నేషనల్ కంపనీ లా ట్రిబ్యూనల్-దొరబాబులకు మరో రెఫ్యూజీ కాంప్!


క్రిందటి వారం సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మరో వాత పెట్టింది. నేషనల్ కంపనీ లా ట్రైబ్యూనల్ ఏర్పాటులో గల తప్పులను వెలికి తీసి ఇలా కాదు ఇలా అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

సభ్యుల నియామకం ఈ ఐ.ఎ.ఎస్ బాఉలతో చేస్తే వారికి సరైన అర్హత ఉండదని తేల్చింది. నిజమే!. నిరంతరం లావా దేవీలు, దేవులాటలో కాలం గడిపే వీళ్లు కంపెనీ కార్పొరేట్ విషయాలలో సరిగ్గా అలాగే ఆలోచిస్తారు.నిజానికి వీళ్లు ట్రైబ్యూనల్ కు వచ్చేదే ఓ మూడేళ్లు పబ్బం గడుపుకోవటానికి! వీళ్లకి లీన్ కూడా ఉంటుందట! ఇవన్నీ కుదరవని సుప్రీం కోర్టు చెప్పింది.

ట్రైబ్యూనల్ అంటే హై కోర్టు స్థాయి ఉంటుంది. ఇందులో ఇలా డెప్యుటేషన్, రిటరయిన తరువాత మరో అయిదేండ్లు కూడా ప్రభుత్వాన్ని పీడించేందుకు వీలుగా ఈ ట్రైబ్యూనల్ ను వాడుకుందామని వీళ్లు ట్రైబ్యూనల్ ను తయారు చేసారు తప్ప ఇక్కడ చిత్త శుధ్ధి ఏమీ లేదు! 2002 లో వచ్చిన ఇన్సాల్వెన్సీ వ్యవహారానికి ఒక మేండ్మెంట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచించకుండా ముందుకు వెళ్లిపోయింది. బాబుల పనితీరు అలా ఉంటుంది. వీళ్లు ట్రైబ్యూనల్ లో సభ్యులుగా చేరి కార్పొరేట్ వ్యవహారలలో న్యాయం చెబుతారుట!

ఈ దేశాన్ని నిలబేట్టి దోచుకున్న వాళ్లల్లో అగ్రగణ్యులు ఈ దొరబాబులు.  సివిల్ సర్వీసెస్ వారి మీద ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టు ఖర్చు ఆసియా ఖండం లోనే ఏ దేశం పెట్టదు.  వారి ఆదాయానికి ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే విధానాలను పరిగణనలోకి తీసుకుంటే లెక్కలు వేయటానికి ఒక జీవితకాలం పడుతుంది.  వీళ్ల బంగళాలు, కార్లు, వీరి వెంట తిరిగే మనుషులు, వెట్టి చాకిరీ…ఇవి చూస్తేనే ప్రజలకు అసహ్యం వేస్తుంది.

‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ‘ లో నెహ్రూ గారు ప్రియదర్శినికి వ్రాసిన ఒక లేఖ గుర్తుకొస్తుంది. ఆయన అప్పటి రాజా మహరాజాల గురించి ప్రస్తావిస్తారు. వీళ్లు ఏ కాలం లో ఉన్నారో వారికే తెలియదు…, మోయలేని దుస్తులు వేసుకుని పార్టీలలోకి దూరుతారు. అందరినీ వింతగా చూస్తారు. అందరూ వారిని వింతగా చూస్తారు. ఎందుకో నవ్వుతారు…వీళ్లని పట్టించుకోవద్దు. వీళ్లు మనకే కాదు, వాళ్లకి వాళ్లే పెద్ద న్యూసెన్స్!…అన్నారాయన!

ఆధునిక సమాచార యుగంలో ఈ ‘వారసత్వపు ‘ రాజులు-మన సివిల్ సర్వీసెస్ వారు నాకు ఇలానే కనపడతారు. ఆ బుధ్ధులు పోవు…కనీసం చుట్టు ప్రక్కల చూసైనా వాళ్లని వారు గమనించరు.

వీళ్లు ఈ రోజు చుట్టూ ఉన్న అన్ని రంగాలనూ ఎంక్రోచ్ చేసిన కాక్రోచెస్.  తేడా ఏమిటంటే ఒక చక్కని చోటుకు వచ్చి ఈ పురుగు అటూ ఇటూ తిరుగుతుంది. చూసే వారికి చిరాకుగా ఉందని అది అనుకోదు. దాని నైజం అది!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: