బిహార్ లో రోజుకో బ్రిడ్జ్!


బిహార్ ఈ రోజు మన దేశంలో అందరికంటే వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం-16.59% అభివృధ్ధి క్రిందటి ఫిస్కల్ సంవత్సరానికి చూపింది.నవంబర్ 2005 నుండి దాదాపు రోజుకొక బ్రిడ్జ్ ఈ రాష్ట్రంలో కట్టటం ప్రారంభించారు.గత నాలుగున్నర సంవత్సరాలలో 2100 వంతెనలు కట్టటం సామాన్యమైన పని కాదు.నాలుగు దశాబ్దాలుగా జరగనిది నాలుగు ఏండ్లలో జరిగింది.

బిహార్ రాహ్ట్ర పుల్ నిర్మాణ్ నిగం 2004-05 లో 42.62 కోట్ల టర్న్ ఓవర్ చూపగా నితిశ్ కుమార్ హయాం లో 2008-09 సంవత్సరానికి 858 కోట్ల టర్న్ ఓవర్ చూపించింది.

దాదాపు రెండు డజన్ల నదులు పారే ఈ రాష్ట్రానికి ఇది ఒక గొప్ప ఉద్యమం.ముఖ్యంగా గంగా నది పడమర నుండి తూర్పుకు దాదాపు 475 కిలోమీటర్లు సాగుతూ రాష్ట్రాన్ని విభజించటం విశేషం.ఈ నది మీద సాగు ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వం మంచి ప్రణాలికల ద్వారా చేపట్టింది.

ఇలాంటి కనెక్టివిటీ ఆర్థికాభివృధ్ధికి మంచి స్ఫూర్తి.ఈ రాష్ట్రం నుంచి ఈ వార్త వినటం నిజంగా గొప్ప విషయం.ఆరు రోజులలో చైనాలో ఒక పవర్ ప్లాంట్ తయారవుతుందని ఇటీవల విన్నాం.ఇది కూడా సామాన్యమైన విషయం కాదు.నితీశ్ గారికి అభినందనలు.

‘It’s not by regretting what is irreparable that true work is to be done, but by making the best of what we are. It is not by complaining that we have not the right tools,but using well the tools we have.What we are ,and where we are,is God’s providential arrangement-God’s doing…the manly and the wise way is to look your disadvantages in the face, and see what can be made of them.’ ~ Frederick W. Robertson

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

6 thoughts on “బిహార్ లో రోజుకో బ్రిడ్జ్!

 1. పెద్ద రాష్ట్రాలలో డబ్బు ఏ మూలన ఎలా ఖర్చయిపోతుందో తెలియదు. అవినీతి కూడా పెద్ద మొత్తాలలో జరిగే ఆస్కారం ఉంటుంది. సరైన నియంత్రణ ఉండదు. ఖర్చు చేయడంలో సమతుల్యత ఉండదు. భారీ మొత్తాలు ఒకే ప్రాంతంలో ఖర్చు చేస్తే, మిగితా ప్రాంతాల్లో అసంతృప్తులు. దాని వల్ల రాష్ట్రమంతటా అశాంతి. ఫలాలు కూడా ప్రజలకు చేరేలోపే నిర్వీర్యమౌతాయి.
  అదే చిన్న రాష్ట్రాలలో బడ్జెట్ ఎవరి పాలు వారిదవుతుంది. అవినీతి స్థాయి కూడా అలాగే తక్కువగా ఉంటుంది. నియంత్రణ మెరుగ్గా ఉండి, అభివృద్ధి వేగవంతంగా ఉంటుంది. ఫలాలు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో తొందరగా ప్రజలకు చేరుతాయి.
  అదే తేడా .. లాలూప్రసాద్ సమైక్య బీహారుకు, నితిష్ చిన్న బీహారుకు మధ్య స్పష్టంగా కనిపించేది.
  అలాగే బీహార్ నుండి వేరైన మరో చిన్న రాష్ట్రం ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ నుండి వేరైన చత్తీస్ఘర్ కు సంబంధించిన ప్రభుత్వ నివేదికను చూడండి.
  In terms of road connectivity, the state fared better than Bihar and West Bengal. While 59 per cent of villages in Jharkhand were connected with pucca roads, in Bihar the figure was just 44 per cent, and in West Bengal, 58 per cent.

  As far as the number of households with electricity and LPG connections were concerned, Jharkhand fared better than Bihar, but trailed Chhattisgarh. While 32 per cent of households in Jharkhand boasted electricity connection, in Bihar only 21.7 per cent of homes were lit up. Chhattisgarh was way ahead with 71.2 per cent electrification in 2007-08.

  బీహారును విభజించడానికి లాలూ అడ్డుపడ్డాడు. ఎందుకంటే దానివల్ల ఆయనలాంటి పెత్తందార్లు, అవినీతిపరులు నష్టపోతారు. ఇప్పుడు విభజన తరువాత మనం చూస్తున్నది అదేగా! లాలూ నష్టపోయాడు. బీహార్ లాభపడింది.

 2. @shayi విభజించడం వలన బీహార్ అభివృధ్ధి చెందలేదు.
  ఇప్పుడు కూడా లాలూ ముఖ్యమంత్రిగా ఉంటే బీహార్ ఇదివరకటిలాగే ఉండేది.
  వచ్చే ఎన్నికలలో కూడా లాలూ ఓడిపోతే బీహార్ దరిద్రం వదిలిపోతుంది.
  పాలించేవాళ్ళు మారనంతకాలం కలిసున్నా ఒకటే, విడిపోయినా ఒకటే.
  ఇది నేను చెప్పింది కాదు జె పి చెప్పింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: