జపాన్ ప్రధాని భార్య శల్యసారథ్యం!


సారథి సగం యుధ్ధం చేస్తాడు!-కరెక్టుగా ఉంటే.అలా లేకపోయినా చేస్తాడు-అటు వైపు నుండి!
నోబుకో కాన్ (జపాన్ ప్రధాని నావుటో కాన్ భార్య) ఒక పుస్తకం వ్రాసింది. దాని పేరు, ‘యు ఆర్ ప్రైం మినిస్టర్, సో వాట్ విల్ ఛేంజ్ ఇన్ జపాన్ ?’
పేరు కూడా భలేగా ఉన్నది.   ఈ వారమే విడుదలయిన పుస్తకం ఇది.వాళ్లాయన ఈ పదవికి ఏ మాత్రం పనికిరాడని అందులో ఈమె పేర్కొంది!ఆయన వ్యక్తిత్వంలో  చాలా సమస్యలున్నాయని,ఇంటిపనులు ఏమీ చేయడని,కోపం అధికంగా ఉంటుందని చెప్పింది.మామూలుగా మాట్లాడితే బాగానే మాట్లాడగలడని,వ్రాసినవి చదివితే బాగుండదని కూడా చెప్పింది.జూన్ లో పదవి చేపట్టిన ఈయన ఆమెను ఇంటిలోని ‘విపక్షం ‘అంటాడు.ఈ పుస్తకం చదవాలంటే భయంగా ఉంది అన్నాడుట. అసలే ఈ మధ్య వాళ్ల అప్పర్ హవుస్ లో ఎన్నికలు ఓడిపోయి ఉన్నాడు.63 సంవత్సరాల వయసు గల ఈయన జనం లో ప్రాచ్ర్యం కోసం కొద్దిగా ఇబ్బందులు కూడా పడుతున్నాడు…
ఇప్పుడు ఈ పుస్తకం ఒకటి.
కేరంస్ ఆడుతున్నప్పుడు మనకు పార్ట్నర్ గా కూర్చున్నవారు అవతలి ప్రక్క వారి కాయిన్స్ కన్నం లోకి వేసేస్తూ ఉంటారు. అప్పుడు అనుకోవలసింది ఏదీ లేదు!మనం ఒంటరిగా ముగ్గురిని ఎదుర్కొని ఆడుతున్నాం  అనుకుని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి…
ఈ రచయిత్రి కొత్త ఇంటిలోకి పెద్దగా సామాన్లు తేలేదని కూడా చెప్పింది.ఎందుకంటే సెప్టెంబర్ వరకూ ఈయన పదవిలో ఉంటాడని నమ్మకం లేదుట!
ఔరా!
కాకపోతే ప్రధాని గారు కూడా అంత గాభరా పడక్కరలేదు.పెరటి వైద్యం పనికిరాదన్నట్లు ఇంటిలోని మేధావుల గురించి కుటుంబ సభ్యులకు తెలియదన్నది మనకు అప్పుడప్పుడు  తెలుస్తూ ఉంటుంది.అది జపాన్ జనం ఎలాగో తెలుసుకుంటారు. మా ఆయన మహా గొప్ప మనిషి అని చెప్పి ఉంటే అందులో విశేషం ఏమీ లేదు.
మరొకటి ఉంది. జనం లో భార్యా బాధితులై ఉన్న పురుషులంతా దెబ్బతో ఈ ప్రధాని పక్షం అయిపోయే అవకాశం లేకపోలేదు.ప్రతిపక్షం వారు వెంటనే గమనించి పాపం ఆమెకు ఏమీ తెలియదు,ఈ ప్రధాని అలా పుస్తకం వ్రాసి ఆమె పేరు పెట్టాడు అని ప్రచారం చేయగలరు!
మొత్తానికి ‘మా ఆయన ప్రధాని పదవికి పనికిరాడు ‘అని ఒక మహిళ పుస్తక రూపంలో నిజం చెప్పినందుకు  ముచ్చటగా ఉందనే చెప్పాలి!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: