సినీ రంగం,సాంఘిక నేరాలు…


చాలా కాలం క్రితం నైనీ తాల్ లో నైనా కొలను ముందున్న మాల్ దగ్గర నేనూ, నా మిత్రుడు కూర్చుని ఉన్నాం.ఒక హిందీ చిత్రం షూటింగ్ జరుగుతోంది.ఒక రెటైర్డ్ కర్నల్ కుమార్తె అందులో హీరోయిన్.ఆయన మా ప్రక్కనే కూర్చుని చూస్తున్నాడు.అమ్మాయి స్విమింగ్ పూల్ లోంచి లేచి రావటం,హీరో గట్టిగా కౌగిలించుకుని నిలబడటం-ఇది దృశ్యం.ఈ సీను దాదాపు రోజంతా టేక్ అవుతోంది.అక్కడ జనం చుట్టూతా,చెట్ల మీదా సద్దుకుని చూస్తున్నారు. ఆమె పైకి రాగానే ఈలలు,కౌగిలించుకోగానే ఆకాశం దద్దరిల్లేలా గోల…మా ప్రక్కనున్నాయన అటూ ఇటూ చూడటం…నేను ఏమీ మాట్లాడకపోయినా ఎందుకో నా వైపు తిరిగి ‘ఇట్ ఈస్ ఎ గుడ్ మువీ…’,అన్నాడు!

రాత్రి అక్కడ ఆర్మీ వారు ఏర్పరచిన ఒక విందులో పాల్గొన్నాను. ఆ చిత్ర నిర్మాత కూడా వచ్చాడు.ఆ చిత్రం యూనిట్ అంతా ఉంది.సిగరెట్ పట్టుకుని ఒక ప్రక్కగా వచ్చి పలుకరించాడు.’మా చిత్రం  రివ్యూ వ్రాయాలి…’అన్నాడు.
‘అలాగే వ్రాస్తాను.ఎన్ని భాషలలో వ్రాయాలి?’
‘ఎన్ని భాషలలో వ్రాయగలరు?’
‘ఈ రోజు ఆ దిక్కుమాలిన సీను ఎన్ని గంటలు తీసారో అన్ని భాషలలో వ్రాయగలను!’
అటూ ఇటూ చూసాడు.
‘మరోలా అనుకోకండి.అలా చేయకపోతే మాకు స్పాట్ ఇవ్వరు ఈ ప్రాంతం వారు. మీకు మరో సంగతి చెబుతాను. అలా చెట్ల మీద, పుట్టల మీద ఉన్న వారంతా ఈ దళారీలకు డబ్బులిచ్చి ఉన్న వారు.మేము పాక్ అప్ అంటే మమ్మల్ని పాక్ చేసి పంపేస్తారు…’
ఎందుకో హీరోయిన్ తండ్రి మాకు దగ్గరగా వచ్చాడు.గ్లాస్ పైకి ఎత్తాడు.’ఇట్ ఈస్ ఎ గుడ్ మువీ…’అని గ్లాసు ఖాళీ చేసాడు!

~~~***~~~
మంచి బొమ్మే! ఒక మంచి బొమ్మ తీసి చూపించాలన్నా అతి నీచమైన ప్రక్రియలలోంచి తీసుకుని వెళ్లే వ్యవస్థ నేరాలకు పెద్దగా దూరంగా ఉండలేదని అందరికీ తెలిసిందే.నల్ల డబ్బు రొటేషన్,అనుదినం అడగకుండానే సరిక్రొత్త స్త్రీ సౌఖ్యం,అశ్లీలతను చిత్రీకరించి ఎడిటింగ్ పేరుతో కత్తిరించి ఆ ముక్కలను మరో చోటుకు వ్యాపారానికి పంపించటం…ఇవన్నీ ఇక్కడ  మామూలే. చిన్న కళాకారులు,అమ్మాయిలు,నాట్యాలలో పాల్గొనే వారు పడే అవస్థలతో నిండా నరకంలా కనిపించే వ్యవస్థ ఇది.డ్రగ్స్ గురించి వచ్చినది బాలీవుడ్ నుండి ప్రయాణిస్తున్న ఒక అలవాటు.ఇక్కడ కొత్తగా ఉంది.

2000 మందిలో ముప్పయి శాతం డ్రగ్స్ వ్యాపారంలో ఉండవచ్చని అంచనా.రోడ్ నంబర్ 3 బంజారా హిల్స్ లోంచి బయట పడ్డ వ్యవహారంలో నైజీరియా, ఉగాండా వారి లింకులు బయట పడ్డాయి.ఆయుధాల స్మగ్లింగ్,ఇతర నేరాలు డ్రగ్స్ ద్వారా తేలికగా సాగుతాయన్నది పోలీసు వర్గాల కథనం. ఇందులో నిజం  లేకపోలేదు.డ్రగ్స్ ద్వారా ఏడిక్ట్ అయిన వారు ఏ పనికైనా ఎందుకు చేస్తున్నారో ఆలోచించకు ండా సిధ్ధమవుతారు. అదో సులభమైన మార్గం.కొన్ని చోట్ల నార్కోటిక్ డ్రగ్స్ కు ‘హరహర మహాదేవ ‘ అనే పేరుంది.ఎక్స్టెసీ అనే డ్రగ్ అనౌష్క అనే పేరుతో,ఓపియం త్రిష పేరుతో,కొన్ని చీప్ గా వచ్చేవి ముమయిత్ పేరుతో చెలామణి అయిపోతున్నాయి.

ఇటీవల పబ్ కల్చర్ ఒక మ్హమ్మారిలా పాకింది.ఈ పబ్స్ ఎక్కువగా సినీ రంగం,రాజకీయరంగం వారు నడపటం ఒక విశేషం. పబ్స్ నుండి డ్రగ్స్ వైపుకు చాలా సింపుల్ గా హైదరాబాదు అభివృధ్ధి చెందింది.డప్యుటీ కమిషనర్ జె. సత్యనారయణ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. రియల్ ఎస్టేట్ నుండి సినీ రంగం లోకి వచ్చి డబ్బులు పెట్టి నష్ట పోయిన వారు ఈ వ్యాపారంలో ముందున్నారు.ముంబయి ఢిల్లీ నుంచి జయింట్ ఆపరేషన్స్ జరుపుతున్న వారి మీద విచారణ చేపడుతున్నారని ఎ.కె. ఖాన్ తెలుపుతున్నారు. ప్రముఖుల పిల్లలు, పేరు గల హీరోలు తప్పించుకోలేని విధంగా ఆధారాలను తెచ్చి లోపలికి తోస్తామని చెప్పటం కూడా విన్నాం.ఖాన్ గారి మాటను ప్రస్తుతానికి గౌరవించినా పాయింట్ బ్లాంక్ లో బులెట్లు పేల్చిన హీరోను ఏమీ చేయలేని పోలీసు వ్యవస్థ ఇంత చుట్టు తిరుగుడుగా సాగే నల్ల వ్యాపారాన్ని అరికట్టగలదనే నమ్మకం మటుకు కలగటం లేదు.

~~~***~~~

వ్యాపారం,సినీ పరిశ్రమ,రాజకీయాలు పెనవేసుకుని సాగే దేశం ఇది.ఫోర్త్ ఎస్టేట్ -మీడియా సామాన్యమైన పాత్రలో లేదు. సామాన్యులను మెంటల్ వారిలా తయారు చేసి తిరిగి ఈ మూడిటి ముందరా పీక్కు తినమని పడేస్తోంది మన మీడియా.ఈ నాలుగు దయ్యాలనూ నియంత్రించేందుకు సామాన్యులే పూనుకోవాల్సిన అవసరం ఉంది.

~~~***~~~

మాకూ సమాజం పట్ల బాధ్యత ఉంది,మేమూ సంఘజీవులం అంటూ సందేశాలిచ్చే వారు పైన ఉదహరించిన సినీ పోస్టర్ ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి.ఈ వ్యవస్థలో ఉన్నవారి కుళ్లు ఆలోచనలలో ఏముందో ఇక్కడే కనిపిస్తుంది. యువత తోనే కదా ఈ వ్యాపారం ముడి బడి ఉన్నది? యువతే కదా మన భవిష్యత్తు?ఏది మన మార్గం?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “సినీ రంగం,సాంఘిక నేరాలు…

  1. మరేఁ!!! బాల్యవివాహాలను నిషేధించారు గానీ, బాల్యప్రేమ(???)లను నిషేధించలేదుగా… నిన్ననింకో పోస్టర్ చూశా, విజయవాడవెళ్ళినప్పుడు – బద్మాష్ అంట, పసిపిల్లలను కూడా వదలట్లేదు. పైగా కాప్షనొకటి: “వీడు చిన్నప్పట్నించి ఇంతే” అని. కడుపులో దేవినట్లయింది. అసలది క్రిమినల్ కేసవదా? లేక వ్యవస్థ పెద్దమనసు చేసుకుందా.

    ఏది ఎలా నాశనమైపోవాలో అది అలాగే జరగటమంటే ఇదేనేమో.

    అన్నట్లు ఆ పోస్టర్ విజయవాడ, గాంథీనగర్ శాంతిప్రశాంతి పైన అలంకరించబడింది(???).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: