ఫొటో జవాబు


సవర్ సాప్ ఫ్రూట్…గ్రవియోలా చెట్టు నుంచి వచ్చునది. ఇది కెమొతెరెపీ కంటే చాలా ప్రభావవంతమైన మందు అని , కెమొతెరెపీ లాగా మంచి సెల్స్ ను చంపదని, కాన్సరస్ సెల్స్ ను నిర్మూలించటంలో ఉపయోగపడుతుందని వార్తలున్నాయి.ఇది నిజమా కాదా అని చర్చించే బదులు విజయవంతంగా సాగని కెమొతెరెపీ ముందు ప్రయోగించి చూడటంలో అభ్యంతరం ఏమిటో తెలియదు.మనిషి తత్వం చిత్రమైనది.ప్రాణాలు గుప్పెట్లోకి వచ్చినప్పుడు మరోలా వ్యవహరిస్తాడు.పరిశోధనలన్నీ ఊహల నుండి సాగునప్పుడు మానవాళికి ఉపయోగపడే విషయాన్ని శోధించటంలో నిజమైన విఙ్ఞాం ఉంది కానీ తర్కం పేరుతో కనిపించిన ప్రతిదానినీ తోసేయటం  వలన ప్రయోజనం ఏమిటో తెలియదు.హైపొతెసిస్ -ఒక ఊహ నుంచే సమస్త శోధన ప్రారంభమవుతుంది.ఏది శోధనకు పనికి రాగలదో ఏది పూర్తి గుడ్డి నమ్మకమో విచక్షణతో నిర్ణయించగలగటం మంచి లక్షణం.వినాయకుడు పలు త్రాగాడు అనగానే అందరం నవ్వుకున్నాం.జనమంతా చెంచాలూ, కెపిలరీ సిధ్ధాంతాలు గురించి మాట్లాడుకున్నాం. కొందరు కొద్ది సేపు ఇవన్నీ ఆపి ఆ రోజే అటువంటి విషయం చర్చలోకి చాలా ప్రాంతాలలో ఎందుకు వచ్చింది అని శోధించటం ప్రారంభించారు.ఏదో సత్యాన్ని కనుక్కోవటం కోసం కాదు.ఇటువంటి ప్రక్రియలను ఒక ఫ్రేం లో పెట్టి భవిష్యత్తు లో ఇతర విశ్లేషణలకు ఉపయోగించే ఆలోచన వారికి కలిగింది.ఆ సమయం లో ఇండియా టుడే లో సగటు మానవుల తొందరపాటు మాటలకు, నమ్మకాలకు దీటుగా వ్రాస్తూనే మరో ప్రక్క ఇటువంటివి కూడా వైఙ్ఞానికంగా పరిశోధనకు ఎలా ఉపయోగపడతాయన్నది వ్రాయటం జరిగింది.

Art is a lie which reveals the truth…

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “ఫొటో జవాబు

  1. ఇది నిజమా కాదా అని చర్చించే బదులు విజయవంతంగా సాగని కెమొతెరెపీ ముందు ప్రయోగించి చూడటంలో అభ్యంతరం ఏమిటో తెలియదు.

    నేను చెప్పింది దీనికి,
    అయ్యా ఒక్క మాట, అలా ఎవో గొప్ప గొప్ప లక్షణాలుగల పండ్లు, కూరగాయలు ఉండవు, అంత శక్తి కలిగిన అమృత ఫలాలు, దేవలోకంలో తప్ప మానవ లోకంలో ఉండవు, సామాన్య మానవుడికి ప్రయత్నంచి చూడొచ్చు అనిపిస్తుంది ఎమో, కానీ అసలు సాధ్యం అవ్వదు అని తెలిసి తెలిసి ఎలా కుదరదు అని చెప్పకుండా ఉండమంటారు??

  2. కిమో పనిచెయ్యకపొతే రేడియేషన్ కి వెళ్ళాలి, ఇప్పుడు సరైనా ట్రీట్ మెంట్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చినా జీవిత కాలాన్ని గణనీయంగా పెంచవచ్చు, ఇలా అనవసరపు పుకార్లు నమ్మి ఏ కొంచం లేట్ చేసినా అది ప్రాణానికే హాని, ఇలా అనవసర ప్రచారం చేయటం వలన నష్టాలు ప్రాణం, అందుకే చచ్చి ఊరుకుంటాడు అని రాసాను.

తారకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: