జాతీయ బ్యాంకులు మహమ్మదీయులకు ఖాతాలను నిరాకరిస్తున్నాయా?


మైనారిటీ కమిషన్ వారికి వస్తున్న కంప్లయింట్లలో ఇటీవల ఎక్కువగా ఉన్న వాటిలో జాతీయ బ్యాంకులు మన దేశంలో మహమ్మదీయులను ఖాతాలు  తెరవనీయటం లేదు అని!
(బి.బి.సి వార్త)

మామూలుగానే ఈ మధ్య జాతీయ బ్యాంకుల వ్యవహారం ప్రజలలో చాలా అసంతృప్తిని రేకెత్తించింది. కార్పొరేట్ బాంకులు  మామూలు మధ్య తరగతి వాడు లోపలికి రాగానే ఫినైల్ బాటిల్ కోసం అటూ ఇటూ చూస్తాయి.

జాతీయ బాంకులలో ఎక్కువగా దిష్టి బొమ్మలను,దయ్యం పట్టిన వాళ్లని ఉద్యోగాలో చేచుకున్నట్లు వ్యవహరిస్తున్నారు.ఎవరో వాళ్లని దోచుకుపోతారనేమో ఈ మధ్య తలుపులు వేసేసి కూర్చుంటున్నారు. ఒక బాంకులో చూసాను.గ్రిల్ డోర్ నా లాంటి బక్క ప్రాణం కూడా దూరలేనంతగా తెరచి పెట్టాడు. ఒక మహిళ చంటి పిల్లను ఎత్తుకుని వచ్చింది. ఆ దికుమాలిన సెక్యూరిటీకి కనీసం ఆవిడ దూరలేకపోతోందనే ఆలోచన కూడా లేదు. కొద్దిగా గ్రిల్ డోర్ ను నెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అంతా అవుట్ సోర్సింగ్! అవుట్ సోర్సింగ్ చేసే సోర్సరీ మీద మన దేశం ప్రస్తుతం ఇలా నడుస్తోంది.

మహమ్మదీయుల వద్దకి వద్దాం…

బాంకు వారు ఇస్తున్న వివరణ ఏమిటంటే వారికి విధానాల ప్రకారం సరైన ఆర్థిక స్తోమత లేదు కాబట్టి అలా చేస్తున్నాం అన్నారుట!

మన  రాష్ట్రంలో 90 వేల మహమ్మదీయ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను జమ చేసుకునేందుకు కూడా వీరు దోహద పడలేదంటే బాధగా ఉంది.మరి విద్యార్థుల విషయం లో బాంకులలో ప్రత్యేకమైన విధానాలున్నాయి కదా? వాటి సంగతి ఏమిటి?

ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించవలసిన అవసరం ఉన్నది.మామూలుగానే అసలు ఒక ఖాతా తెరవాలంటే సామాన్యుడికి  సమస్యలే! అయిదు శాతం దొంగపనులు చేస్తారని 95% ప్రజలను ఇబ్బంది పెట్టే నియమాలను తయారు చేసి కాళ్లు జాపుకుని పడుకోవటం అలవాటయిన  దొరబాబుల దేశం ఇది.

మాకెందుకని మరబొమ్మలలా పని చేస్తారు సిబ్బంది.ఇందుకు కాదు కోట్లు వెచ్చించి శిక్షణ ఇచ్చి పనులలో పెట్టేది.పబ్లిక్ సర్వీస్ ఈస్ పబ్లిక్ సర్విస్.

పబ్లిక్ సర్విస్ యావత్తూ అవినీతి పరుల దొరబాబుల దగ్గర పెట్టి ఆ తెల్ల దొర వాడి తాతలను కూర్చోపెట్టి వెళ్లిపోయాడు! ఈ రిపబ్లిక్ నే పబ్లిక్ గా దోచుకోమన్నాడు!

మహమ్మదీయ సోదరులతో  విచక్షణతో కాదు…మైనారటీలని కూడా కాదు.సగటు  భారతీయులుగా వ్యవహరించటం చాలా అవసరం. వోటు బాంకులు తెచ్చే సాంఘికపరమైన పర్యవసానాలను ఎవరూ పట్టించుకోవటం లేదు.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “జాతీయ బ్యాంకులు మహమ్మదీయులకు ఖాతాలను నిరాకరిస్తున్నాయా?

 1. It is not a thing to get worried. I heard that they would be rejected for Credit Cards and passports too. Generally we get passports if you apply for 1st or 2nd time. But for them mostly nth time you have to submit applicatioins.

  Credit card bills kosam intiki vaste… bank vaallani bootulu thitti pampistaaru vaallu. They have some traits like this. Idanthaa vaallu chesukunnade.

  Manam ibbandi padipoyi vaalla gurinchi baadha padaalsina avasaram emee ledu. Peda vaallu muslims lo noo unnaaru hinduvullonoo unnaaru.

  Govt. emee cheyyadu evarikosamoonoo. We are leading lives keeping ours in stupid leaders’ hands. We have to bear with it sir!

  Chinna

 2. వేదాంతం శ్రీపతి శర్మ గారూ
  “మన రాష్ట్రంలో 90 వేల మహమ్మదీయ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను జమ చేసుకునేందుకు కూడా వీరు దోహద పడలేదంటే బాధగా ఉంది.మహమ్మదీయ సోదరులతో విచక్షణతో కాదు…మైనారటీలని కూడా కాదు.సగటు భారతీయులుగా వ్యవహరించటం చాలా అవసరం” అన్నారు మీరు.ధన్యవాదాలు.బ్రతుకు తెరువు విషయాలపై ముస్లిం నేతలలో ఈ మాత్రం స్పందన కూడా లేదు.ఎప్పుడూ మతమూ నమాజు తప్ప ఇహలోక విషయాలు వారికి పట్టటం లేదు.బువ్వ ఉంటేనే కదా భక్తి చేయగలిగేది?బాంకు వారు ఇస్తున్న వివరణ ప్రకారం భారతీయ ముస్లిములకు బ్యాంకు ఖాతా తెరిచే సరైన ఆర్థిక స్తోమత లేదు.అది ఎప్పటికి కలుగుతుందో మరి.ముస్లిములకు ఖాతాలు తెరవకుండా వేధించిన బ్యాంకు ఉద్యోగులు పునర్జన్మలో ముస్లిములై పుడతారనే భయం కలిగితేనన్నా బాగుండును.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: