పడ్డ వాడు చెడ్డవాడు కాదు…


అమెరికాలో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నన్ను ఆలోచింపజేసింది.షర్లీ షెరాడ్ అనే ఒకావిడను (ఎగ్రికల్చర్ డిపార్ట్ మెంట్) ఒక బ్లాగ్ లో ఎడిట్ చేసిన వీడియో ద్వారా దుష్ప్రచారం చేసి పదవినుండి దింపటం. ..
ఈవిడ నల్ల జాతికి చెందిన ఆవిడ అవటం గమనార్హం.ఒక తెల్ల రైతును ఆదుకోకుండా అన్యాయం చేసినట్లు చెప్పటం జరిగింది. ఆ తరువాత ఆవిడ ఇచ్చిన స్పీచ్ యావత్తూ చూసిన తరువాత నిజానికి ఆవిడ అతని ఫార్మ్ ను కాపాడినదని తెలిసింది. ఆ తరువాత ఆవిడను వెనక్కి తీసుకున్నారు.(సదర్న్ కాపరేటివ్స్ లాండ్ అసిస్టెన్స్ ఫండ్ వ్యవహారం).

షర్లీ గారు వర్ణ వివక్ష నిజానికి సమస్య కాదు,ప్రస్తుతం ఉన్న సమస్య ఆర్థిక అసమానత అని చెప్పటం విశేషం.

అమెరికాలో పేదా గొప్పా మధ్య వ్యత్యాసం మన దేశంలో లాగానే పెరుగుతూ వస్తోంది.1988లో ‘లేనివారు ‘ 18% ఉండగా 2007లో 34% ఉన్నది.ఆదాయం అనేది అందరికంటే పైన ఉన్న వారికే గత కొన్ని దశాబ్దాలుగా  చేరుతూ రావటం శోచనీయం.

వాషింగ్టన్ పోస్ట్ లో మిషెల్ సింగిల్టరీ ఈ అంశాన్ని తీసుకుని అమెరికా ఆర్థిక పరిస్థితిని బాగా విశ్లేషించారు.సాంఘికపరమైన ప్రొపెన్సిటీ ఆర్థిక విధానాలతో ఎలా ముడిపడి ఉంటుందో అర్థమవుతుంది.

ఏ రంగాన్ని తీసుకున్నా ఉన్నవారి డామినేషన్ తప్ప మరొకటి కనిపించదు.రిసెషన్ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలన్నీ ఇలా దోహదపడినవే కానీ పేద, మధ్యతరగతి వర్గాలకు ఏమి జరిగిందని ఆవిడ ప్రశ్నిస్తున్నారు…

~~~***~~~
మన దేశంలోకూడా ఇదే జరుగుతున్నది. మధ్య తరగతి మానవుడు వెలిగి, ఆరి తిరిగి వెలిగి మరల అరగలదనిపించే వీధి దీపంలా పూర్తిగా వీధిన పడి యున్నాడు.చాలా మంది జీవించే స్టాండర్డ్ మారిందని చంకలు గుద్దుకున్నారు. అది నిజం కాదు.ఒక ఉద్యోగం ఊడినా, ఒక లోనూఅగినా చుక్కలు కనిపించేఆర్థిక శక్తి సరైనది కాదు.మార్కెట్ అటుగా పయనించ్టం వలన లక్సురీస్ అన్నీ అవసరాలుగా మారి ఉన్నాయి.ఆరోగ్యం విషయంలో,విద్య విషయంలో ఈ రెండు వర్గాల వారికీ ఉన్న ఇబ్బందులు అలనే ఉన్నాయి.నిరుద్యోగం రాబోయే కాలంలో తీవ్రమైన సమస్య కాగలదు…

షర్లీ గారి వ్యాఖ్య ఆలోచించవలసినది.ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆవిడ  స్పందించారు.సామాన్యంగా ఇలా జరిగినప్పుడు తన వర్గం వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవచ్చు.రాజకీయంగా లబ్ధి కూడా పొంద్వచ్చు.అలా కాకుండా దేశంలో ఏది ఎందుకు జరుగుతోండొ అని వివరించి చెప్పగలగటం గొప్ప విషయం.సమస్యలు అందరికీ వస్తాయి. సమస్యను ఒక ప్రక్రియలోంచి పరిశీలించి ఒక దృక్పథానికి చేరుకోవటం ఎప్పుడైనా మంచి పధ్ధతి.సమస్య నుంచి  చెత్త వ్యవహారం చేసి (చేసుకుని) కొత్త సమస్యలను సృష్టించటం మన దేశం లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం…

వ్యక్తి పూజలు, వర్గ పూజలు,నన్ను మించిన తెలివిగలవాడు లేడనే ఆలోచనలు మనకు ఎక్కువ, మక్కువ కూడా!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “పడ్డ వాడు చెడ్డవాడు కాదు…

 1. “………..సమస్య ఆర్థిక అసమానత……..”

  కరెక్ట్!

  ఫోర్బ్స్ మేగజైన్ లో ఇండియాలో యెవరిది యెన్నో స్థానం? అని చూసి ఆనందిస్తున్నాము!

  “…….లగ్జరీస్ అన్నీ అవసరాలుగా……”

  ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు యెందరు వాడుతున్నారు? మీరు కొని పడేసినా, మీ ‘పనిమనిషే’ ఆ పని చెయ్యాలి.

  1982 లోనే నేను కొన్న (డ్రయ్యర్ లేకుండా) వాషింగ్ మెషీన్, 1985 లోనే మూలన పడేసి, 1990 లో రెండువందలకమ్మేశాం!

  వస్తున్నాయి…..మళ్ళీ ఆరోజులు వస్తున్నాయి…….శ్రీశ్రీ రధచక్రాలు వచ్చే రోజులు వస్తున్నాయ్!

  తస్మాత్ జాగ్రత్త!

 2. చక్కనైన టప!

  వర్ణవివక్ష లేదు అనడం సబబు కాదేమో కానీ, అది ప్రథమసమస్య కాదు అనడం మాత్రం ఆవిడ ఆలోచనలలోని పరిపక్వతను తెలియజేస్తోంది. ఏదో సినిమాలో చెప్పినట్టు, “ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే కులాలు. డబ్బున్న కులం, డబ్బు లేని కులం”.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: