‘లవ్ జిహాద్ ‘-ప్రేమా,దగ!


కేరళ రాష్ట్రంలో ఒక అధ్యాపకుని చేయి నరకటాన్ని మనం చూసాం.హై కోర్టు మహమ్మదీయ కుర్రాళ్లు ఒక పన్నాగం ప్రకారం ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ అంటూ వల పన్ని మత మార్పిడి చేసి జిహాద్ కోసం పిల్లలను కంటూ నానా హంగామా చేస్తున్నట్లు గమనించి ఒక విచారణ కూడా చేపట్టింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద్దరు కేరళ యువతులు 2009లో ఫిర్యాదు చేసారు.డబ్బు చూపించి వాళ్లని వివాహం చేసుకోమని చెప్పి కొంత ‘జిహాదీ ‘ సాహిత్యం ఇచ్చి చదవమన్నారని వాళ్లు పేర్కొన్నారు.కోర్టు వారు పోలీసును విచారణ జరపమన్నారు.విశ్వ హిందు పరిషత్,చర్చ్ వారు వారి రీతిలో వారు సాక్ష్యాలు చూపించారు.పోలీసు వారు కూడా ఇందులో వెతికి తీయవలసినది చాలా ఉందని చెప్పినా ఆ తరువాత కోర్టు మరో బెంచ్ ఆ పనికి స్టే ఇచ్చింది…

విషయానికి రెండు నజరియాలున్నాయి.మొదటిది-తీవ్రమైన పర్యవసానాలున్న జిహాదీ గోల ప్రపంచవ్యాప్తంగా ఆటవికంగా సాగుతున్న తీవ్రవాద సమస్య.

రెండు-దానికి మతపరమైన రంగు పూసి ప్రజలను మభ్యపెట్టి ఆ చర్యలో భాగస్వాములను చేసుకోవటం.

మన ప్రశాసనం న్యాయవ్యవస్థలో ఇటువంటి వాటికి విడి విధానం తో మసలుకోవాలి.ఒక బాంబు పేలినప్పుడు ఏ మతం వారు,ఎంత డబ్బున్నవారు,ఎటువంటి వారు ప్రాణలు కోలుపోయారనేది హాస్యాస్పదం.తీవ్రవాదానికి ఎటువంటి లింకు కనిపించినా దానిని ఆదిలోనే పోటా లాంటి చట్టం ద్వారా నరికి అవతల పారేయవలసిన విధానం ఉండాలి.అల కాకుండా ఒక దిక్కుమాలిన సివిల్ కేసు చేసినట్లు ఒక బెంచ్ విచారించమని, ఒక బెంచ్ ఆపమని చెబుతూ ఉన్నంత కాలం సగటు భారతీయుడికి రక్షణ లేదు.

చిదంబరం సిగు లేకుండా లోక్ సభలో కసబ్ కు సామాన్యమైన విచారణకు మేము న్యాయస్థానంలో అవకాశం ఇచ్చాం…ఇది మా గొప్పతనం అని చెప్పాడు!

తాలిబాన్ పధ్ధతిలో చేయి నరికారు కేరళలో!అఫ్ఘాన్ లో కొన్ని గ్రామాలలో తాలిబాన్ కు విరుధ్ధంగా ఇటీవల ఏర్పడిన విద్రోహాలలో పాలు పంచుకుంటున్న స్త్రీల ను చూసైనా కొంత సిగ్గు ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందేమోననే ఆశ లేదు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

11 thoughts on “‘లవ్ జిహాద్ ‘-ప్రేమా,దగ!

 1. ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం
  ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.
  * ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
  * ఇలాంటి మంచిని కోరే ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.
  * హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి. ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.—ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).
  *ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)
  *బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష
  ఉగ్రవాదులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.
  *ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.—- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా

 2. వివాహేతర సంబంధాలు ఇస్లాంలో హరాం.జిహాద్ అంటే ధర్మ యుద్ధం.ఇటువంటివన్నీ నీచమైన పాపాలే.నేరం ఏమతస్తుడు చేసినా నేరమే.ఈ జిహాదులు చేసే వాళ్ళంతా హంతకులు.మానవత్వం లేని రాక్షసులు.నేను వీళ్లను నమ్మను.మానవత్వమే అన్ని మతాలకంటే మంచి మతం. మహానుభావుడు గురజాడ పలికిన మాటలు చూడండిః
  “మతములన్నియు మాసిపోవును
  జ్నానమొక్కటె నిలిచివెలుగును

 3. @కృష్ణశ్రీ
  మనం మాత్రం బ్రతికినంతకాలం మానవత్వాన్ని ఎక్కిస్తూనే పోదాం.వినేవాళ్ళే వింటారు.వినని వాళ్ళకు కసబ్,వికారుద్దీన్ ల గతే పడుతుంది.

 4. ముస్లిము పెద్దలిచ్చిన పిలుపులను, చక్కటి సందేశాలనూ రాసారు, బావుంది. కానీ ఎందుకిలా ఇస్లామిక ఉగ్రవాదం లోకమంతా ప్రబలుతోందో (ఇతర మతాల్లో అసల్లేదనను. కానీ ఉగ్రవాదమనగానే ఇస్లామిక ఉగ్రవాదమే గుర్తొస్తుంది. ఆ స్థాయిలో ఉంది మతమౌఢ్యం) ఈ మతపెద్దలు సీరియస్సుగా ఆలోచించాలి. వీళ్ళనిలా తయారుచేస్తున్నదేదో ఆ మతంలో ఉంది. సంస్కరించాల్సినదేదో ఆ మతంలో ఉంది. ఎందుకంటే వీళ్ళు మాట్టాడే మాటలు కూడా ఉగ్రవాదుల మాటలకు ఏమాత్రం తీసిపోవు.

  ఉదాహరణకు ఇది చూడండి:

  “ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.” – ఇవి ఒక ఉగ్రవాది మాట్టాడే మాటల్లాగా ఉన్నాయిగానీ, మతపెద్దలు చెప్పే మాటల్లా లేవు. నరకడం, రక్తం చిందించడం, ఏంటీమాటలు? శవసంస్కారం వద్దనడం ఏమి సంస్కారం? అసలు ఇస్లాము ఏమి నేర్పిస్తోంది?

 5. @చదువరి
  ఉగ్రవాదులు అమాయకుల్నిధారుణంగా చంపినప్పుడల్లా కాన్ఫరెన్స్‌లోని మతమౌఢ్య నాయకులలో ఇలాంటి ఆవేశపూరిత మాటలు పెల్లుబుకుతుంటాయి.మరోవైపు హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు పట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి అనే వాళ్ళూ ఉన్నారు.అహింసావాదుల సంఖ్య పెరుగుతూ ఉండాలంటే ఆ మత లేఖనాలలోని హింసా ప్రవృత్తి మీద ఎంత చర్చ జరిగితే అంత మంచిది.

 6. @చదువరి
  ఉదాహరణకు ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. అషూరా రోజు విశేషాలు:
  * భూమిమీద మొదటిసారి అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు
  * తొలి ప్రవక్త ఆదం(ఆదాము) ప్రార్ధన అల్లాహ్ అంగీకరించాడు
  * నూహ్ ఓడను జూడీ (ఆరారాతు) పర్వతాలపై అల్లాహ్ నిలిపాడు
  * ఫిరౌన్ (ఫరో) రాజు నుండిమూసా(మోషే)ను ఇశ్రాయేలు ప్రజలను అల్లాహ్ కాపాడి నైలు నదిని ఎర్రసముద్రాన్ని దాటిస్తాడు
  * ఇబ్రాహీం (అబ్రాహాము) ను నమ్రూదు రగిల్చిన అగ్నిగుండం నుండి అల్లాహ్ కాపాడుతాడు
  * ఇస్సాక్,యాఖూబ్ లకు కంటి చూపును అల్లాహ్ తిరిగి ప్రసాదిస్తాడు
  * యూసఫ్ (యోసేపు) ను చెరసాల నుండి అల్లాహ్ విడిపిస్తాడు
  * యూనుస్ (యోనా) ను తిమింగలం కడుపులోనుండి అల్లాహ్ ఒడ్డున పడేస్తాడు
  * దావూద్ (దావీదు) పశ్చాతాపాన్ని అంగీకరించి అల్లాహ్ క్షమిస్తాడు
  * అయూబ్ (యోబు) వ్యాధిని అల్లాహ్ స్వస్థపరుస్తాడు
  ఇన్ని మంచిపనులు జరిగిన నెలలో వాటిని గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్నతలు తెలిపే బదులు పీర్లను ఊరేగించటం,నిప్పులగుండం తొక్కటం,ఒళ్ళంతా రక్తం వచ్చేలా తమను తామే కొట్టుకోవటం లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు కొందరు. మీరు చెప్పినట్లు ఈ మతపెద్దలు సీరియస్సుగా ఆలోచించి వీళ్ళనిలా తయారుచేస్తున్న దేదో కనుక్కుని సంస్కరించాలి.

 7. *http://www.geetganga.org/audio/by/language/telugu లో 49 మంచి దేశభక్తి గీతాలున్నాయి.వినిపిస్తూనే ఉందాము.
  *”విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం” అనే పాట (గాయని తెలియదు) గతంలో ఎయిర్ టెల్ వారు హలో ట్యూన్ గా పెట్టారు.ఇప్పుడు ఆ పాట లేదంటున్నారు.అది దొరికే అవకాశం ఉందా?

 8. ఇక్బాల్ గారి సారే జహాసే అచ్చాకు అనువాదం.నిత్యసంతోషిణి గారు పాడారు.

  విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం
  సుస్వరాలమూ మేమూ మధుర వీణ నాదేశం దేశం [[విశాల]]

  ధృఢమైన పర్వతములతో ఆకాశాన్నందే నగం
  ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే [[విశాల]]

  ఈదేశ మాత ఒడిలో పారులేవేళ నదులూ
  ఈ సుందరనందన వనమే
  స్వర్గానికన్న మిన్న మిన్నా [[విశాల]]

  ఏమతమైనా కానీ కలహించడమూ నేర్పదూ
  భారతీయులం మనమూ భారతదేశం మనదీ అనాదీ[[విశాల]]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: