వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఇస్లామిక్ సెంటర్ ఆలోచన సబబా?


గ్రౌండ్ జిరో దగ్గర ఒక ఇస్లామిక్ సెంటర్ (మసీదుతో సహా) కట్టాలని యోచించిన అబ్దుల్ రౌఫ్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి.

కోర్డోబా ఇనిషియేటివ్ వాడుతున్న పేరు ‘దావా ‘ కూడా వివాదానికి దూరంగా లేదు.ఇది సూటిగా జిహాద్ కు సంబంధించినదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇస్లాం గురించి వచ్చే తప్పు మాటలను ఈ ఇస్లామిక్ సెంటర్ ఖండిస్తూ ఉంటుందని వీరు చెబుతున్నారు…వినటానికి చిత్రంగా ఉంది.
చాలా మంది రిపబ్లికన్లు వేలాదిలో హతమైన చోట ఆ గుర్తులను ఈ రూపంలో తాజాకరించటం సరైన పని కాదని భావిస్తున్నారు.ఈ విషయంలో ఆంటీ దిఫమేషన్ లీగ్ వారు కొద్దిగా ఆలోచింపచేసే విధంగా స్పందించారు-‘ ఇట్ ఈస్ నాట్ ఎ క్వష్చన్ ఆఫ్  రైత్స్ బట్ అబవుట్ వాట్ ఈస్ రైట్…'(ఇది హక్కుల వ్యవహారం కాదు.ఔచిత్యం గురించి ఆలోచించాలి) వాళ్ల మాటలో చెప్పాలంటే అక్కడ ప్రాణాలు కోలుపోయినవారి బాధిత కుటుంబాలకు, వ్యక్తులకు తిరిగి బాధ కలిగించే చర్య ఇది.ఇది అవసరమా? అని వారు అడుగుతున్నారు!

నిజమే!

~~~***~~~
ఇమాం ఫైసల్ అబ్దుల్ రౌఫ్ (పైన ఫొటోలోని వ్యక్తి) గతంలో ఇస్లామిక్ ‘దావా ‘,షరియత్ అమెరికా రాజ్యాంగాన్ని పడగొట్టాలని పేర్కొనటం జరిగింది.

‘దావా ‘అనేది ‘జిహాద్ ‘ కంటే ప్రాచీనమిన అంశం అని తెలుస్తున్నది.దీని అర్థం ఇస్లాం కు ఆహ్వానం.ఇస్లామిక్ విషయాలను అధ్యయనం చేసే రాబర్ట్ స్పెన్సర్ దీనికి ఒక వివరం ఇస్తున్నారు.నమ్మకం లేని వారిని మతం  అనే మార్గం మీదకి తీసుకుని రావటం దావా అని అర్థమవుతోంది.అలా రాని వారిని ‘జిహాద్ ‘అంటే ఒక అంతర్యుధ్ధం చేసి సన్మార్గ్మ్ మీదకు తేవలసి యున్నది.ఇది ధార్మికమైన, తాత్వికమైన విషయం.ఆ పదాలను పెడ దారి పట్టించి ఇస్లామిక్ చట్టాలను,లేదా షరియత్ ను రాజకీయపరంగా ప్రజల మీద రుద్దే ప్రక్రియలు సాగుతున్నాయని వారు చెబుతున్నారు.

ఈ ఇస్లామిక్ సెంటర్ వెనుక ఉన్న వ్యక్తి 2001 లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘాతుకం సమయంలో ఈ రెండు పదాలూ ఉపయోగించి అమెరికాలో షరియత్ రావాలన్నట్లు చెప్పటం ప్రజలు ఇంకా మరచిపోలేదు!

ఇస్లాంలో ఒకధార్మిక విప్లవం రావలసిన అవసరం ఉన్నది.ఇంకొకరి చోటులోకి వెళ్లి దురాక్రమణలు చేసే కాలం చరిత్రలో జరిగిపోయింది.నాగరికత మరో దారిలో పయనిస్తోంది.

ఎన్ని కబుర్లు చెప్పినా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అరాచకానికి ఈ కట్టబోయే ఇస్లామిక్ సెంటర్ ఒక దౌర్జన్యపు గుర్తుగానే కనిపిస్తుంది కానీ మరొకటి కాదు.ఈ పనిని అన్ని విధాలా అడ్డుకోవలసిన అవస్రం ఉన్నది…

ఇస్లాం కు, మహమ్మదీయులకు ఇప్పుడు కావలసినవి రాతికట్టడాలు కావు.ఆత్మశోధన ద్వారా ప్రస్తుత సమాజానికీ, వారి మతానికీ,వారు నిజంగా నమ్మే ధర్మానికి మధ్య ఎక్కడో తెగుతున్న సంబంధాన్ని పునర్వ్యవస్థీకరించటం వారి కర్తవ్యం.నలుగురూ పూనుకుని ఈ దావా, జిహాద్ లూ ఒక అంతర్యుధ్ధం-ఆత్మ పరిశోధన  ద్వారా చేసి నిజాన్ని చాటాలి…

ఎంతో చిత్తశుధ్ధి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఇస్లామిక్ సెంటర్ ఆలోచన సబబా?

  1. నాకైతే ఈ వార్త చదివినప్పటినుంచి కడుపులో రగిలి పోతోంది. దీని మీద నాదైన శైలిలో చాలా పెద్ద పుట వ్రాసి, పబ్లిష్ చెయ్యడం మానేశాను. దీని వెనకాల ఒకటే ఆలోచన, నా అభిప్రాయం ఈ అంశానికి బలం చేకూర్చక పోయినా, అసందర్బంగా కెలికే వ్యక్తులు ఈ ఆలోచనని రాద్దాంతం చేస్తారని మాత్రమే.

    ఏది ఏమైనా మొట్ట మొదటిగా ఇలాంటి చర్య ముడ్డి గిల్లి జోలపాడుతున్నట్టుంది నాకు. అలాగే అది విజయ చిహ్నంగా వీరు తలచుకుంటూ చేస్తున్నారని నా మనసు బలంగా నమ్ముతోంది. మీరు గానీ చదివే వాళ్ళు ఎవ్వరైనా కానీయ్యండి, ఈ చర్య అహేతుకం మరియు కయ్యానికి కాలుదువ్వుతున్న వైనంలా నాకు అనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: