విధి


ఆర్మీ లోని మిత్రులతో బాగా పొద్దు పోయే వరకూ కూర్చున్నాను.వాళ్లు రకరకాల ప్రశ్నలు వేసారు. చేతులు చూడమన్నారు. రాత్రి పూట చూడనన్నాను. ఫేస్ రీడింగ్ చేయమన్నారు. సరదాగా ఒకరిద్దరికి చేసాను.అందరూ భవిష్యత్తు గురించి అడుగుతుంటే ఒక ఆలోచన వచ్చింది.
‘మీరంతా సైనికులు. వీటి గురించి మీకెందుకు?’,అన్నాను.
ఒకాయన సిగరెట్ ముట్టించాడు.
‘మా మధ్యనే జరిగింది చెబుతాను వినండి…’,అన్నాడు. అందరం కుర్చీల్లోకి వెనక్కి వాలాం.
‘ఆ రాత్రి కూడా బాగా పొద్దు పోయింది.కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.కొద్దిగా ఛలిగా కూడా ఉంది.పునీత్ ఒక మాటన్నాడు.రేపు ఆదివారం కదురా, ఈ రాత్రి రెండో ఆటకి వెళదాం, అన్నాడు. మాలో ఇద్దరికి ఇష్టం లేకపోయినా ఆ మాటా, ఈ మాటా అనుకుని అందరం సిధ్ధమయ్యాం.ఈ కాంపస్ కి వెనుకనుండి మరో దారి ఉంది. అందులోంచి అందరం బైకుల మీద రోడ్డెక్కాం. హాలు పెద్ద దూరం కాదు.కొంత దూరం వెళ్లాక ఎందుకో పునీత్ ఆగిపోయాడు.
ఏమయింది అని అడిగాం.ఎందుకో వెనక్కి వెళ్లిపోవాలనిపిస్తోంది, అన్నాడు.నువ్వే కదరా అందరినీ బయలుదేరదీసావు? అని అడిగితే అదోలా మొహం పెట్టాడు.
ఏమో రా, మీరు వెళ్లండి, అన్నాడు. సరే అతనికి మూడ్ బాలేదని వెళ్లమని చెప్పి మేము ముందుకు సాగిపోయాం. అంతే! వెనుక పెద్ద శబ్దం అయింది. అందరం ఆగి బళ్లను వెనక్కి తిప్పాం. పునీత్ ఎక్కడో పడి ఉన్నాడు, అతని బండీ ఎక్కడికో జరిగిపోయి ఉంది. ఒక లారీ ఇటు వస్తూ రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయి ఉంది!
పునీత్ వెనక్కి ఎందుకు వెళ్లాలని ఎందుకన్నాడో అర్థం కాలేదు. అలా వెనక్కి వెళ్లి మళ్లీ రాలేదు!’
ఒక్క సారి మబ్బుల్లోకి చూసి నిట్టూర్చాను…
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

6 thoughts on “విధి

 1. ప్చ్! ప్చ్!

  ఈ సృష్టి లో జవాబులేని ప్రశ్న అంటే వొకటే “యెందుకు?” అనేది!

  ఒకవేళ జవాబు చెప్పేందుకు ప్రశ్నించుకుంటూ పోయినా, ఆఖరికి వచ్చే జవాబు “విధి” లేదా “దైవఘటన”! అంతే!

  అయినా, నూతన విఙ్ఞానమంతా ఈ ప్రశ్నలోంచే పుట్టుకొచ్చింది! చూశారా!

  ఈ విషయాన్ని బాగా పట్టుకొని, ప్రకటించారు.

  మీకు నా ప్రగాఢ సానుభూతి!

 2. ఎందుకు? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరక్కపోవచ్చు.
  కానీ ఎప్పటికైనా మానవునికి కేవలం తార్కిక జ్ఞానం ద్వారానే తెలుస్తుంది అనుకునేవారు హేతువాదులు/నాస్తికులు.
  ఏదో మనకు తెలియని శక్తి (దాన్నే దైవం అని చాలా మంది నమ్ముతారు) సహకారంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చని నమ్మేవారు ఆస్తికులు.

  1. Quite right.
   Perceptible Knowledge is only conceptual. Consciousness is not inside us. We are inside the Almighty’s super consciousness which cannot be conceptualized! (Conceptually, the sky might be above us. Otherwise, where’s the direction?)
   No event in the Universe is an accident…except perhaps the Universe itself!
   Your analysis is apt.

   Sripati

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: