రాజ్యసభలోకి కొత్తగా వచ్చిన 55 మంది చరిత్రలు చూద్దాం…


పదమూడు రాష్ట్రాల నుంచి 55 మంది మహానుభావులు వెళ్లారు.పదిహేను మంది వారి అఫిడవిట్లలో వారి మీద నేరారోపణలు, విచారణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇటువంటి వారిలో ఎనిమిది మంది మీద గట్టి విచారణలు ఉన్నాయి.(హత్యలు,మానభంగాలు,ఫోర్జరీలు…)

అన్ని పార్టీలు సమానంగా ఈ తరహా అభ్యర్థులను ముందుకు పంపారు.వీరిలో కొందరు ప్రబుధ్ధుల పేర్లు చూద్దాం.ప్రొఫ్ .బఘేల్ సింగ్ (బి.ఎస్.పి)ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో,డా.విజయ్ మాల్య కు రెండు ఫెరా కేసులు,రెండు చీటింగ్ కేసులు,గుండు సుధారాణి (టి.డి.పి)మీద మతం పేరిట గొడవ సృష్టించినందుకు రెండు కేసులు,రషీద్ (ఎస్.పి),డి.ఎం.కె నుంచి టి.ఎం. సెల్వగణపతి గారు మూడు కరప్షన్ కేసులలో ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్ మాల్య గారు 615 కోట్లు మాత్రమే ఆస్తుల క్రింద చూపించారు.తరువాత టి.డి.పి నుంచి యలమంచిలి సత్యనారాయణ చొదరీ గారు 189.7 కోట్లు చూపించారు.కన్వర్ దీప్ సింగ్ (జె.ఎం.ఎం) 82.6 కోట్లు చూపించారు.

కొత్తగా వచ్చిన రజ్యసభ సభ్యులలో 72% కోటీశ్వరులు.ఏవరేజ్ ఆస్తులు 23 కోట్లు తేలింది.అయిదుగురు అఫిడవిట్లలో పాన్ కార్డు నంబర్లు ఇవ్వలేదు. మరి ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుందో! ఒప్పుకోవచ్చని నియమం ఉందేమో చర్చించాలి.సామాన్యుడిని పాన్ నంబర్ లేకపోతే ఏ అప్లికేషనూ ఇవ్వనీయరు…

స్త్రీలకు పెద్దగా ప్రాతినిధ్యం లేదు.నలుగురు వచ్చారు. అంతే!

కానీయండి, సభలు మీవి,రాజ్యం మీది,కానీయండి!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “రాజ్యసభలోకి కొత్తగా వచ్చిన 55 మంది చరిత్రలు చూద్దాం…

  1. చక్కటి విశ్లేషణ! చాలా బాగుంది.

    “రాజ్యం మీది, సభలు మీవి…..కానివ్వండి!” బాగుంది.

    మరి మన యువత 2014 లోనో, అంతకు ముందుగానేనో, వీళ్లనే ‘యెక్కుకొంటుందో’, మరెవరినైనా ‘యెన్నుకొంటుందో’ చూద్దాం!

    (ఇంతకు ముందు నా టపా మీద వ్యాఖ్యానిస్తూ, ‘2009 లో వాళ్లనే యెక్కుకుంటాం’ అని వ్యాఖ్యానించాడో యువకుడు. జరిగిందదే కదా?)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: