‘స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రెయిన్ ‘-చిత్రం పై కబుర్లు


మెటనిం,ఇమేజ్,ట్రేజక్టరీలను చదవలాంటే ఈ చిత్రం లోకి వెళ్లాలి. ఇది 1951 లో నిర్మించిన చిత్రం.పేట్రిసియా రచించిన నవల ఇది.నవలను కొద్దిగా మార్చి తీసిన చిత్రం ఇది.
ఎంచుకున్న ఇతివృత్తం ఎలాంటిది అయినా ఒక సంఘటన తరువాత ఒకటి సాగిపోతూ ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పటం హిచ్ కాక్ గొప్పతనం.ఘటనలో ఇమేజ్ ను నింపటం తేలికైన పని కాదు. చాలా మంది ప్రయత్నించి ఏదో ఒక దానితో సంతృప్తి చెంది వదిలేయటం కూడా చూస్తాం…

కథలోకి వద్దాం.  హేన్స్ ఒక ట్రెయిన్ లో ప్రయాణిస్తుండగా బ్రునో అనే ఒక సైకో తో తారసపడతాడు.హేన్స్ ఒక టెన్నిస్ స్టార్ అవటం తో అతన్ని బ్రునో గుర్తు పట్టి హేన్స్ భార్యను తను చంపితే హేన్స్ అతని తండ్రిని చంపాలని మాట్లాడతాడు. హేన్స్ తన భార్యకు విడాకులు ఇవ్వటానికి వెళుతూ ఉంటాడు.హేన్స్ రైలు దిగిపోతాడు.బ్రునో అతను ఒప్పందం లోకి వచ్చాడనుకుంటాడు. హేన్స్ మరచిపోయిన సిగరెట్ లైటర్ తీసుకుని వెళ్లిపోతాడు. హేన్స్ ను తన భార్య డబల్ క్రాస్ చేయటం,బ్రునో ఆమెను అమ్యూస్ మెంట్ పార్క్ లో హత్య చేయటం అన్నీ జరిగిపోతాయి. నవలలో హేన్స్ బ్రునో తండ్రిని హత్య చేయటానికి ఒప్పుకుంటాడు. సినిమాలో అతని తండ్రికి బ్రునో ఒక సైకొ అని చెప్పటానికి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది…

హేన్స్ ఒక సెనెటర్ కుమార్తెను ప్రేమిస్తాడు. బ్రునో తండ్రిని హత్య చేసే సమస్యే లేదని బ్రునోకు వివరించిన తరువాత అసలు పేస్ అందుకుంటుంది.ఆ లైటర్ ను ఎమ్యూస్ మెంట్ పార్క్ లో వదిలి హేన్స్ పోలీసులకు చిక్కేలా చేస్తానని బ్రునో చెబుతాడు.

ఆ సాయంత్రం అక్కడికి వెళ్లేముందు ఒక టెన్నిస్ మాచ్, అక్కడికి చేరాక బ్రునో చేతిలోంచి లైటర్ ఒక గటర్ లోకి పడిపోవటం, తిరిగి దానిని పొందటం, చివరకు అక్కడ పిల్లలు ఆడుకునే రాట్నం  (కేరొసెల్లో ఇద్దరి కుమ్ములాట,బ్రునో చనిపోయే ముందు హేన్స్ అపరాధి అని చెప్పటం,చనిపోయాక చేతిలో లైటర్ కనిపించటం,పోలీసులు హేన్స్ ను వదిలేయటం…ఇవన్నీ హిచ్ కాక్ బ్రాండ్ లో గల విచిత్రాలు. ఆ ఎమ్యూస్ మెంట్ పార్క్ లోని ఒక ఉద్యోగి బ్రునోను గుర్తు పట్టి హంతకుడు ఇతనేనని చెబుతాడు.

చివరకు తన ప్రియురాలితో రైలెక్కినప్పుడు ఒక యాత్రికుడు నువ్వు హేన్స్ కదా అనగానే ఆమెతో మరో చోటుకు వెళ్లిపోతాడు!

ఇమేజరీ అడుగడుగునా సాగిన చిత్రం.క్లైమాక్స్ చాలా రసవత్తరంగా ఉంటుంది.ఒక్స్ అసికో వ్యవహారంలో తన అతితెలివి,మాట్లాడే తీరు,వ్యావహారికమైన స్పందన పాత్రలో ఇమిడిపోవటం చూస్తాం. పార్క్ లో ఒక చిన్న కుర్రాడు ఒక చిన్న గన్నును బ్రునో ముందు పెట్టి హడలు గొడతాడు. అతను వెళ్లిపోతున్నప్పుడు కుర్రాడి చేతిలో ఉన్న బెలూన్ ను తన సిగరెట్ తో ఠప్పు మనిపిస్తాడు బ్రునో. చివరి దృశ్యంలో హేన్స్ ప్రక్క నుంచి రెండు బూరలతో ఎవరో వెళ్లిపోతారు.

అలాగే ఈ చిత్రంలో ‘డబల్ ‘ ఎఫెక్ట్ గురించి పలు చోట్ల వ్యాఖ్యలు వచ్చాయి.రెండు జతల బూట్ల మీద ఫోకస్ తో చిత్రం ప్రారంభమవుతుంది (బ్రునో, హేన్స్).బ్రునో రెండు డ్రింకులు ఆర్డర్ చేస్తాడు. హిచ్ కాక్ ఈ చిత్రం లో రైల్లోకి ఒక డబల్ బాస్ తీసుకుని ఎక్కడం కనిపిస్తుంది…అంటే డబల్ క్రాసింగ్ కు ఒక ఇమేజరీ ఇది…టెన్నిస్ లో కూడా డబల్ పాయింట్,ఇలా చాలా కనిపిస్తాయి.

ఈ చిత్రంలో బ్రునో పాత్రలో నటించిన రాబర్ట్ వాకర్ జీవించేసాడు.ఆ పాత్ర మూలస్తంభంగా నిలబడి అన్నిటినీ తన చుట్టూ తిప్పేస్తుంది. ఒక పార్టీలో ఇద్దరు మహిళల దగ్గర కూర్చుని ఒక  మనిషిని ఎలా చంపాలి అని చేసే చర్చ,ఒక మహిళకు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నట్లు కనిపించి దాదాపు ఆమెను చంపినంత పని చేయటం (చిత్రం లో ఆమె చనిపోతుందనిపించినప్పుడు తీరా ఇతను క్రింద పడిపోయి ఉంటాడు!)…ఈ దృశ్యాలలో అతని నటన అద్భుతంగా ఉంటుంది.

హేన్స్ పాత్రలో ఫార్లే గ్రాంజర్ నటించాడు.

ఈ చిత్రం  అకాడమీ అవార్డులలో ఉత్తమ బ్లాక్ అండ్ వైట్ సినమాటోగ్రఫీకి,డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా వారి ఉత్తమ దర్శకుడికి,నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ వారి  ఉత్తమ చిత్రానికీ ఎంపికయింది.
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: