ఎం.పీలకు జీతాలు చాలటం లేదుట!


ఎం.పీలకు జీతాలు మూడింతలు చేయటానికి ఒప్పుకున్నారు.వింతగా ఎన్నో ఇంతలు చేయాలని ఆదించారు కూడా.ఇక్కడ చెబుతున్న వాదన గొప్పగా ఉంది. ఎం.పీలు బ్రతికి బట్ట కట్టాలంటే జీతాలు పెంచాలన్నారు. ఇంకో మాట అన్నారు. మంచి జీతాలు ఇస్తే చలా మంది రాజకీయాలలోకి వచ్చి మన ప్రజాస్వామ్యానికే సరికొత్త ఊపిరి వస్తుంది అనేసారు!

ఎవరండీ కొత్త వారు వచ్చేది? ఎవరు రానిచ్చేది? ఇటీవల ఒక ఆంధ్ర ప్రబుధ్ధుడు సోనియా గారికి ఒక లేఖ వ్రాసారు. మీ కుటుంబానికి చేసే సేవకు కట్టుబడి ఉంటామన్నాడు ఈయన!కొత్త గాలులు కొత్త స్వాతంత్ర్యం…మన ప్రజాస్వామ్యానికి అంత ఆట లేదు.

విషయనికి వద్దాం.మన ఎం.పీలలో 315 కోటీశ్వరులున్నారు. ఒక్కొక్కరికీ ఏవరేజ్ తీస్తే 4.5 కోట్ల ఆస్తులున్నట్లు కాగితాల మీద ఉన్నది.ముందుకు వెళదాం.14 వ లోక్ సభలో 128 ఎం.పీలు క్రిమినల్స్. వీరిలో 58 మంది దారుణమైన నేరాలలో పట్టుబడినవారు-మానభంగం,హత్యలు…ఇలా చాలా!
15వ లోక్ సభలో సంఖ్య పెరిగింది.162 మంది క్రిమినల్స్ అయితే 76 మంది హంతకులు,ఇలాంటి వారు.మరి అభివృధ్ధి చెందింది కదా వ్య్వస్థ?అదీ సంగతి. జీతాలు పెంచకూడదని ఎవరు వాదిస్తున్నారు? అంకెలు కనిపించటం లేదా?

ద్ ట్రిబ్యూన్ లో ఒక వ్యాసం లో ఈ విషయం చెబుతూ విభా శర్మ అనే ఆవిడ అసలు పర్టీలను, ఎన్నికలను ఫండింగ్ చేసే ప్రక్రియపైన ఎవరు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు.

వీరి జీతాల గురించి చర్చించేటప్పుడు లోక్ సభలో ఎవరు అడగాలి ఈ ప్రశ్న?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “ఎం.పీలకు జీతాలు చాలటం లేదుట!

  1. మీ వివరణ చాలా బాగుంది.. కాని ఎందరు ఎన్ని రకలుగా చీత్కరిస్తున్నా దున్నపోతు మీద వాన కురిసినట్లు ప్రవర్తించేవారినే Indian Political Leaders (అందరు కాదు కాని.. చాల మంది) అంటారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: