‘ఎడ్యుకేషన్-మై పర్సెప్షన్’-శ్రీ జయంత్ మునిగల గారి పుస్తకం


1986 లో ఐ.ఎ.ఎస్ లో చేరిన జయంత్ మునిగల గారు చాలా అనుభవం గడించారు.ఈ పుస్తకం కేవలం వారు అనుకున్న దృక్పథం గురించి కాదు.విద్య అనే అంశం విధానాలమధ్య, విధి వ్రాత అడుగున,విధాత పెట్టిన విధి వేధింపుల మరుగున తర తరాలుగా అలా మార్పులకు గురీవుతూ వస్తోంది.ముఖ్యంగా దీనిని ప్రశాసనంలో భాగమై చాలా దగ్గరగా పరిశీలించి కొన్ని నిజాలను పుస్తకరూపంలో చెప్పారు మునిగల గారు.

ఆయన చిన్నప్పుడి అదిలాబాద్ జిల్లాలో చదువుకున్న వ్యవహారం నుంచి ఈ నాటి విద్యారంగంలోని అంశాలను చెప్పారు.ప్రాథమిక విద్యావిధానాల లో సంకల్ప బలం లోపించటం వలన వాటి అమలులో ఎన్ని సమస్యలుంటాయో బాగా ఉదాహరణలతో చూపించారు. ముఖ్యంగా జార్ ఖండ్ లో ఒక్క ఉపాధ్యాయుని సహాయంతో బడులు నడిపించటం లాంటివి ఆలోచింపచేస్తాయి.

విద్యావిధానంలో అటకెక్కిన భాష మీద దృష్టిని ఆయన ప్రారంభంలోనే పునరుధ్ధరించారు.తరువాత చరిత్ర (హిస్టరి)ను పట్టుకోమన్నారు.శబ్దం-శబ్దబ్రహ్మము యొక్క మరో స్వరూపమే భాష.ఆలోచనను అలవోకగా అలంకరించేదే భాష. ఆలోచన నుంచే ఆత్మశోధన.ఆత్మశోధనకు అంకురార్పణ చరిత్రలో ంచే జరుగుతుంది.మనం నిలబడింది ఎక్కడో నిలబడం.మన వెనుక నిలబడ్డ చరిత్ర అనే నేపథ్యం ముందు దాని ప్రతినిధిగా నిలబడతాం.తరువాత లెక్కలలోకి వెళ్లమన్నారు.అంటే లెక్కలు వేసుకోమన్నారు.తరువాత విఙ్ఞానం లోకి రమ్మన్నారు.సమస్తం విఙ్ఞానం ద్వారా పరికించి చూడమన్నారు.శారీరిక స్వస్థత గురించి చిన్నప్పటినుండే చూడమంటున్నారు.

ఇలా చెప్పుకొస్తూ చాలా దేశాలలో విద్య అనే విషయంలో జరుగు ప్రక్రియలను చిన్నగా స్పృశించారు. వారి ఆలోచనలో ఒకటి నుండి నాలుగో తరగతి వరకు మొదటి దశ. ఇందులో భాషలు, గణితం ప్రధానంగా నేర్చుకోవాలన్నారు.సంస్కృతం మూడో భాషగా అధ్యయనం చేయమన్నారు. రెండవ దశ అయిదు నుండి ఏడవ తరగతి వరకు. ఇందులో హిస్టరీ,విఙ్ఞానం కలపాలి. అలాగే భాషల స్థాయి పెరిగి గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడటం వ్రాయటం గట్టి పడాలన్నారు.మూడవ దశ ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు.ఇందులో అన్నిటి స్థాయిని రాబోయే చదువులను అందుకునేలా పెంచమన్నారు!

వినటానికి చాలా సింపుల్ గా ఉంది.ఆలోచిస్తే అర్థమవగలదు.

మా ఇంటి వెనుక ఒక విద్యాలయం ఉంది.ప్రతి రోజూ అసెంబ్లీలో పిల్లలు ఏవో చదువుతూ ఉంటారు.
‘అవర్ రిచ్ అండ్ వేరీడ్ హెరిటేజ్ ‘అని చదివేటప్పుడు మైకు ముందు ఆ అమ్మాయి ‘…రిచ్ అండ్ వరీడ్ హెరిటేజ్ ‘అంటుంది. రోజూ అలానే చదువుతుంది.అధ్యాపకులు, ప్రధాన అధ్యాపకులు అలానే వింటూ ఉంటారు…ఇది తప్పు కాదు! మన హెరిటేజ్ నిజంగా వరీడ్ గానే ఉంది!!!

మునిగల గారి పాయింటు ఇప్పుడింకా అర్థమవుతుంది.

ఈ పుస్తకం చాలా చిన్నది.చాలా పెద్ద ఫాంటులో 111 పుటలు.ధర 116 రూపాయలు మాత్రమే!

ఈ పుస్తకాన్ని పాలపిట్ట పబ్లికేషన్ వారు ఇటీవల ప్రచురించారు.
ప్రతులు దొరకు చోటు:

Paalapitta Books

16-11-20/6/1/1

403 Vijayasai Residency

Saleemnagar

Malakpet

Hyderabad-500 036

Ph: 9848787284

paalapittabooks@gmail.com

Writer can be contacted at 09652044903, munigala2001@yahoo.com

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ఎడ్యుకేషన్-మై పర్సెప్షన్’-శ్రీ జయంత్ మునిగల గారి పుస్తకం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: