ఆగస్ట్ 2010 రాశి ఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

మేష రాశి: అసంతృప్తి నుండి బయట పడతారు.మాసం మధ్యలో దూరప్రయాణం సంభవం. మాసం చివర కొత్త పనులు చేపట్టగలరు.మీకంటే చిన్నవారి ఆరోగ్యం ఆలోచింపచేస్తుంది.పెద్దలు సహకరిస్తారు.పుకార్లను నమ్మటం మంచిది కాదు.అలసట వలన తొందరపాటు ఆలోచనలకు గురి కాగలరు. ఈ మాసం మంచి ఫలితాలను ఇవ్వగలదు.కలసి వచ్చే సంఖ్యలు 1,11.

వృషభ రాశి: అదృష్టం కలసివచ్చే మాసం.ఇంటిలో సౌఖ్యం బాగుండగలదు.కుటుంబ సభ్యుల పురోగతి బాగుంటుంది. గతంలో వ్రాసిన ఒక డాక్యుమెంట్ చర్చలోకి రాగలదు.మీరు సాధించదలచుకున్నది మంచిదైనప్పటికీ దానికి అవలంబిస్తున్న మార్గం సరైనది కాకపోవచ్చు.పధ్ధతి  మర్చవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు రాణిస్తారు.చుక్కెదురు అనుకున్న వారు మాట కలుపుతారు.కొన్ని సందర్భాలలో తొందర పడతారు.పలుకుబడిగల మిత్రులు సహాయం చేస్తారు.ఈ మాసం కలసి వచ్చే అంకెలు 7,12.

మిఠున రాశి:  దైవీకమైన అనుభవాలు ఆలోచింపజేస్తాయి.ఉద్యోగంలో రాణిస్తారు.ఆరోగ్యం బాగుంటుంది.ఇంటిలోని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించగలవు.భాగస్వాములతో విభేదాలు తగ్గగలవు.కొత్త పనులు చేపడతారు.కొందరు రాజీ పడటానికి వస్తారు.పిల్లలు పోటీలలో మంచి ఫలితాలు పొందుతారు. మాసం పూర్వార్థంలో పెట్టుబడులు రాణించగలవు.రాజకీయలలో ఉన్న వారు వారి మీద వారికి తెలియకుండా జరుగుతున్న పర్యవేక్షణల పట్ల జాగ్రత్త వహించాలి. దుర్గా సప్తశ్లోకి చదవండి. ఈ మాసం మంచి సంఖ్యలు 5,10.

కర్కాటక రాశి: అజీర్ణం వలన కొంత ఇబ్బంది పడగలరు.రావలసిన సమాచారం అందగలదు.సత్కర్మలందు ఆసక్తి కలుగుతుంది.బంధువుల రాక ఉండవచ్చు.ఒక అనుకోని సంఘటన ఎదురవ్వగలదు.చివరకు మంచే జరుగుతుంది.డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి.ఒకరికి సహాయం చేయలేకపోయినందుకు విచారిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి.ఒక రంగాన్నే ఎంచుకున్న వారికి కొంత నిరాశ ఎదురు కాగలదు.విష్ణు సహస్రనామం చదవండి.మంచి సంఖ్యలు 2,12.

సింహ రాశి: ప్రభుత్వోద్యోగులకు,విద్యా రంగంలో ఉన్న వారికి మంచి మాసం.వ్యాపారులకు కొత్త వస్తువులతో నూతన అవకాశాలు రాగలవు. సన్నిహితులతో ఒక వివాదం ఏర్పడగలదు.మనసు నొప్పించే మాటలకు దూరంగా ఉండాలి.వ్యంగ్యం ససేమిరా పనికిరాదు.ఖర్చులు బాగానే ఉన్నా ఆదాయం కూడా బాగానే ఉంది.మాసం  మధ్యలో ఒక ఒప్పందానికి రాగలరు.ఇంటి విషయంలో ఖర్చు చేస్తారు.కొంత లాభాపేక్ష తగ్గిస్తే దీర్ఘకాలీనమైన లాభాలుండగలవు. ఈ మాసం  మంచి సంఖ్యలు 9,19.

కన్య రాశి: అనుకున్న చోటుకు బదిలీ కాగలదు.మీ ప్రతిభ మెప్పు పొందుతుంది.మీరు తలపెట్టిన సరికొత్త కార్యక్రమం విజయవంతమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.జమా ఖర్చులు ఒక్క సారి సరి చూసుకోవలసిన మాసం.కొత్త దంపతులకు కుటుంబ సౌఖ్యం,సంతాన లాభం ఉండగలదు.వ్యవసాయ రంగం లోని వారికి అభివృధ్ధి బాగుంది.   జీవితభాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి. శ్రీసూక్తం చదవండి.మంచి సంఖ్యలు 6,14.

తుల రాశి: స్థానచలనం ఉండగలదు.స్త్రీలకు  ప్ర్త్యేకమైన లాభదాయక మాసం. రాజకీయాలలోని వారికి మాసం ప్రారంభంలో అనుకోని సంఘటనలు,ప్రతిఘటనలు ఎదురు కావచ్చు. మాసం మధ్యనుండి పరిస్థితులు అనుకూలించగలవు. వ్యాపారులకు విదేశీ అవకాశాలు బాగున్నాయి. వృత్తులలోని వారికి మంచి గుర్తింపు లభించగలదు. మంగళవారాలు సంతకాలు చేయటం కానీ వివాదాలలోకి వెళ్లటం కానీ మానుకోవటం మంచిదని సూచించుట అయినది. కలసి వచ్చే సంఖ్యలు 6,17.

వృశ్చిక రాశి:  ఈ మాసం మంచి ఉత్సాహంతో ప్రారంభం కాగలదు. మిత్రుల మధ్య విభేదాలు ఏర్పడటం వలన మీకు కొన్ని అదనపు బాధ్యతలు సంక్రమించగలవు. మాసం మధ్యలో కొన్ని అద్భుతమైన అవకాశాలు లభించగలవు. ఒక దీర్ఘకాలీనమైన సమస్య పరిసమాప్తి కాగలదు.పెద్దల ఆరోగ్యం  పట్ల జాగ్రత్త వహించాలి. సరైన వైద్యం వలన పూర్తి నివృత్తి పొందగలరు. పబ్లిక్ తో వ్యవహారం చేసే వారికి ఒక సూచన ఉన్నది. మీ కరచాలనం తీరును గమనించి కొద్దిగా మార్పు చేసుకోవటం అవసరం…కలసి వచ్చే సంఖ్యలు 12,14.

ధను రాశి: ఉద్యోగంలో మార్పులు తప్పవు. పై అధికార్ల బదిలీల వలన కొన్ని కొత్త సమస్యలు తలెత్త గలవు. స్త్రీలకు సంబంధించిన వస్తువులతో వ్యాపారం చేసె వారికి మంచి లాభాలున్నాయి.ఒక స్థిరాస్తి వ్యవహారం కొన్ని కొత్త మలుపులు తీసుకోగలదు. దాన ధర్మాలకు మాసం చివర వారం వెచ్చిస్తారు. మీడియా వర్గం వారికి కొత్త అవకాశాలుండగలవు. ఇంటి కాగితాల మీద ఋణాలకు ప్రయత్నిస్తున్న వారు తగు జాగ్రత్తలు వహించాల్సిన మాసం.  శివుడికి అభిషేకం చేయించాలి. మంచి సంఖ్యలు 5,21.

మకర రాశి:  నమ్మించి మోసం చేసే వారికి దూరంగా ఉండవలసిన మాసం. ఇ-మెయిల్, లేదా ఇతర మాధ్యమాల ద్వారా వచ్చు సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. బంధు వర్గం లో తలెత్తే వివాదాలను పరిశీలించి వదిలేయండి. కొత్త ప్రదేశాలు చూస్తారు. సంగీత నృత్య రంగాలలోని వారికి మంచి ఫలితాలుండగలవు. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. మాసం చివర విలాసానికి సమయం వెచ్చిస్తారు. కలసి వచ్చు సంఖ్యలు 17,20.

కుంభ రాశి: నీటి కాలుష్యం చేత ఆరోగ్యం దెబ్బ తినగలదు. జాగ్రత్త వహించాలి.అధికమైన ఆలోచన, శ్రమ వలన శారీరిక సౌఖ్యం తగ్గ వచ్చు.ఒక ప్రయాణం మానుకోవలసి రాగలదు. సోదరీమణుల విషయం లో నిర్ణయం తీసుకోవలసి రాగలదు. కొంత కాలం వేచి తగు నిర్ణయం తీసుకోవటం మంచిది. ఉపాసన మార్గం లో ఉన్న వారికి మంచి అనుభూతులు ఉండగలవు. మీ విశ్లేషణా యుక్తులు మీకు తగు గౌరవాన్ని ఇవ్వగలవు. హనుమాన్ చాలీసా చదువగలరు. కలసి వచ్చు సంఖ్యలు 15,24.

మీన రాశి: సంతానం పురోగతి బాగుంది. మీకు ఇష్టం లేని పని చేయవల్సి వచ్చినందుకు కష్టంగా ఉండగలదు. మార్కెటింగ్ రంగం లో ఉన్న వారికి సదవకాశాలున్నాయి. మీ మాటకారితనం ఆకట్టుకుంటుంది.  ఒక మార్పును తగు రీతిలో గుర్తించి ముందుకు వెళతారు.  మీ మంచితనాన్ని ఇతరులు గుర్తించలేదనే బాధ మిగులగలదు. లోకం మంచి చెడుల మీద నడవదు! కేవలం వ్యవహారఙ్ఞానం మీద వ్యక్తులు ప్రవర్తిస్తారు. గమనించగలరు. కలసి వచ్చు సంఖ్యలు 25,27.

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “ఆగస్ట్ 2010 రాశి ఫలాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: