి ఉండగలదు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉండగలవు.స్థిరాస్తి కలసిరాగలదు.బంధువులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన మాసం. మాసం పూర్వార్థంలో పిల్లలు మంచి వార్తలు వినిపించగలరు.మీరు సాధించారని అనుకున్న విషయాలను తొందర పడి అందరికీ చెప్పకూడని మాసం.

మిథున రాశి: కుటుంబ, ఆరోగ్య సౌఖ్యం బాగుంటుంది.పెట్టుబడులకు మంచి మాసం.సోదరీ మణుల నుంచి వార్తలు వింటారు.నేర పరిశోధనలో ఉన్నవారికి కొత్త అంశాలు బయట పడగలవు.వ్యాపారులకు మొదటి రెండు వారాలు బాగుండగలవు.కళాకారులకు అవకాశాలు బాగుండగలవు. మాటలో చాంచల్యం తగ్గించుకోగలిగితే మంచి లాభం పొందగలరు.

కర్కాటక రాశి: మీలోని ప్రతిభను ఒక ఉద్యమంలా ప్రదర్శిస్తారు.ఆరోగ్యం మెరుగవగలదు.చిన్న వారితో కొన్ని రహస్యాలను పంచుకుంటారు.ఆదాయం బాగుంటుంది.నిరుద్యోగులకు ప్రభుత్వం వైపు నుంచి పిలుపు రాగలదు.చిత్రకారులకు సదవకాశాలుండగలవు.మిత్రులతో కొన్ని అభిప్రాయభేదాలుండగలవు.వాద్వివాదాలు ఈ మాసం మంచిది కాదు.నూతన వస్తువు కొనే ముందు ఆలోచన చేయగలరు.

సింహ రాశి: కళ్లు, కాళ్ల  విషయంలో జాగ్రత్తలు వహించాలి.స్త్రీలు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.బదిలీలు ఉండగలవు.సమయానికి డబ్బు అందగలదు.విదేశీ వ్యవహారాలున్నవారికి మంచి మాసం.రోగనిర్ధారణలో ఆలస్యం వలన కొన్ని సమస్యలు రాగలవు.జీవిత భాగస్వామి మానసిక పరిస్థితి పై శ్రధ్ధ చూపటం అవసరం. వ్యాపారస్తులకు మంచి మాసం.జీవిత భీమా రంగం లోని వారు లాభించగలరు.శివాలయ సందర్శనం  మంచిది.

కన్య రాశి: అదుపు లేని ఆలోచనల వలన కొంత చికాకు ఉండగలదు. మాసం మధ్యలో ప్రయాణం ఉండగలదు.కొన్ని నిర్ణయాలను కాలానికి వదిలేయటం మంచిది.అనుకోని సంఘటనలకు సిధ్ధంగా ఉండండి.పాత మిత్రులు కలుస్తారు.మీ ప్రతిభ వెలుగులోకి రాగలదు.మీ సత్ప్రవర్తన మిమ్మల్ని కాపాడుతుంది.వ్యాపారంలో భాగస్వాముల అలోచనలు భిన్నంగా ఉండగలవు.చిన్న పిల్లలతో కాలం గడుపుతారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

తుల రాశి: భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోగలవు.ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి.డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి.రాజకీయం లో ఉన్న వారు మనసులోని మాట చెప్పవలసిన అవసరం ఉన్నది.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.ప్రేమికులు కొంత ఉత్సాహం పొందగలిగే మాసం. దూరాన ఉన్న వారు ఇంటికి తిరిగి రాగలరు.

వృశ్చిక రాశి: మిత్రుల సహాయంతో ఒక కార్యాన్ని నెరవేరుస్తారు.పరిశ్రమలలో ఉన్న వారికి కొన్ని మంచి వార్తలుండగలవు.వృత్తులలో రాణించగలరు.ఖర్చులు ఎక్కువగా ఉండగలవు.ఆర్థిక లావాదేవీలకు మరొక మాసం ఆగటం మంచిది.చిన్న వ్యాపారస్తులు లాభించగలరు.విద్యార్థులు కృషి పెంచాలి.దృష్టి దోషం వలన కొంత సమస్య ఉండగలదు.సింహ వాహిని అయిన దుర్గ పటం ముందు ధ్యానం చేయగలరు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

ధను రాశి: కార్యాలయంలో అన్నీ మార్పులతో సతమతమవగలరు.వైద్య రంగం వారికి, పరిశోధనా రంగం వారికి మంచి మాసం. వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి వార్తలుండగలవు.మీ ఇంటిలోని ఒక సభ్యునికి మంచి పేరు వచ్చే సూచన ఉన్నది.పెద్దల సలహాలను గౌరవిస్తారు. ఒక సమూహానికి నాయకత్వం వహిస్తారు.ఒక ప్రణాలికను ఏర్పాటు చేసి అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారు.హనుమాన్ చాలీసా చదవగలరు.

మకర రాశి: ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.మాట మార్చే వారి వలన ఇబ్బందులు ఎదురవ్వగలవు.వాహనానికి మరమ్మత్తు అవసరం కాగలదు.మానసిక పరమైన అంశాల మీద అధ్యయనానికి సమయం వెచ్చిస్తారు.క్షేత్ర దర్శనం చేస్తారు. ఆడపడుచులకు కొన్ని హామీలు ఇస్తారు.ఆటలలో కొంత అసౌకర్యం ఉన్నా ఆటగాళ్లు రాణిస్తారు.మీడియా వర్గం వారి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన మాసం. శ్రీసూక్తం చదవండి.

కుంభ రాశి: బాధ్యతల నడుమన అంతర్మథనానికి గురి అవుతున్నట్లు తెలుస్తున్నది. చేయగలిగినంతే కానీ ఏ విషయంలోనూ సంతృప్తి  కలుగని కాలం ఇది. మానసిక సంతోషం  అన్ని విషయాలకూ మూలమని తెలుసుకుంటారు.మంచి రోజులు ముందున్నాయి.కొందరికి విదేశీ యానం ఉండగలదు.మందులు,నూనెల వ్యాపారస్తులకు మంచి మాసం.స్త్రీలకు పరస్పరం  వైరం ఏర్పడగలదు. ధ్యాన మార్గం అవలంబించండి.

మీన రాశి: విలాసానికి బాగానే ఖర్చు చేస్తారు.కొత్త మనుషులతో పని చేయాల్సి రావచ్చు.ఇంటిలో కొంత మరమ్మత్తు చేస్తారు. భాగస్వాములు కాగితాల మీద సంతకాలు చేసే ముందు జాగ్రత్త వహించాలి.కాంట్రాక్టర్లకు మంచి మాసం.సంతానం లేని వారికి మంచి వార్తలుండగలవు.ఉద్యోగం మారుదామనుకునే వారు మాసం చివర ప్రయత్నించటం మంచిది.ట్రావెల్ ఏజెంట్లకు, మార్కెటింగ్ రంగం వారికి మంచి అవకాశాలు ఉండగలవు.

శ్లో: వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం,దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “సెప్టెంబర్ 2010 రాశిఫలాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: