మన దేశంలో సివిల్ ఇంజినియర్లు లేరు!


విశ్వేశ్వరయ్యను కన్న దేశంలో సివిల్ ఇంజినియర్లు కరువయ్యారు. సాంకేతికపరంగా ఎంతో పేరు సంపాదించాం కానీ దేశనిర్మాణం విషయంలో యువతకు పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. ఆఫీసుకు పరుగులెత్తి అక్కడ ఎవరో విదేశీయుడికి ఒక ప్రొగ్రాం వ్రాసి సంపాదించాలనే కానీ అదే ఆఫీసుకు వెళ్లేందుకు ఇంత సమయం నాకెందుకు? రోడ్డు పరిస్థితి ఏమిటి అనే ఆలోచన లేదని అంకెల ఆగడాలు చెబుతున్నాయి.

500 మిలియన్ డాలర్లు ప్రభుత్వం 2012 నాటికి ఇంఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలని యోచించి ఉపయోగం? ప్రపంచ బాంకు వారు 2008 లో భారత దేశం ఇంఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో ఎందుకు విఫలమవుతోందో చెబుతూ ఎప్పుడూ ఉండే చెత్త ప్లానింగు, అవినీతి,రాజకీయాలను పేర్కొంటూ సివిల్ ఇంజినియరింగు రంగంలో మూడింతలుగా మానవ వనరులను పెంచుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

సాఫ్ట్వేర్ రంగంలోకి 193500 భర్తీలు 2007 నాటికి కాగా సివిల్ ఇంజినియరింగులో 1990 లో ఉన్న 13500 నుంచి 22700 కి మాత్రమే పెరిగింది. సాఫ్ట్వేర్ అభివృధ్ధి దీనికి ప్రధానమైన కారణం అయినప్పటికీ ప్రభుత్వం  ఇతర రంగాల మీద సరైన దృష్టి సారించకపోవటం ఒక అంశం.ఈ మధ్యనే నిద్ర లేచి 30 విశ్వవిద్యాలయాలను ఏర్పరచే మాట చెప్పింది.

సివిల్ ఇంజినియరింగు వారికి ఎంట్రీ లెవెల్లో సరైన జీతాలు ఇవ్వకపోవటం చాలా తప్పు. సివిల్ నుంచి సాఫ్ట్వేర్ కు వెళ్లే వారికి అక్కడ సంపాదన ఎక్కువ ఉండటం వలన న్యాయంగా వాళ్లు అటే వెళతారు.ఈ విషయంలో సమగ్రంగా ఆలోచించి విధానాలను మార్చవలసిన అవసరం ఉన్నది. మంచి మేధస్సు ఉన్న వారిని ఇటు సమంగా ఆకర్షించే ప్రయత్నం కూడా చేయాలి.

చివరగా అబ్దుల్ కలాం గారు అన్న మాట గుర్తుకు వస్తుంది.విదేశీయులకు చీప్ గా పని చేసి పెట్టటం కంటే మన సాఫ్ట్ వేర్ రంగం వారు భారతీయ పేటెంట్ ఉన్న ఒక్క సాఫ్ట్ వేర్ చూపించగలరా అని అడిగారు.

ఎంత నేర్చినా మంద ముందుండే మందగొడి దేశమా ఇది?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

11 thoughts on “మన దేశంలో సివిల్ ఇంజినియర్లు లేరు!

  1. స్వాతంత్ర్యంరాకముందు బ్రిటిష్ వారు వారికి కావలసిన గుమస్తాగిరీ చదువులు చదివించారు. ఇప్పుడు MNC కంపెనీలు వారికి కావలసిన software చదువులు నేర్చుకునేలా తయారుచేస్తున్నారు. మనకు కావలసిందేమిటి అని ఆలోచించాలంటే, అసలు ’మనం’ అనేది ఎవరు అని నాకొక పెద్ద, అతి పెద్ద ప్రశ్న.

  2. Unfortunately it is the fact. We don’t have civil engineers but many criminal contractors. There is no encouragement for other basic engineering, sciences and economics. We have very few reputed institutes for medical all over the country. The growth can not be sustained in near future and going to collapse soon. Good post.

  3. your article is quite meaning less & ridiculous. Decisions regarding development of infrastructure projects are purely political. why our infrastructure projects are delayed because of litigation in land acquisition,corruption, & lack of vision in our leaders & apathy of the beurocrats. i condemn the comment of sri PVN Rao.he is so ignorant to say that there are only criminal contractors & no civil engineers. with out a civil engineer no development is possible& hence no civilization. some telugu films & some media reports have made contractor such a bad word. do not attribute system failures to a particular profession. i agree that basic salaries given to a civil engineer at the begining are quite low. but if one is dedicated & hard working salaries increases to considerable levels as compared to any IT professional.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: