సోషల్ సెక్యూరిటీ…మనం ఎక్కడున్నాం?


రైల్లో డోర్ దగ్గర కుర్రాళ్లు నిలబడో లేదా ఒక్కో సారి కూర్చునో ప్రయాణం చేస్తూ ఉంటారు.అప్పుడప్పుడు వాళ్లనిఏదైనా  అడుగుతూ ఉంటాను.అలాగే ఒకబ్బాయిని అడిగాను,
‘ఏ ఊరు వెళ్లాలి బాబూ?’
‘ఏ ఊరు వెళ్లమంటారు?’
‘టికెట్ లేదా?’
అతను నవ్వాడు.’అందరూ ఇలాగే అడుగుతారు.టికెట్ ఉంది.ఒక ఊళ్లో దిగాలని లేదు.’
‘చదువుతున్నావా? ఉద్యోగమా…’
‘రెండూ లేవు.అన్నీ మాయం.’
కొద్దిగా బండీ తోపుకు అతని చేయి పట్టుకున్నాను.
‘భయపడకండి.నేను దూకేందుకు ఇక్కడ నిలబడలేదు.’
‘…’
‘అలా ఆ అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ చీకటిని ఆహ్వానిస్తాను.’
‘ఎందుకలా?’
‘మరో రోజు గడచిపోయింది…ఈ బండీ నా బ్రతుకు నుంచి నన్ను దూరంగా పరిగెట్టిస్తూ ఉంటుంది…’
నిజమే! సామాజిక భద్రత లేనప్పుడు ఎంత ప్రతిభ ఉండి ఏమి లాభం?

~~~***~~~

‘చైనా డెయిలీ ‘లో యు జియన్ రాంగ్ ఒక ఆలోచించవలసిన అంశాన్ని చూపించారు.ముప్పయి ఏండ్ల రిఫారంస్ తరువాత చైనాలోని యువత ఈ రోజు రెండుగా చీలి ఉన్నది.మొదటిది తండ్రి సంపాదన మీద ఆధారపడి ఉన్న వారు, రెండు పల్లెల నుండి వలస వచ్చి ఉద్యోగాలు లేకుండా ‘ఆంట్ ట్రైబ్స్ ‘ అనిపించుకునే వారు. వీరు ‘కోపోద్రిక్తులుగా ‘మారుతున్నారు.ఇది చైనాకు ఈ రోజు పెద్ద సమస్య.బాగా చదువుకోని యువత ఒక సమస్యగా  మారింది.చైనా గురించి చాలా గొప్పగా మనం వింటూ ఉంటాం.అక్కడ సమస్యలు లేవని కాదు.చైనాలో రాజకీయ, సార్వజనిక శక్తి చాలా కొద్ది మందిలో కేంద్రీకృతమయి ఉండటం వలన నివురు గప్పిన నిప్పులాగా చిచ్చు రగులుకుంటున్నది.ఈ వర్గం వారి జీవితాలను ఆ దేశంలోని ప్రశాసనం వారు గుర్తించి జాగ్రత్తగా పరిశీలించి ప్రణాలికలను తయారు చేయకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఉండగలవని ఈ వ్యాసం లో  పేర్కొనటం జరిగింది…

~~~***~~~

చైనా నుంచి మన దేశానికి వద్దాం.ఇక్కడ సమస్య ఇంకా గంభీరమైనది.వ్యవస్థీకృతమైన శ్రామికులు 7 % ఉండగా 93 % అస్తవ్యస్తంగా ఉన్నారు.భూమి లేని వ్యవసాయ కూలీలు 10 కోట్లు,ఇతర వ్యవసాయ కూలీలు 13 కోట్లు,వ్యవస్థీకృతం కాని సెక్టర్ లో కేవలం తిండి కోసం ఏదైనా పని చేసుకునే వారు 36 కోట్ల మంది ఉన్నారు.(ఇది  వరల్డ్ బాంకు వారి వివరం).
వీరిలో తక్కువ అక్షరస్యత,దారిద్ర్యం,పట్టణాలకు వలస వెళ్లు వారు,దేశం నలు మూలలా తిరుగు వారు ఎక్కువ.

సర్వీసెస్ సెక్టర్ లో ప్రయోగాలు చేయవలసియున్నదని దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రపంచ బ్యాంకు,ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పి యున్నారు.మైక్రో ఫైనాన్స్ వడ్డీ రేటు చివరకు 36% తేలిందని ఒక అంచనా!

బాగా యోచిస్తే బోధన-ట్రెయినింగు అనే ప్రక్రియలో గణనీయమైన మార్పులు రాకపోతే తీవ్రంగా నష్టపోగలం.డాక్టర్ రెడ్డీ ఫౌండేషన్ వారు ఈ దిశగా చాలా మంచి పనులు చేపట్టారు. ఇతర కార్పొరేట్ సంస్థల వారు ముందుకు రావలసి యున్నది.

కొన్ని భీమా ప్రణాలికలు చేపట్టినా ఈ దిశగా ప్రభుత్వం పెద్దగా యోచించకపోవటం విచారకరం.దేశం లో ఉన్న ఆర్థిక విధానాలలో ఈ అంశం సమాయుక్తం కాకపోవటం మరో సమస్య.మన దేశంలో ప్రస్తుతం పండే కూరగాయలు,పండ్లలో 40% వృధాగా పోతున్నాయని తెలుస్తోంది!దీనినే ఆర్థిక, సామాజిక ట్రాప్ అని చెప్పవచ్చు…

ఆహార వ్యుత్పత్తి విషయంలో తొలి సారి ఒక విప్లవాత్మకమైన వార్త విన్నాం.ముకేశ్ అంబానీ గారు ప్రభుత్వంతో చేతులు కలిపి పని మొదలు పెట్టనున్నారు.కార్పొరేట్ వారు వారు ప్రారంభించనున్న బృహత్ కార్యంలో ఈ అస్తవ్యస్తంగా తిరుగుతున్న యువతను ఒక పరిధిలోకి  తెచ్చి ఒక సక్రియమైన భాగస్వామ్యాన్ని ఇస్తారని ఆశించటమే కాదు, అలా చేయాలని ఒక సూచన కూడా చేయదలచాను.

పేదా గొప్పా తారతమ్యాలు తప్పవు.అవి సమాజంలో యువత అనే ప్లాట్ ఫారం మీద ఎదురు బదురు నిలబడి నువ్వా నేనా అనుకునే పరిస్థితి రాకూడదు.యువత దేశం  నిర్మాణం లో సమయాన్ని కలసి వెచ్చించగలిగే ఒక సందర్భాన్ని మనం సృష్టించాల్సి ఉన్నది.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “సోషల్ సెక్యూరిటీ…మనం ఎక్కడున్నాం?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: